salaried
-
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. మరో రెండు రోజుల్లో దసరా .. ఆ తర్వాత దీపావళి .. అలా అలా కాలం గడిపేయకండి. నెమ్మదిగా, నిశ్చింతగా, చింత లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన, జరగబోయే ఆర్థిక వ్యవహారాల మీద ఒక కన్నేయండి. నిశితంగా పరిశీలించుకోండి. ప్రశ్నించుకోండి. పరీక్షించండి. పదండి ముందుకు.. ఈ విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీ ముందుకు వస్తున్నారు. www.incometaxindia.gov.inని వెంటనే దర్శించండి. తరచుగా మీకు వచ్చే సందేహాలు, సమస్యలు, మిమ్మల్ని వేధించే ప్రశ్నలు.. మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, నియమాలు, వాడాల్సిన ఫారంలు, దాఖలు చేయాల్సిన రిటర్నులు.. ఇలా ఎన్నెన్నో.. సవరణలు, వివరణలు, ఉదాహరణలు.. కొన్ని వందల ప్రశ్నలకు చక్కటి జవాబులు ఇందులో ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా, సులభంగా వివరించే Frequently Asked Questions.... సామాన్యమైన సందేహాలు, ప్రాథమిక అంశాలు మొదలు ప్రాముఖ్యమైన అంశాల వరకు.. చిన్న చిన్న సందేహాలు మొదలు పెద్ద సమస్యల వరకు.. అస్సెస్సీ తరఫు నుండి అసెస్మెంట్ పద్ధతి వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే అ నుండి అః వరకూ అన్నీ .. చట్టంలోని అన్ని అంశాలకు సంబంధించి కొన్ని వందల ప్రశ్నలకు జవాబులున్నాయి. వెబ్సైట్ దర్శించి ప్రతి చాప్టర్ చదవండి. కొన్ని మీకు వర్తించవచ్చు కొన్ని వర్తించకపోవచ్చు. ఏది ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సులువుగా ఉంటుంది. నాన్–రెసిడెంట్లు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, అన్ని వర్గాల వారికీ జీతం, ఇంటద్దె, వ్యాపారం/వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, పాన్, టాన్ .. ఇలా .. గిఫ్టులు, బహుమతులు, వ్యవసాయ ఆదాయం అన్నింటికీ జవాబులు ఉన్నాయి. నవంబర్ / డిసెంబర్లో సెక్షన్ 192 ప్రకారం కేవలం జీతం మీద ఆదాయం .. అంటే వేతన జీవులకు ప్రత్యేకంగా సర్క్యులర్ విడుదల చేస్తారు. అన్ని గవర్నమెంటు శాఖలకు చేరుతుంది. ఇతరులకు కూడా లభ్యమవుతుంది. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. వెబ్సైట్లో దొరుకుతుంది. ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ఏది మంచిది.. ఏది మీకు పనికొచ్చేది తెలుసుకునేందుకు ఉదాహరణలు ఉంటాయి. ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తారు. మీ నిజమైన పరిస్థితికి.. అంటే వాస్తవానికి దగ్గర్లో ఉంటాయి. అది చదవండి. అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కలు తేల్చి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. కొన్ని డాక్యుమెంట్లు వ్యవహారం జరిగిన / జరిపిన వెంటనే దొరుకుతాయి. వాటి కాపీలు తీసుకుని భద్రపర్చుకోండి. ఒక ఫైలు తెరవండి. అందులో అన్నీ దాచండి. బ్యాంకు ఎంట్రీలకు వివరణ రాసుకోండి. జ్ఞాపక శక్తి కన్నా ‘డాక్యుమెంట్’ చేయడమే మంచిది. -
TDS: మీరు ఉద్యోగస్తులా.. ఫాం16, ఫాం16ఏ గురించి మీకు తెలుసా?
టీడీఎస్ అంటే మూలం వద్ద చెల్లింపులోనే కోత అని అర్థం. చెల్లింపులు జరిపే వ్యక్తి చట్టప్రకారం కొంత మొత్తం పన్నుగా మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, సకాలంలో రిటర్నులు దాఖలు చేసి, ఒక స్టేట్మెంటును తయారు చేస్తారు. వీటినే టీడీఎస్ స్టేట్మెంట్లు అంటారు. ఇందులో ఆదాయం వివరాలు, వాటి స్వభావం, కొంత కోసిన మొత్తం, చలానా వివరాలు, అస్సెస్సీ పేరు, పాన్, అసెస్మెంటు సంవత్సరం మొదలైన వివరాలు ఉంటాయి. జీతాలు చెల్లించేటప్పుడు ఇచ్చిన ఫారంని 16 అని, ఇతర చెల్లింపులకు ఇచ్చిన ఫారం 16ఏ అని అంటారు. డిపార్ట్మెంటు వారు అన్నింటినుండి సేకరించిన సమాచారంతో ప్రతి అస్సెస్సీకి ఒక సమగ్రమైన పట్టికను తయారు చేస్తారు. దీనినే 26సీ అని అంటారు. ఇందులో అస్సెస్సీకి సంబంధించిన ఆదాయ వివరాలు, టీడీఎస్, టీసీఎస్, అస్సెస్సీ చెల్లించిన పన్ను వివరాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇదొక చిట్టా అని చెప్పవచ్చు. అయితే ఫారం 16/16ఏ లోని వివరాలు, ఫారం 26ఏ లోని వివరాలు ఒకదానితో మరొకటి సరిపోవాలి. తేడాలు రాకూడదు. అయితే, ఎన్నో సందర్భాల్లో తేడాలు ఉంటున్నాయి. వివిధ కారణాలు ఏమిటంటే.. ♦డిడక్ట్ చేసిన వ్యక్తి చెల్లించకపోవడం ♦రిటర్నులు నింపినప్పుడు తప్పులు దొర్లడం ♦పాన్ నంబరు రాయడంలో తప్పులు ♦టాన్ నంబర్ రాయడంలో తప్పులు ♦ చలాన్ల వివరాల్లో తప్పులు దొర్లటం ♦అసెస్మెంటు సంవత్సరాన్ని తప్పుగా రాయటం ♦ అడ్రస్‌లు తప్పుగా రాయడం ♦అస్సెస్సీ పేర్లు తప్పుగా రాయడం ♦పూర్తి వివరాలు ఇవ్వకపోవడం ♦ పన్నుల మొత్తం రాయడంలో తప్పులు, హెచ్చుతగ్గులు దొర్లడం.. ♦ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. అందుకే తేడాలు రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా తేడాలు గమనించినప్పుడు ఫారం 16, ఫారం 16ఏ జారీ చేసిన వారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వారిని సంప్రదించి ఆ తప్పులు సరిదిద్దించుకోవాలి. డిపార్ట్మెంటు వారికి తగిన కారణాలు వివరిస్తూ జవాబు ఇవ్వండి. వ్యత్యాసాలని సమన్వయం చేయండి. అంటే ‘‘రీకన్సిలేషన్’’ చేయండి. వివరణ సరిగ్గా ఉంటే ఏ సమస్యా ఉండదు. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు ప్రీఫిల్డ్ ఫారాలు ఉన్నాయి. ఈ సదుపాయం వల్ల ఫారం 26ఏ లోని అంశాలు యథాతథంగా ప్రీఫిల్డ్ ఫారంలో ఉంటాయి. ఇటువంటప్పుడు తేడాలు కనబడితే వాటిని వెంటనే సరిదిద్దండి. డిడక్టర్ ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వకపోయినా ఇబ్బందే. డిమాండు ఏర్పడే అవకాశం ఉంటుంది. సరిదిద్దండి. వీటివల్ల ఆలస్యం కావచ్చు. అయినా తప్పదు. ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దుకునేందుకు అస్సెస్సీలకు డిపార్ట్మెంటు అధికారులు సరైన అవకాశం, సమయం ఇవ్వాలి. 26ఏ లో తప్పుడు సమాచారాన్ని బట్టి అసెస్మెంట్ జరిగితే ఆ చర్య మీద అప్పీలుకు వెళ్లవచ్చు. ఈ మధ్య ఒక కంపెనీ అసెస్మెంటులో కోట్ల రూపాయల తప్పు దొర్లితే ఆ తప్పుని సరిదిద్దారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అన్నింటికీ కీలకం.. మీ దగ్గరున్న సరైన, నిజమైన సమగ్రమైన సమాచారం. అదే శ్రీరామరక్ష. చదవండి: Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
వేతన జీవులకు నిరాశ..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురవనుందని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవంగా మిగిలిపోనుందని ఆ సర్వే వెల్లడించింది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతంగా ఉంటుందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్ అంచనా వేసింది. 2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చిందని ఏఆన్ హెవిట్ వెల్లడించిన డేటా తెలిపింది. ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవంగానే మిగులుతుందని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్, భాగస్వామి అనందర్ప్ ఘోష్ స్పష్టం చేశారు. కీలక నైపుణ్యాలు కలిగిన వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్నెట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సేవలు, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, కన్జూమర్ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. -
చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిదీ!
-
చిత్తూరు షుగర్స్‌లో నో క్రషింగ్
355 మంది కార్మికుల తొలగింపు ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఆందోళనకు దిగిన కార్మికులు సాక్షి, చిత్తూరు: అదిగో క్రషింగ్.. ఇదిగో క్రషింగ్ అంటూ నెలరోజు లుగా దోబూచులాడిన చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికార వర్గం ఎట్టకేలకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించాయి. అంతేకాదు కర్మాగారంలో 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 355 మంది సీజనల్ పర్మినెంట్, కన్సాలిడేట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రెఫరెన్స్ సీసీఎస్ ఈఎస్టీటీ ఓఎం 2015 ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు వెలువడ్డా యి. బకాయిలు ఇవ్వలేనందునే ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడంతోపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 355 మంది కార్మికులను సైతం విధులనుంచి రిలీవ్ చేస్తున్నట్లు పా లకవర్గం తీర్మానించగా ఇన్చార్జ్ ఎండీ అధికారికంగా దానికి ఆమోదముద్ర వేశారు. 12వతేదీనే పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చూపారు. అధికారులు, చైర్మన్‌తో గొడవ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ ఇన్చార్జ్ ఎండీ పదవికి రాజీ నామా చేసిన మల్లికార్జున రెడ్డి పేరు మీదనే క్రషింగ్ నిలిపివేత, కార్మికుల తొలగింపు ఉత్తర్వులు వెలువడడం విశేషం. అయితే ఇన్చార్జి ఎండీ తన పదవికి రాజీనామా చేయకమునుపే ఈ ఉత్వర్వులపై సంత కం చేశారా ? అనే అనుమానం తలెత్తుతోంది. లేకపోతే ఆయన రాజీనామానే ఓ డ్రామానా అనే సంశ యం కూడా కలుగుతోంది. కర్మాగారం కార్యాలయం, ఇం జినీరింగ్ విభాగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకు చెందిన కార్మికు లు తొలగించిన వారిలో ఉన్నారు. 13 నెల లుగా వారు జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. కార్మికులకు సంబంధించి 12 కోట్ల జీతాలకు చెందిన బకాయిలతోపాటు మరో మూడు కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలి. వాటి సంగతి పట్టించుకోని ప్రభుత్వం కార్మికులకు, యూనియన్ నేతలకు మాట మాత్రమైనా చెప్పకుండా తొలగింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎండీ పాలక వర్గం తీర్మానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు శనివారం ఉదయం నుంచి కర్మాగారం వద్ద ఆందోళన చేపట్టారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా వందలాది మం ది ఉద్యోగులను ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు, కార్మికులకు చెందిన బకాయిలను చెల్లించలేని పరిస్థితిలోనే కన్సాలిడేట్ కార్మికులను రిలీవ్ చేసినట్లు చైర్మన్ ఎన్పీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆది నుంచి డ్రామానే రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు బాబు ప్రభుత్వం ఆది నుంచే మొగ్గు చూపింది. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్మాగారం అమ్మకానికి చంద్రబాబు తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బాబు ప్రకటనతో పాలకవర్గం డిసెంబర్ 4న కర్మాగారంలో స్లోఫైరింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఆ తరువాత చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో డిసెంబర్ 11న కర్మాగారంలో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వక పోయినా పాలకవర్గం, అధికారవర్గం కర్మాగారం విలువైన స్టోర్స్‌ను తాకట్టు పెట్టి ఆప్కా బ్ వద్ద రెండు కోట్ల రుణం తెచ్చింది. రుణం కోసం డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ సైతం ఆప్కాబ్‌కు సిఫారసు చేసింది. క్రషింగ్ నిర్వహించనపుడు ఆప్కాబ్ నుంచి రుణం ఎందుకు తేవాల్సి వచ్చిందో పాలకవర్గానికే తెలియాలి.