హీరోయిన్ సయామీ ఖేర్.. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ మేనకోడలు అయినప్పటికీ అందరిలాగే ఇండస్ట్రీలో తనకూ తిప్పలు తప్పలేదంటోంది. రేయ్ అనే తెలుగు సినిమాతో 2015లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిర్జ్య (2016) మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే మిర్జ్య మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీని వల్ల ఎదుర్కొన్న పరిణామాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
రిజెక్ట్
మీ మొదటి సినిమాను మీరు ఎంచుకోవద్దు.. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని డైలాగ్ ఉంటుంది. మిర్జ్యకు ముందు కొన్ని సినిమాల్లో నన్ను రిజెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ కమర్షియల్ సినిమా కాదని దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా సర్ చెప్పారు. సంతకం చేసేటప్పుడు కూడా నువ్వు నిజంగానే ఇందులో భాగం కావాలనుకుంటున్నావా? అని అడిగారు. నవ్వుతూనే సంతకం చేశాను.
హిందీలో తొలి సినిమా ఫ్లాప్
సినిమా ఫ్లాప్ అయింది. కానీ రాకేశ్ మెహ్రా డైరెక్షన్‌లో చాలా నేర్చుకున్నాను. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం ఎంత ముఖ్యమనేది తెలుసుకున్నాను. మిర్జ్య తర్వాత రెండు సినిమాలకు సంతకం చేశాను. కానీ చివరకు నన్ను పక్కన పెట్టేసి వేరేవాళ్లను తీసుకున్నారు.
వాళ్ల సపోర్ట్
ఈ ఇండస్ట్రీకి నేను సెట్ అవుతానా? ఇక్కడ ఉండగలనా? అని ఒత్తిడికి లోనైనప్పుడు అనురాగ్ కశ్యప్, నీరజ్ పాండే, ఆర్ బల్కి వంటి వారు నాకు సపోర్ట్‌గా నిలబడేవారు. ఇప్పుడు నేను నాకు వచ్చిన ఆఫర్లను కాకుండా మనసుకు నచ్చినవాటినే ఎంపిక చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవలే శర్మాజీ కీ బేటీ సినిమాతో అలరించిన ఈ బ్యూటీ తెలుగులో వైల్డ్ డాగ్, హైవే చిత్రాల్లో మెరిసింది.
చదవండి: కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి
Comments
Please login to add a commentAdd a comment