salaries increase
-
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
AP: రైతు బజార్ల సిబ్బందికి గుడ్‌న్యూస్.. భారీగా జీతాల పెంపు
సాక్షి, అమరావతి: రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు (సూపర్వైజర్లు) ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ.57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. 2021వరకు స్థానిక మార్కెట్ కమిటీలే ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మిగిలిన రైతుబజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ కీలక ప్రకటన -
వేతనాలు 10 శాతం పెంచే చాన్స్
ముంబై: భారత్‌లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధికం అని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో జీతాలు 9.5% అధికం అయ్యాయని వివరించింది. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10–10.4 శాతం పెరగనున్నాయి. ఈ రంగాల్లో 2022లో ఇప్పటికే గణనీయంగా సాలరీలు పెరిగాయి. పెంపు 2023లోనూ ఇదే తరహాలో ఉండనుంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోని కంపెనీల యజమానుల్లో 58 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు. 24.4% ఎటువంటి మార్పు చేయలేదు. 5.4% మంది తగ్గించారు. వచ్చే 12 నెలలు ఆదాయం మెరుగ్గా ఉంటుందని 42 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. తిరోగమనం ఉండొచ్చని 7.2 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి’ అని నివేదిక వెల్లడించింది. డిజిటల్ నిపుణుల కోసం.. ‘తదుపరి 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్ రంగాల్లో నియామకాలు ఉంటాయి. డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారి కోసం డిమాండ్ ఉండడం వేతనాల పెంపునకు కారణం అవుతోంది. హాంకాంగ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో స్వచ్ఛంద అట్రిషన్ అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగుతోంది’ అని నివేదిక వివరించింది. గత సంవత్సరం బడ్జెట్ల కంటే వాస్తవ జీతాల పెంపుదల ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కంటే మెరుగైన వ్యాపార పనితీరు, ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరం కారణంగా వేతన సవరణ జరిగిందని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సల్టింగ్ ప్రతినిధి రాజుల్ మాథుర్ తెలిపారు. ఇక చైనా 6 శాతం, హాంగ్‌కాంగ్ 4, సింగపూర్ 4 శాతం వేతనాలు పెంచే చాన్స్ ఉంది. 2022 ఏప్రిల్–మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిగింది. భారత్ నుంచి 590 కంపెనీలు పాలుపంచుకున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సర కానుకను ప్రకటించారు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలను పెంచాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 9,36,976 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ఓ కమిటిని నియమించారు. కొత్త ఏడాదిలో మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. 9,36,976 ఉద్యోగులకు లబ్ధి.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు. షేరు డౌన్..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వేతనాల పెంపు.. అక్టోబర్ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు. -
కేంద్ర ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్‌ను, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్ అమ్మకందారు వద్ద, డిజిటల్ మోడ్‌లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి. శాలరీ అడ్వాన్స్, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శా లరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
బ్యాంకు ఉద్యోగులకు బొనాంజా
ముంబై : కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు అమలవుతుందటే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తమ ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనుంది. అక్టోబర్ నుంచి ఉద్యోగుల వేతనాలను 4 నుంచి 12 శాతం వరకూ పెంచేందుకు యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 76,000 మంది ఉద్యోగులు కలిగిన యాక్సిస్ బ్యాంక్ తన ఉద్యోగులకు బోనస్ కూడా చెల్లించింది.మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏప్రిల్‌లోనే సామర్థ్యం ఆధారంగా తమ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు బోనస్‌లను చెల్లించిందని బిజినెస్ స్టాండర్డ్ కథనం పేర్కొంది. చదవండి : ‘లాక్డౌన్’ కోత జీతాలు త్వరలో చెల్లింపు ఇక దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తమ లక్ష మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి జులై నుంచి వేతన పెంపును చేపట్టడంతో పాటు బోనస్‌ను చెల్లించింది. ఇక మరో ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్ర పాతిక లక్షల రూపాయల వార్షిక వేతనం కలిగిన ఎగ్జిక్యూటివ్స్‌కు 10 శాతం వేతన కోత విధించగా, సీనియర్ మేనేజ్మెంట్ స్ధానాల్లో పనిచేసే వారి వేతనాల్లో 15 శాతం కోత విధించింది. ఇక కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో భవిష్యత్‌లో తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహింద్ర బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్‌లు ఈక్విటీ మార్కెట్ల ద్వారా 900 కోట్ల డాలర్లను సమీకరించాయి. -
హోంగార్డుల జీతాలు పెంపు
సాక్షి, అమరావతి : హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హోంగార్డుల వేతనాలు పెంచుతామని వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూన్ 10వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హోంగార్డుల వేతనం పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తూ ప్రస్తుతం ఉన్న రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెలసరి జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరుగుతుంది. పెంచిన వేతనం ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 16,616 మంది హోంగార్డులకు మేలు కలుగుతుంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. -
‘గుర్తింపు’ తంటాలు
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య ప్రదాయిని రిమ్స్ మెడికల్ కళాశాలకు నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మరణాలు, ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)ను 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కాగా మొదటి నుంచి రిమ్స్ సిబ్బంది కొరతతో సతమతం అవుతుంది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల మెడికోలు వైద్య శిక్షణను పూర్తి చేసుకొని బయటకు వెళ్లారు. గతేడాది సూపర్ స్పెషాలిటీ కోసం కూడా కేంద్రం కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తాజాగా రిమ్స్ వైద్య కళాశాలను రెన్యువల్ సమస్య వెంటాడుతోంది. జూన్ 5న ఎంసీఐ(భారతీయ వైద్య మండలి) బృందం తనిఖీ చేసిన విషయం విదితమే. బృందం నివేదిక ప్రకారం వైద్య కళాశాలకు గుర్తింపు రాలేదు. మరోసారి రిమ్స్‌ను ఆ బృందం ఈ నెలాఖరులో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆలోగా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే గుర్తింపును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోధన సిబ్బంది కొరతే ప్రధాన కారణం రిమ్స్‌లో వైద్య సేవలను పక్కనబెడితే భావి వైద్యులైన మెడికోలకు నాణ్యమైన విద్య అందడం లేదనే చెప్పుకోవచ్చు. బోధనకు సంబంధించి 150 పోస్టులకు గాను 90 మంది బోధన సిబ్బంది పనిచేస్తుండగా, 60 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో మెడికోలకు సరైన రీతిలో బోధన సాగడం లేదని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల కోర్సు కాగా ఒక సంవత్సరం శిక్షణ వైద్యులుగా అనుభవంతో వైద్య వృత్తిలో కొనసాగనున్నారు. 16 ప్రొఫెసర్ పోస్టులు, 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 15 అసిస్టెంట్ ప్రొఫెసర్, 19 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు కీలకమైన రిమ్స్ డైరెక్టర్ పోస్టు ఇన్‌చార్జీతోనే కొనసాగుతోంది. రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంటే డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచీ సమస్యల నడుమే వైద్య శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 2008 సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు బోధన విషయమే ప్రధాన సమస్యగా ఉంది. ఎంసీఐ బృందం మొదటి నాలుగు సంవత్సరాలు తనిఖీలు చేసింది. పలుసార్లు కూడా రెన్యువల్ సమస్యనే ఉంది. ఎలాగో నెట్టుకుంటూ నాలుగు బ్యాచ్‌ల తర్వాత గుర్తింపు లభించింది. ఎంసీఐ బృందం తనిఖీ చేసే సమయంలో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను ఇక్కడ పనిచేస్తున్నట్లు చూపించి గట్టెక్కించారు. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండడంతో ప్రతిసారి సమస్యే ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం బోధిస్తున్న వారిలో కూడా రెగ్యులర్ లేకపోవడం గమనార్హం. ఈ కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో విద్యాబోధన జరగకపోవడంతో భవిష్యత్తులో చేసే వైద్య వృత్తిలో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా రిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. చిన్నపాటి వైద్య చికిత్సలు చేస్తూ మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం పరిపాటిగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు నెలల క్రితం జిల్లా అటవీ శాఖాధికారి గుండెపోటుతో రిమ్స్‌లో చేరగా, వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, సరైన వైద్యం అందకపోవడంతో తుదిశ్వాస వదిలారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో జూనియర్ వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. దీంతో వారికి అనుభవం లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. అయోమయంలో మెడికోలు రిమ్స్ వైద్య కళాశాలకు గుర్తింపు వస్తుందో లేదోనని మెడికోలు అయోమయంలో పడ్డారు. ఇటీవల ఎంసీఐ బృందం పర్యటించినప్పుడు విద్యార్థులను బోధనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు నిరాకరిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. వారి శిక్షణకు కూడా అడ్డంకులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే తమకు నాణ్యమైన విద్యతో పాటు కళాశాలకు గుర్తింపు లభిస్తుందని, రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం కోసం పాకులాట.. ప్రతిసారి ఎంసీఐ బృందం రిమ్స్‌ను తనిఖీ చేసినప్పుడు ఏవిధంగా గట్టెక్కిద్దామనే ఆలోచనే తప్పా సమస్యను పూర్తిగా ఎలా పరిష్కరిద్దామనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. అద్దె వైద్యులు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను బృందం తనిఖీ సమయంలో చూపించి చేదులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంసీఐ బృందం 10 శాతం ఖాళీలు ఉంటే రెన్యువల్ చేయడం నిరాకరించకుండా అనుమతులను జారీ చేస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం 18 శాతం ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ మెడికల్ కళాశాలలో బోధించేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవనే ఆలోచనతోనే ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదని సమాచారం. వేతనాలు పెంచినా సరైన మౌళిక వసతులు కల్పించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పెరిగిన వేతనాలతోనైనా భర్తీకి నోచుకునేనా.. ఖాళీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రొఫెసర్ల వేతనాలను పెంచుతూ జీఓ నెం.482 ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బోధకుల నియామక ప్రక్రియ జరగనుంది. ఈసారైనా బోధకులు వస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఖాళీలు భర్తీ అయితే మెడికోలకు లబ్ధి చేకూరడంతోపాటు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. ఆందోళన అవసరం లేదు మెడికోలు రెన్యువల్‌కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత నెలలో పర్యటించిన ఎంసీఐ బృందం నివేదిక ఇంకా అందలేదు. ఆస్పత్రిలో అన్ని సేవలు అందుతున్నాయి. కళాశాలలో మాత్రమే సిబ్బంది కొరత ఉంది. అయినప్పటికీ మెడికోలకు బోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోధన సిబ్బంది కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వేతనాలు కూడా గతంలో కంటే ఎక్కువగా పెంచింది. దీంతో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంసీఐ బృందం నివేదికలో లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి అనుమతులు పొందేలా చర్యలు చేపడతాం. – అశోక్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ హోదా ప్రస్తుత వేతనం పెరిగిన వేతనం ప్రొఫెసర్ రూ.1లక్ష రూ.1.90 లక్షలు అసోసియేట్ ప్రొఫెసర్ రూ.90వేలు రూ.1.60 లక్షలు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.75వేలు రూ.1.20 లక్షలు ట్యూటర్ రూ.40వేలు రూ.53వేలు -
జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించాలి
పెద్దపల్లిటౌన్ : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మున్సిపల్ జేఏసీ పెద్దపల్లి నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జీహెచ్ఎంసీలో చెల్లిస్తున్న మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒకే విధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో సమ్మె చేసినపుడు కార్మికులతో జరిపిన చర్చల్లో జీవో 14 ప్రకారం వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. పలుమార్లు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చాలీ చాలని వేతనాలతో కుటుంబాల పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలు పెంచి, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపుపై మున్సిపాలిటీ తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, ఆరెపల్లి చంద్రయ్య, సావనపల్లి వెంకటస్వామి, మల్లారపు కొమురయ్య, ఆరెపల్లి సాగర్, శంకర్, వంశీ, గద్దల శ్రీనివాస్, బొంకూరి చంద్రయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, సలిగంటి పద్మ, కాదాసి లక్ష్మి, చింతల మరియా తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం 3.5 లక్షలు
- జీతభత్యాల పెంపుపై సీఎంకు వసతుల కమిటీ సిఫారసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సభ్యుల నెలవారీ వేతనాన్ని రూ.3.5లక్షలకు పెంచాలని అసెంబ్లీ వ సతుల (ఎమినిటీస్) కమిటీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సిఫారసు చేసింది. దీంతోపాటు మాజీ శాసనసభ్యులకు పెన్షన్‌ను కూడా పెంచాలని, వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా అందించాలని పేర్కొంది. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షత న ఈ కమిటీ సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కమిటీ... పలు ప్రతిపాదనలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలను రూ.3.5లక్షలకు పెంచాలని, వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించాలని పేర్కొంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు శ్లాబుల వారీగా ఒక టర్మ్ పనిచేసిన వారికి రూ. 50వేలు, రెండు టర్మ్‌లు పనిచేసిన వారికి రూ. 55వేలు, మూడు టర్మ్‌లు పనిచేసిన వారికి రూ.60 వేలు, నాలుగు అంతకన్నా ఎక్కువసార్లు పనిచేసిన సభ్యులకు రూ.65వేలు పెన్షన్‌గా చెల్లించాలని ప్రతిపాదించింది. మాజీ సభ్యుడు మరణిస్తే ఆయన భార్యకు పూర్తి పెన్షన్ అందించాలని సూచించింది. సభ్యులకు వాహనం కోసం ఇచ్చే రుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఈ ప్రతిపాదనలు చేశారని కొందరు సభ్యులు వెల్లడించారు. ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం ఆలస్యమవుతోందని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేకపోయారని ఆర్అండ్బీ అధికారులపై వసతుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు, సహాయకులకు 30 ఫ్లాట్లు మొత్తంగా 150 ఫ్లాట్లతో నిర్మిస్తున్న భవనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు కమిటీకి తెలిపారు. వసతుల కమిటీ సమావేశంలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, సంతోష్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు.