Sales of sand
-
సైఖతం
గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో మొత్తం తవ్వేసి ఆరు నెలలకే ఖాళీచేశారు. రీచ్‌ల్లో పూర్తిగా ఇసుక నిండుకొని మూతపడ్డాయి. దీంతో జిల్లాలో ఇసుక ఇక్కట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగం నత్తనడకన సాగుతోంది. ఇసుక కోసం బిల్డర్లు ఇతర జిల్లాలకు పరుగుతీస్తున్నారు. - నిండుకున్న ఇసుక.. - మూతపడిన రీచ్‌లు - నిలిచిన అమ్మకాలు - ఇక్కట్లలో నిర్మాణ రంగం సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. మరో పక్క ఇసుక డిపోల్లో సైతం ఇసుక ఖాళీ అయి పోవడంతో జిల్లాలో ఇసుక అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో అట్టహాసంగా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో జిల్లాలో గుర్తించిన 21 రీచ్‌ల్లో తవ్వకాలను ప్రారంభించారు. రెండు శాండ్ డిపోలను కూడా ప్రారంభించారు. ఒక వైపు రీచ్‌ల్లో అమ్మకాలు సాగిస్తూనే మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో రీచ్‌ల నుంచి తరలించిన ఇసుకను డిపోల ద్వారా విక్రయించి రికార్డు స్థాయిలో వ్యాపారం సాగించారు. గతంలోఎన్నడూలేని రీతిలో రీచ్‌ల ద్వారా 1.22 లక్షలు, డిపోల ద్వారా మరో 62 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించడం ద్వారా రూ.12 కోట్ల మేర వ్యాపారం సాగించారు. రీచ్‌ల ద్వారానే ఆరు కోట్ల వ్యాపారం జరగ్గా డిపోల ద్వారా మరో ఐదు కోట్ల వరకు వ్యాపారం జరిగింది. ఒక వైపు రీచ్‌ల్లో ఇసుక నిండుకోవడం.. గుర్తించిన కొత్త రీచ్‌లకు పూర్తి స్థాయిలో అనుమతుల్లేకపోవడం.. మరో పక్క శ్రీకాకుళం, విజయనగరం రీచ్‌ల్లో ఇసుక రవాణా క్రమేపి తగ్గిపోవడంతో నెల రోజులుగా ఇసుక అమ్మకాలు పూర్తిగా మందగించాయి. ప్రస్తుతం గత వారం రోజులుగా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాడుగుల మండలం సాగరం, చోడవరం మండలం గజపతినగరం రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అవి స్థానిక అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో సరిపోని పరిస్థితి. గజపతినగరంలో మరో ప్రాం తంతో పాటు సోమిదేవులపల్లిలలో గుర్తించిన ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 10,599 ఆర్డర్ల ద్వారా లక్షా 84వేల 116 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించగలిగారు. ఇప్పటి వరకు రీచ్‌ల ద్వారా లక్షా 22 వేల 124 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయించడం ద్వారా ఆరు కోట్ల 10 లక్షల 62వేల వ్యాపారం చేశారు. ఈ మొత్తంలో స్థాని క సంస్థలకు సీనరేజ్ కింద 48లక్షల 84వేల 960లను ఇసుక రీచ్‌లను నిర్వహించిన డ్వాక్రా సంఘాల వేతనాల కింద రూ.18 ,60,660లు, ఇన్సెంటివ్ కింద రూ.6,10,620లు దక్కింది. ఇక మిషనరీ లోడింగ్ చార్జీల పేరిట రూ.62 55,960 ఖర్చుచేశారు. ర్యాంపుల నిర్మాణం కోసం రూ.6,10,620, అప్రూవల్స్ క్లియరెన్స్‌కోసం రూ.6,10,620 ఖర్చు చేశారు. ర్యాంపుల నిర్వహణ, ఫెన్సింగ్ కోసం రూ. 6,79,740, సీసీ టీవీల ఏర్పాటు, మోనటరింగ్ కోసం ఏకంగా రూ.18,31,860 వెచ్చించారు. పరిపాలనాపరమైన ఖర్చు(సెర్ప్) కోసం 18 లక్షల 31 వేలు ఖర్చుచేసినట్టు లెక్క చూపారు. ఈవిధంగా మొత్తం రూ. కోటి 91 లక్షల 76 వేల 900 ఖర్చు చేసినట్టుగా అధికారులు లెక్కతేల్చారు. రీచ్‌లతో పాటు శాండ్ డిపోలు కూడా ఇసుక లేక బోసిపోతున్నాయి. మొత్తమ్మీద ఇసుక అమ్మకాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. -
ఇసుక.. మస్కా !
►మహిళా సంఘాలకు మిగిలేది మట్టే ►పేరు మహిళలది- ఆదాయం ప్రభుత్వానిది ►జిల్లాలో అమ్మకాలు రూ.18 కోట్ల 60 లక్షలు ►మహిళలకు ఇచ్చింది నామమాత్రమే మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రభుత్వం ప్రచారం సాగించింది. ఇందుకోసమే ఇసుక రీచులను సంఘాలకు అప్పజెప్పుతున్నామంటూ అధికార పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. అరుుతే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నారుు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ. కోట్లు చేరుతుంటే మహిళా సంఘాలకు మాత్రం మట్టే మిగులుతుంది. మరోవైపు పంచాయతీలకు చేరాల్సిన సీనరీజ్ చార్జీలు అందించకుండా ఖజానాకే మళ్లిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని మహిళా సంఘాల సభ్యులు అర్ధరాత్రి వరకు ఇసుక ర్యాంపుల్లో అవస్థలు పడుతున్నారు. పాలకొండ : జిల్లాలో గత ఏడాది అక్టోబర్ పదో తేదీ నుంచి ఇసుక రీచులు అమల్లోకి వచ్చారుు. 13 రీచులను ఏర్పాటు చేయడం ద్వారా ఇంతవరకు 2,75,565 క్యూబిక్ మీటర్ల ఇసుకను 27,985 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. దీని ద్వారా ప్రభుత్వం 18 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 4 కోట్ల 90 లక్షల 50,570 రూపాయలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ చార్జీల కింద చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం ఇసుక లోడింగ్‌కు, ర్యాంప్‌ల నిర్వహణకు మినహాయిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు. ఇవీ నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా నదిలో యంత్రాలతో పనిచేసే ఇసుక రీచులకు మహిళా సంఘాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.15 చొప్పునివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఇప్పటివరకు వీరికి రూ. 41 లక్షల 33,475 చెల్లించాల్సి ఉంది. ఇందులో కొంతమేర ఇప్పటికే బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ మొత్తాన్ని మహిళా సంఘాలు పంచుకుంటే కేవలం నెలకు రూ. 2 వేల నుంచి 4 వేల రూపాయలు మాత్రమే పడుతుందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడింగ్‌లు నిలిపివేయాలి. రీచుల వద్ద ఈ నిబంధన సాగడం లేదు. ఉదయం నుంచి మహిళలు అర్ధరాత్రి వరకు రీచుల వద్దే ఉండాల్సి వస్తుంది. పంచాయతీలకు చేరని సీనరీజులు! ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున సంబంధిత పంచాయతీలకు సీనరైజ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కోటి 10 లక్షల 600 రూపాయలు పంచాయతీలకు జమకావాల్సి ఉంది. దీన్ని ఇంతవరకు జమ చేయకుండా ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంతోగ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పలు రీచులను నిలిపివేయాలని ఆందోళన చేపడుతున్నారు. ఇదే పరిస్థితిలో అల్లెన, ఆకులతంపర రీచులు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్నవి నాలుగే... ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఏర్పాటు చేసిన 13 ర్యాంపుల్లో తలవరం, బద్దేరు, డొంపాక, కల్లేపల్లి రీచుల్లో నిల్వలు నిండుకోవడంతో నిలిపివేశారు. తమరాం ర్యాంప్‌లో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకోవడంతో నిలిచిపోయింది. ఆకులతంపర రీచుపై అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోవడం, పంచాయతీకి సీనరీజ్ చెల్లించకపోవడంతో ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి కాఖండ్యాం, యరగాం, పురుషోత్తపురం ర్యాంపుల్లో మాత్రం విక్రయాలు సాగుతున్నాయి. అన్నింటికీ రూ.178 ప్రభుత్వం యంత్రాలతో నిర్వహించే ఇసుక రీచులకు క్యూబిక్ మీటర్‌కు రూ. 178 చొప్పున చెల్లించాలని నిబంధన విధించింది. జిల్లాలోని ర్యాంప్‌లన్నీ యంత్రాలతో నిర్వహించేవి కావడంతో క్యూబిక్ మీటర్‌కు రూ.178 చొప్పున అందించాల్సి ఉంది. ఇందులో లోడింగ్, మిషనరీ చార్జీలు కలిపి క్యూబిక్ మీటర్‌కు రూ.50, పంచాయతీ సీనరీజ్ల కింద రూ.40, ర్యాంప్‌లు ఏర్పాటు చేసుకొనేందుకు రూ.5, సీసీ టీవీలు, కంప్యూటర్లు తదితర ఏర్పాట్లుకు రూ.15, మహిళా సంఘాలకు కూలి కింద రూ.15, రవాణా చార్జీల కింద రూ.23, అడ్మినిస్ట్రేషన్, మోనటరింగ్‌కు తదితరమైన వాటికి రూ.30 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో కేవలం ఇసుక లోడింగ్ చార్జీలకు, సీసీ టీవీల ఏర్పాటుకు నిధులు కేటాయించారు తప్పితే మిగతా వాటికి సంబంధించిన నిధులు ప్రభుత్వ ఖాజానకే మళ్లించారు. ఏర్పాటు కాని సీసీ కెమెరాలు ఒక్కర్యాంప్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఇందుకోసం కేటాయించిన నిధులు ఖజానాలోనే ఉంచారు. కెమెరాలు లేకపోవడంతో ర్యాంప్‌ల వద్ద వాహనాలు గుర్తించడంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ సామాగ్రి అందించినా వీటి వినియోగంపై మహిళలకు అవగాహన లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇంతవరకు దీని కోసం చెల్లించాల్సిన సుమారు రూ.45 లక్షలు ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు. అక్రమాలకు నిలయం! ఇసుక ధరలు అమాంతంగా పెంచేయడంతో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కొదవ లేకుండాపోయింది. అనధికారికంగా ఇసుకను తరలించుకుంటూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల అనుచరగణం చేస్తున్న దురాగతాలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తలవరంలో జరిగిన సుమారు రూ.40 లక్షల అక్రమాలపై దర్యాప్తు జరుగుతుండగా, తమరాం ర్యాంప్‌లో కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించేశారు. బూర్జ మండలంలోని అల్లెన ఇసుక ర్యాంప్‌లో కూడా ఎమ్మెల్యే పేరుతో జరుగుతున్న అక్రమాలపై లారీ డ్రైవర్లు సైతం ఆందోళనకు దిగారు. -
కళ్లు తెరవండి!
ఇది వల్లూరు మండలంలోని తప్పెట్ల ఇసుకక్వారీ.. ఇక్కడ నవంబర్ 3వ తేదీ నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారు.. ఇప్పటి వరకు 17,640 క్యూబిక్‌మీటర్ల ఇసుకను విక్రయించారు. క్యూబిక్‌మీటర్‌కు రూ. 650 చొప్పున ప్రభుత్వానికి రూ. 1.50 కోట్ల ఆదాయం ఒనగూరింది.. కేవలం 50 రోజుల్లో ఒక తప్పెట్ల క్వారీ నుంచే వచ్చిన ఆదాయం ఇది.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 3.2 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉండగా ఇంతకు పదిరెట్లు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చూస్తుండిపోతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది. నాయకుల అక్రమ సంపాదనకు అడ్డుఅదుపూ లేకుండా ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఆరు రీచ్‌ల ద్వారా ఇసుక విక్రయాలు చేస్తున్నారు. మరో 15 రీచ్‌లలో ఇసుక తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెయ్యేరు నదిలో 6 రీచ్‌లు, పెన్నాలో 5 రీచ్‌లు, పాపాఘ్నిలో 4 రీచ్‌లను ఏర్పాటు చేయలని నిర్ణయించారు. దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనేది అధికారుల అంచనా. తద్వారా రూ.60 కోట్లు ఆదాయాని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాత్రికి రాత్రే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ప్రధానంగా తప్పెట్ల, పైడికాల్వ, కమలాపురం, ములుకోనిపల్లె, నందిమండలం, వేంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు మండలాల నుంచి కూడా ఇసుక సంపదను కొల్లగొడుతున్నారు. అంతలోనే ఎంత మార్పు... నదుల్లోని ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగింటి పోతాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన నాయకులు అధికారపీఠం ఎక్కగానే దృష్టి మరలుతోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి తీరు ఇందుకు దర్పంగా నిలుస్తోంది. 2007-08లో తంగేడుపల్లె (వేంపల్లె దిగువన) ఇసుక టెండర్ నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇసుకను తరలిస్తే నీటిపథకాలకు గ్రహణం పడుతుందని, వేంపల్లెకు తాగునీటి సమస్య వస్తుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేంపల్లె గ్రామానికి పైభాగాన కుమ్మరాంపల్లె గ్రామం ఉంది. తాగునీటి పథకాలన్నీ కుమ్మరాంపల్లెకు సమీపంలోనే ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఒక్కమారు కూడా పట్టుమని పదిరోజులు పాపాఘ్ని నదిలో నీటి ప్రవాహం లేదు. నాడు వేంపల్లె భూగర్భజలాలపై ఆందోళన చెందిన ఎస్వీ సతీష్‌రెడ్డికి ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీ గుర్తుకు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కరువు మండలాలతోనే సరి... జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చెన్నూరు మండలాలు మినహా తక్కినవికరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రకటన మినహా ఇంతవరకు ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవలేదు. కరవు నేపధ్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుదిబండగా ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కార్మికులు, చిన్నతరహా పరిశ్రమల యజమానులకు గుదిబండగా మారింది. జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20వేల మంది రోడ్డుపాలయ్యారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 180 మిల్లులు పనిచేస్తున్నాయి. వాటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇదివరకు 40ః60 దామాషా ప్రకారం బెరైటీస్ ఖనిజాన్ని సరఫరా చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అనీ ప్రకటనలు ఇచ్చారు, ఇప్పుడేమో కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. జఠిలంగా మారుతున్న తాగునీటి సమస్య... వేసవి రాకముందే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. 185 గ్రామాలు నీటి ఎద్దడితో ఉన్నాయి. వాటిలో 110 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని .. మిగతాది తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు నీటి తరలింపునకు వెనక్కి తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తుండటంతో భూగర్భజలాల్ని అడుగంటి నీటి సమస్య ఏర్పడుతోంది. కొనసాగుతున్న వివక్షత... జిల్లాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివక్షత ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా ఎయిర్‌పోర్టు, కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్లు నిలుస్తున్నాయి. కడప విమానాశ్రయంలో దిగేందుకు కింగ్‌ఫిషర్, జెట్ ఏయిర్ వేస్, స్పైజెట్లు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వాటితోపాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి. అయితే కడప విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఏయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులు మాత్రమే సౌకర్యం ఉంటుంది. దీనికి కూడా కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారు. దీంతో విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లో పూర్తయిన భవనాలు ఐదేళ్లుగా అలాగే ఉండిపోతున్నాయి. జిల్లాలోని గండికోట ప్రాజక్టులో ఏకకాలంలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పెండింగ్ కారణంగా గండికోట ముంపు గ్రామాలు ఖాళీ కాలేదు. గండికోట, మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్, బ్రహ్మంసాగర్లలో నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండి కూడా ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈనేపధ్యంలో శనివారం జిల్లా సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టాలని పాలక పక్షం వివక్షతను ఎండగట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. -
రేటివ్వలేదు.. ఇసుక రావట్లేదు
ఏలూరు (టూ టౌన్) : జిల్లాలో ఇసుక విక్రయాలకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినా.. రవాణాకు మార్గం సుగమం చేయడంలో మాత్రం వెనుకబడ్డారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసేం దుకు ఆసక్తిగల వాహన యజమానుల నుంచి రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ రవాణా ధరలు మాత్రం ఖరారు కాలేదు. వారం రోజుల క్రితం టెండర్లు తెరిచే సమయంలో అధికారుల నిర్ణయాన్ని వాహన యజమానులు వ్యతిరేకించారు. ఆ తరువాత లారీ యజమానుల సమక్షంలో టెండర్లు తెరిచినప్పటికీ రవాణా ధరలను మాత్రం ఖరారు చేయలేదు. ముందుగా టెండర్లు ఆహ్వానించినప్పుడు నిర్ణయించిన ధరలకు వాహన యజమానులు ఇసుక రవాణా చేస్తున్నా.. వాహనాలు పూర్తిస్థాయిలో లేకపోవటంలో వినియోగదారులకు సకాలంలో అందటం లేదు. ప్రస్తుతం లారీల ద్వారా 10 టన్నుల ఇసుక రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.65, 17 టన్నుల వాహనానికి రూ.90 చొప్పున ఇస్తున్నారు. ట్రాక్టర్‌కు మాత్రం కిలోమీటరుకు రూ.28 చొప్పున రవాణా చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విజయరాయి, నబీపేట రీచ్‌లలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.500 ధర నిర్ణయించారు. ఆ మొత్తాలకు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, వాహనాన్ని వినియోగదారులు సమకూర్చుకుంటే, అం దులో ఇసుకను లోడుచేసి అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. మిగతా రీచ్‌లలో క్యూబిక్ మీటరుకు రూ.650 చొప్పున డీడీ తీయాల్సి ఉంది. ఈ రీచ్‌లకూ డీడీలు, వాహనాల్ని తీసుకెళితే ఇసుక లోడు వేసి ఇస్తామని స్వయంగా కలెక్టర్ ప్రకటించినా అమలు కావడం లేదు. అధికారులు స్పందించి రవాణా విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఇసుక సమస్య తీరే పరిస్థితి కనిపించడం లేదు.