Salesman
-
ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్‌కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్‌కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్ హైవే మీదుగా లాలానగర్ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్ ట్యాకులోని పెట్రోల్ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు. అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్‌కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
క్షణాల్లో బంగారం సంచి మాయం!
సాక్షి, హైదరాబాద్: సేల్స్‌మన్ నిర్లక్ష్యం కారణంగా కిలోన్నర బంగారం మాయమైన సంచలన ఘటన బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్‌బాగ్‌లోని వీఎస్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపులో ఓ కస్టమర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చారు. వాటిని ప్రదీప్ అనే సేల్స్‌మన్ స్కూటీపై తిరిగి వీఎస్ నగల దూకాణానికి తీసుకెళుతున్న క్రమంలో బంగారం సంచి మిస్సయింది. బంజారాహిల్స్‌లో రోడ్డుపై వరదనీటిని దాటే క్రమంలో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల బ్యాగు కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత దీనిని గుర్తించిన ప్రదీప్ వెనక్కి వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. వీఎస్ గోల్డ్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సేల్స్‌మన్ ప్రదీప్‌ను విచారిస్తున్నారు. సేల్స్‌మన్ ప్రదీప్ బ్యాగ్ పడిపోయిందని చెప్పిన చోట పోలీసులు వెతకగా.. ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన బ్యాగు పక్క బిల్డింగ్‌లో ఉన్న చెత్త బుట్ట వద్ద దొరికింది. కానీ దాంట్లో బంగారు ఆభరణాలు మాత్రం లేవు. బంగారు ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ‘మీ ఒక్కరోజు రాబడి..నాకు మూడునెలల ఆదాయం’) -
మనమైతే ఇలా చేయగలిగే వాళ్లమా..?!
గాంధీనగర్ : రోడ్డు మీద ఓ పది రూపాయలు కనిపిస్తేనే.. ఎవరి కంటా పడకుండా చటక్కున తీసుకుంటాము. అలాంటిది రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరూ గమనించకముందే ఆ నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయిస్తాము. కానీ గుజరాత్ సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. వివరాలు.. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నట్లు తెలిపారు. -
సేల్స్‌మ్యాన్ నిజాయతీ!
సూరత్: రోడ్డుపై పడి ఉన్న బ్యాగులో ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 లక్షలుంటే ఎవరైనా ఏం చేస్తారు? గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ సేల్స్‌మ్యాన్ మాత్రం నిజాయతీగా ఆ డబ్బును సొంతదారుకే ఇచ్చేశాడు. సూరత్‌లోని ఉమ్రా ప్రాంతానికి చెందిన దిలీప్ పొద్దార్ ఓ దుస్తుల దుకాణంలో సేల్మ్యాన్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి అతడు ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటం కనిపించింది. దానిని తెరిచి చూడగా రూ.10 లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆయన తన దుకాణం యజమానికి ఫోన్ చేసి, విషయం తెలిపాడు. ఆయన సలహా మేరకు ఆ డబ్బును తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ యజమాని పోలీసులకు ఈ విషయం చేరవేశారు. వివరాలను బట్టి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి, నగదు సొంతదారును గుర్తించి, అతనికి కబురు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి తనపేరు బయటకు వెల్లడించవద్దని చెబుతూ.. పొద్దార్ నిజాయతీకి మెచ్చి రూ.లక్ష అందజేశారు. పొద్దార్‌కు దుకాణం యజమాని హృదయ్ మరో రూ.లక్ష అందజేశాడు. 10 లక్షలను నగలు కొనేందుకు తీసుకువస్తుండగానే పోగొట్టుకున్నారని తెలిపారు. -
జీతం రూ.1,200.. కానీ కళ్లు చెదిరే కోటీశ్వరుడు
భోపాల్: అతడు నెల రోజులుపాటు కష్టపడితే అందుకు ప్రతిఫలంగా యజమాని చెల్లించేది రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు కోట్లాధిపతి అయ్యాడు. కాదు కాదు.. అతడు కోటీశ్వరుడని ప్రభుత్వ అధికారులు తేల్చారు. అది కూడా అక్రమంగా సంపాధించిందని బయటపెట్టారు. లోకాయుక్త అధికారులు అతడి ఇంటిపై దాడిచేసిన తర్వాత గానీ ఈ విషయం లోకానికి తెలియలేదు. సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం రూ.1200. అయితే, అతడి వద్ద అక్రమ ఆస్తులు చాలా ఉన్నాయని స్థానిక లోకాయుక్త అధికారులకు సమాచారం అందడంతో అనూహ్యంగా వారు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిజంగానే అతడి వద్ద కోట్ల విలువ చేసిన ఆస్తులు ఉన్నట్లు స్థిర, చర ఆస్తుల పత్రాలు లభించాయి. వీటితోపాటు ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి సంవత్సర సంపాధన కంటే 200 రెట్లు ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు. పాండే, అతడి కుమారుడు, భార్య పేరిట మొత్తం 8 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. -
తీరా ఇలా.. తీరే అలా!
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్‌మ్యాన్, సూపర్వైజర్ పోస్టులకు ప్రకటన జిల్లాలో 1,200 మంది దరఖాస్తులు తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ ఆదేశాలు నిరుద్యోగులకు మొండిచెయ్యి తీరు మార్చుకోని టీడీపీ ప్రభుత్వం నరసరావుపేట టౌన్ : తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసగించి తన వైఖరిని చాటుకుంది. టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు కాగానే ప్రతి మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల్లో నిరుద్యోగ యువతకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ తిరిగి నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి మండలానికి ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ దుకాణాల్లో సూపర్వైజర్, సేల్స్‌మ్యాన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని 50 సేల్స్‌మ్యాన్, 32 సూపర్వైజర్ల పోస్టులకు సుమారు 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే నెల 25వ తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అధికారులు ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. సాంకేతిక కారణాలతో ఇంటర్వ్యూలు వాయిదా వేశామని, తిరిగి త్వరలోనే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. నేటి వరకు ఆ ఊసే లేదు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, వాటిని లాటరీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రెండ్రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ద్యోగాల కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత అదిక మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్ణయం వారిని పిడుగుపాటుకు గురిచేసింది. ప్రజాధనం వృధా... ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ప్రచారానికి లక్షల రూపాయలు వెచ్చించింది. చివరకు నియామకాలు చేపట్టకపోగా, నోటిఫికేషన్ రద్దు చేయడంతో ప్రజాధనం వృధా అయింది. నిరుద్యోగులు దరఖాస్తుల కోసం నోటరీ, అటెస్టేషన్లతో పాటు వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో సేల్స్‌మన్ మృతి
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ సేల్స్‌మన్ దుర్మరణం చెందగా మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గండిగూడ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాత బస్తీ తలాబ్‌కట్టకు చెందిన రజీయుద్దీన్ జుబేర్(23), మునావర్ అలీ(16)లు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గాకు బైకుపై వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో గండిగూడ సమీపంలోకి రాగానే వీరి బైకును ఆటో ఢీకొంది. ప్రమాదంలో జుబేర్‌కు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలైన అలీని శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జుబేర్ నగరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తుండేవాడని తెలిసింది. ఇతనికి భార్య ఉంది. గాయపడ్డ అలీ పదో తరగతి చదువుతున్నాడు. జుబేర్ మృతదేహాన్ని స్థానిక క్లష్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.