Saiyami Kher
-
సాహసానికి సై యామి... భయమా... డోంట్ ఖేర్
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన చిరకాల స్వప్నం ‘ఐరన్ మ్యాన్ 70.3’ గురించి చెప్పినప్పుడు అభినందించిన వాళ్ల కంటే అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. ‘సినిమాల్లోలాగా అక్కడ డూప్‌లు ఉండరు’ అని నవ్వారు కొందరు. అయితే ఇవేమీ తన సాహసానికి అడ్డుగోడలు కాలేకపోయాయి.ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా ‘ట్రయథ్లాన్: ఐరన్‌మ్యాన్’ రేస్ గురించి చెబుతారు. 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల బైసికిల్ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగుతో ‘ఐరన్ మ్యాన్’ రేసు పూర్తి చేసిన తొలి బాలీవుడ్ నటిగా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఫ్రెండ్స్‌కు తన కల గురించి సయామీ ఖేర్ చెప్పినప్పుడు ‘నీలాగే చాలామంది కలలు కంటారు. రేస్ పూర్తి చేయని ఫస్ట్ టైమర్లు ఎందరో ఉన్నారు’ అన్నారు వాళ్లు. వెనక్కి తగ్గిన వారిలో తాను ఒకరు కాకూడదు అనుకుంది ఖేర్. ఫిబ్రవరిలో ‘ఐరన్ మ్యాన్’ రేస్ కోసం ట్రైనింగ్ మొదలైంది. మొదట్లో 3 కిలోమీటర్లు పరుగెత్తడం, ఈత ‘అయ్య బాబోయ్’ అనిపించేది. త్వరగా అలిసి పోయేది. సాధన చేయగా... చేయగా... కొన్ని నెలల తరువాత పరిస్థితి తన అదుపులోకి వచ్చింది. అప్పుడిక కష్టం అనిపించలేదు. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటైంది.రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి శిక్షణ కోసం సిద్ధం అయ్యేది. ట్రైనింగ్‌లో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి లోతుగా ఆలోచించేది. ‘శిక్షణ బాగా తీసుకుంటే వాటిని అధిగమించడం కష్టం కాదు’ అని కోచ్ చెప్పిన మాటను అనుసరించింది.‘ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మారథాన్లలోపాల్గొంటున్నాను. అయితే నా దృష్టి మాత్రం ఐరన్ మ్యాన్ రేస్ పైనే ఉండేది. నా కలను నెరవేర్చుకోడానికి సన్నద్ధం అవుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. దీంతో నా కల తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికైనా నా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటుంది సయామీ ఖేర్.ఖేర్ మాటల్లో చెప్పాలంటే ‘ఐరన్ మ్యాన్ రేస్ అనేది శారీరక సామర్థ్యం, సహనానికి పరీక్ష.‘ఆటలు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతం చేస్తాయి. ఐరన్ మ్యాన్ రేస్ పూర్తి చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం నా నట జీవితానికి ఉపయోగపడుతుంది’ అంటుంది 32 సంవత్సరాల సయామీ ఖేర్.ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‘ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్’ అనేది వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటిసి) నిర్వహించే రేసులలో ఒకటి. దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పోర్ట్ ఈవెంట్‌గా చెబుతారు. ఈ రేసు సాధారణంగా ఉదయం ఏడుగంటలకు మొదలై అర్ధరాత్రి ముగుస్తుంది. ఓర్పు, బలం, వేగానికి సంబంధించి ట్రయథ్లెట్లు రేసుకు కొన్ని నెలల ముందు కఠిన శిక్షణ తీసుకుంటారు.అయిననూ ఛేదించవలె...గత సంవత్సరం బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డాను. కొన్ని నెలల రెస్ట్. మరోవైపు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు అవసరమా!’ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు సరి కదా ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. ‘ఏదైనా చేయాలి అని మనసు బలంగా అనుకుంటే దానికి అనుగుణంగా శరీరం కూడా సన్నద్ధం అవుతుంది’ అంటారు. ఇది నా విషయంలో అక్షరాలా నిజం అయింది.అయితే ప్రతికూల పరిస్థితులు మళ్లీ ముందుకు వచ్చాయి. రేసుకు వారం ముందు కెనడాకు నా ప్రయాణం (వర్క్ ట్రిప్) పీడకలగా మారింది. విమానాలు ఆలస్యం కావడం నుంచి కాంటాక్ట్స్ కోల్పోవడం వరకు ఎన్నో జరిగాయి. నా బ్యాగ్‌లు మిస్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం సహకారంతో ఆ సమస్య నుంచి ఎలాగో బయటపడ్డాను. ఇక ‘ఐరన్ మ్యాన్ రేస్’లో నా గేర్ మొదలైనప్పుడు గాలులు తీవ్రంగా వీచడం మొదలైంది. అయినప్పటికీ ఈత కొట్టడానికి, రైడ్ చేయడానికి వెళ్లాను. నా మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఆస్వాదించాలని గట్టిగా అనుకున్నాను. నీరు గడ్డకట్టినప్పటికీ రేసును ఒక వేడుకలా భావించాను. కోల్డ్వాటర్లో 42 నిమిషాలు ఈదాను. – సయామీ ఖేర్ -
అక్కడ తొలి సినిమా ఫ్లాప్.. ఛాన్సులు చేజారిపోయాయి: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ సయామీ ఖేర్.. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ మేనకోడలు అయినప్పటికీ అందరిలాగే ఇండస్ట్రీలో తనకూ తిప్పలు తప్పలేదంటోంది. రేయ్ అనే తెలుగు సినిమాతో 2015లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిర్జ్య (2016) మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అయితే మిర్జ్య మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీని వల్ల ఎదుర్కొన్న పరిణామాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.రిజెక్ట్మీ మొదటి సినిమాను మీరు ఎంచుకోవద్దు.. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని డైలాగ్ ఉంటుంది. మిర్జ్యకు ముందు కొన్ని సినిమాల్లో నన్ను రిజెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ కమర్షియల్ సినిమా కాదని దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా సర్ చెప్పారు. సంతకం చేసేటప్పుడు కూడా నువ్వు నిజంగానే ఇందులో భాగం కావాలనుకుంటున్నావా? అని అడిగారు. నవ్వుతూనే సంతకం చేశాను.హిందీలో తొలి సినిమా ఫ్లాప్సినిమా ఫ్లాప్ అయింది. కానీ రాకేశ్ మెహ్రా డైరెక్షన్లో చాలా నేర్చుకున్నాను. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం ఎంత ముఖ్యమనేది తెలుసుకున్నాను. మిర్జ్య తర్వాత రెండు సినిమాలకు సంతకం చేశాను. కానీ చివరకు నన్ను పక్కన పెట్టేసి వేరేవాళ్లను తీసుకున్నారు. వాళ్ల సపోర్ట్ఈ ఇండస్ట్రీకి నేను సెట్ అవుతానా? ఇక్కడ ఉండగలనా? అని ఒత్తిడికి లోనైనప్పుడు అనురాగ్ కశ్యప్, నీరజ్ పాండే, ఆర్ బల్కి వంటి వారు నాకు సపోర్ట్‌గా నిలబడేవారు. ఇప్పుడు నేను నాకు వచ్చిన ఆఫర్లను కాకుండా మనసుకు నచ్చినవాటినే ఎంపిక చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవలే శర్మాజీ కీ బేటీ సినిమాతో అలరించిన ఈ బ్యూటీ తెలుగులో వైల్డ్ డాగ్, హైవే చిత్రాల్లో మెరిసింది.చదవండి: కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి -
18 ఏళ్ల వయసులో నాకు తప్పుడు సలహా ఇచ్చారు: హీరోయిన్
'రేయ్' అనే తెలుగు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది సయామీ ఖేర్. టాలీవుడ్తోనే తన కెరీర్ మొదలైనప్పటికీ బాలీవుడ్లోనే సక్సెస్ రుచిచూసింది. మధ్యలో వైల్డ్ డాగ్, హైవే అంటూ తెలుగు చిత్రాలు కూడా చేసింది. ప్రస్తుతం ఆమె ఘూమర్ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నాకు చాలారకాల సలహాలు, సూచనలు చేసేవారు. నీ ముక్కు బాలేదు, పెదాలు సరిగా లేవు. సర్జరీ చేయించుకో అని చెప్పేవారు. 18 ఏళ్ల వయసులో ఆ పని చేయమని ప్రోత్సహించడం నాకు చాలా తప్పనిపించింది. మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలే కానీ కొత్తగా ఈ రూల్స్ ఏంటి? అనుకున్నాను. అయినా ఇవన్నీ నేనసలు లెక్క చేయలేదు. కానీ ఏదో ఒకరోజు ఈ ఇండస్ట్రీలో అటువంటివి కనుమరుగైపోవాలని కోరుకుంటున్నాను. మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. అందరిలోనూ అవగాహన వస్తోంది అని చెప్పుకొచ్చింది. కాగా సయామీ ఖేర్ నటిస్తున్న ఘూమర్ క్రికెట్ క్రీడా నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులో సయామీ ఒక చేతు కోల్పోయిన క్రికెటర్‌గా కనిపిస్తుంది. అభిషేక్ బచ్చన్ ఆమె కోచ్‌గా కనిపించనున్నాడు. షబానా అజ్మీ, అంగద్ ఖేర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పా డైరెక్టర్ ఆర్ బల్కి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 18న రిలీజ్ కానుంది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త సినిమాలు -
కొందరు చాలా అసభ్యంగా మాట్లాడేవారు.. నటి సయామి ఖేర్ ఆవేదన
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె టాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి 2015లో ఎంట్రీ ఇచ్చింది. 'రేయ్' మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది మరాఠీ భామ. తాజాగా ఆమెకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు సయామి ఖేర్ ఆవేదన వ్యక్తం చేసింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట) సయామి ఖేర్ మాట్లాడుతూ.. 'తాను కెరీర్ ప్రారంభంలో కొందరు లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలంటూ వెటకారంగా మాట్లాడేవారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ఎవరైనా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. తాను మందంగా ఉన్నందున అలాంటి వ్యాఖ్యలకు బాధ పడలేదు. కానీ అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం.' అంటూ వాపోయింది బాలీవుడ్ భామ. ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు మరింత సున్నితంగా ఉండాలని సయామి సూచించారు. సమాజంలో చాలా సెన్సిటివ్‌గా ఉండేవారూ ఉన్నారు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. లేకపోతే ఎంతో ప్రతికూలత ఉంటుందని సయామి అన్నారు. కాగా.. ప్రస్తుతం అశ్విని అయ్యర్ తివారీ వెబ్ సిరీస్ ఫాదు: ఎ లవ్ స్టోరీలో సయామి కనిపించనుంది. ఈ సిరీస్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆనంద్ దేవరకొండ`హైవే` కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది!
Anand Deverakonda Highway Concept Poster: 'పుష్పక విమానం' సినిమాతో మంచి విజయం సాధించాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్. మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. తాజాగా నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘‘118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. మా బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ – ‘‘ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్‌లో ఉంటుంది`` అన్నారు. #KVGuhan Stuns Yet Again Amazing Concept Posters From Sensational #AnandDevarakonda's Nerve-Wracking Crime Thriller #Highwaymovie💥 ⭐Ing @ananddeverkonda #manasaradhakrishnan @SaiyamiKher @nowitsabhi A @kvguhan 's Directorial📽️ Produced by #VenkatTalari 💸 🎹 @simonkking pic.twitter.com/ZDdGPE4J6x — BA Raju's Team (@baraju_SuperHit) December 2, 2021 -
కృతీ సనన్‌కు ఫ్యాన్స్ బహుమతులు.. స్టెప్పులేసిన హన్సిక
♦ బ్లర్‌గా ఉన్నా వీడియో భలేగుంది కదూ అంటోన్న నభా నటేష్ ♦ బూమ్‌ర్యాంగ్ చేసిన కేతికా శర్మ ♦ మేము ఎందుకు నవ్వుతున్నామో తెలుసా? అని అడుగుతోన్న రెజీనా కసాండ్రా ♦ క్యూట్ ఫొటో షేర్ చేసిన కీర్తి సురేశ్ ♦ ఇంకో మిషన్ షురూ అంటోన్న సయామీ ఖేర్ ♦ ఛాలెంజ్‌లను స్వీకరించాలంటున్న అరియానా గ్లోరీ ♦ కోవిడ్ నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన నివేదా థామస్ ♦ ఇది జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే అంటోన్న తమన్నా భాటియా ♦ ఈ పోజ్ ఎట్లుంది అంటోన్న పూజా హెగ్డే ♦ కృతీ సనన్‌కు అభిమానుల బహుమతులు ♦ చిందులేస్తున్న హన్సిక View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Saiyami Kher (@saiyami) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ
టైటిల్ : వైల్డ్‌డాగ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితురులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : అహిషోర్ సాల్మన్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : షానిల్ డియో విడుదల తేది : ఏప్రిల్ 02,2021 వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగ్.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించిందా? కింగ్ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం. కథ విజయ్ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్మెంట్లో ఆయన్ను అంతా ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసి సస్పెండ్ అవుతాడు విజయ్ వర్మ. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్ (అతుల్ కులకర్ణి).. సస్పెండ్ అయిన ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టేకప్ చేస్తాడు. తన టీమ్‌తో కలిసి విజయ్‌వర్మ బాంబు బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ను మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్ఐఏ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్ లీడ్ చేస్తున్న ఎన్ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్ అయిన ఆర్యా పండిట్ (సయామీ ఖేర్)ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ. నటీనటులు ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జున. ‘వైల్డ్‌డాగ్’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగ్. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్లో అదరగొట్టాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ జీవించేసింది. చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మీర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ సీరియస్ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్ ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాగార్జున నటన తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ అంశాలు లేకపోవడం ఫస్టాఫ్ -అంజి శెట్టె -
ఖేర్‌తో కేర్‌ఫుల్
సయామీ ఖేర్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఆమె చాలా డేర్ అండ్ డాషింగ్. మరి.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాళ్లకు ఆ మాత్రం దమ్ము ధైర్యం ఉంటాయి కదా. ఇంతకీ సయామీ ఈ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నారంటే ‘వైల్డ్‌డాగ్’ సినిమా కోసం. 2015లో ‘రేయ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ చాలాకాలం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది. ఇందులో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన సరసన ఓ హీరోయిన్గా దియా మిర్జా నటిస్తుండగా మరో హీరోయిన్గా సయామీని తీసుకున్నారు. ఈ చిత్రంలో సయామీ పై హై యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారట. దీనికోసం ఇప్పటికే ఆమె ముంబైలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సయామీ మాట్లాడుతూ– ‘‘ప్రెస్టేజియస్ చిత్రంలో భాగం కావడంతో పాటు నాగార్జునగారితో కలిసి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. -
ఆసీస్ బౌలర్‌పై నటి కామెంట్!
ముంబై: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చర్యను తప్పుపడుతూ టీమిండియాకు నటి సయామీ ఖేర్ మద్దతు తెలిపింది. బెంగళూరు టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఔట్ సమయంలో డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ నిర్ణయం కోసం ఎదురుచూడటం.. ఆపై అది వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమ కెప్టెన్ స్మిత్‌కు స్టార్క్ మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నటి సయామీ ఖేర్ సోషల్ మీడియాలో స్పందించింది. 'తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టున్నావ్.. అందుకే రెండో టెస్టులో గాయపడ్డావు. దీంతో ఏకంగా సిరీస్ నుంచే ఇంటిబాట పట్టావు' అని పేర్కొంటూ మిచెల్ స్టార్క్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది. నటి సయామీ చేసిన పోస్టుకు మంచి స్పందన వస్తోంది. కోహ్లీసేనతో పెట్టుకుంటే అంతే సంగతని, భారత్‌పై పైచేయి సాధించడానికి ఎక్కువగా శ్రమిస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు గాయం కారణంగా మిచెల్ మార్ష్ కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్, ఆసీస్‌లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు రాంచీలో జరగనుంది. -
స్టార్ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!
మరో స్టార్ వారసుడు ఈ శుక్రవారం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకప్పటి టాప్ హీరో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ ‘మీర్జ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. ‘రేయ్’ సినిమాతో ఈ సుందరి ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘మీర్జ్యా’ ప్రివ్యూను చూసిన బాలీవుడ్ ప్రముఖులు పలువురు ’కదిలే కవిత్వంలా’ ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హర్షవర్ధన్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. బిగ్ బీ అమితాబ్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లో ఇచ్చిన రివ్యూ ఇదే.. ‘మీర్జ్యా’ చూశాను. కదిలే కవిత్వం, అద్భుతమైన దృశ్యాలు, కథ చెప్పడంలో కొత్త దృక్పథం.. ఆకట్టుకుంది. - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఊపిరి సలుపలేనంత అద్భుతంగా ఉంది. దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రాకు జోహార్లు. అందరూ అద్భుతంగా పనిచేశారు. హర్షవర్ధన్ మరో స్టార్ కాబోతున్నాడు. - అనుపమ్ ఖేర్ సినిమా నిజంగా కదిలే కవిత్వం. మెహ్రా చిత్రకారుడైతే అతనికి హర్షవర్ధన్, సయామీ ఖేర్ కుంచెలు. కథ కన్వాసు. సినిమా ఎంతో అందంగా ఉంది. తమ్ముడు హర్షవర్ధన్ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు మరింతగా పనిచేసి.. అనిల్కపూర్లా పేరు తెచ్చుకోవాలి. సయామీ ఖేర్ కూడా అద్భుతంగా నటించింది. - అర్జున్ కపూర్, హీరో ‘మీర్జ్యా’ సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. అద్భుతమైన దృశ్యాలు, అసాధారణమైన సంగీతం. కలల తొలి సినిమా అంటే ఇలా ఉండాలి. - షబానా ఆజ్మీ తమ సహజ నటనతో హర్షవర్ధన్, సయామి ఖేర్ విస్మయ పరిచారు. - ఫర్హా ఖాన్ -
మణిరత్నం మెచ్చుకున్నారు!
అనుకోని అద్భుతాలు జరిగినప్పుడు ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు..’, ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు..’ అంటారు. ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ సయామీ ఖేర్కి సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ప్రముఖ నటి షబానా ఆజ్మీ మేనకోడలు సయామి. మేనత్తలానే సయామి అందగత్తె. బాగా నటించగలరు కూడా. మణిరత్నంలాంటి దర్శకులు ఏ ఆర్టిస్ట్‌లో ఎంత ప్రతిభ ఉందో చూడగానే చెప్పేయగలుగుతున్నారు. ఓ సందర్భంలో సయామీని చూసి, కథానాయికగా తీసుకోవాలనుకున్నారట. ఆ విషయం గురించి సయామీ ఖేర్ చెబుతూ - ‘‘మణిరత్నం సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఓ రోజు ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వస్తే, వెళ్లాను. స్క్రీన్ టెస్ట్ చేశారు. మణి సార్‌కి నచ్చింది. నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని మెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తాను తీయాలనుకున్న సినిమాలో కథానాయికగా తీసుకుంటా నన్నారు. కానీ, నా దురదృష్టమో ఏమో ఆ సినిమా ఆరంభం కావడానికి ఆలస్యం అయింది. ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తారని అనుకుంటున్నా. ఏం జరుగుతోంది చూడాలి’’ అన్నారు.