samaikya garjana
-
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ డబుల్ గేమ్: హెడ్ లైన్స్ టుడే
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ తుఫాన్ ఢిల్లీని చుట్టుముట్టింది అని హెడ్ లైన్స్ టుడే తన కథనంలో వెల్లడించింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జంతర మంతర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని హెడ్ లైన్స్ టుడే పేర్కోంది. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని బీజేపీ ఆరోపిస్తున్న విషయాన్ని తన కథనంలో తెలిపింది. తెలంగాణ ఉద్యమకారులను ఆకర్షించడానికి ఓ వైపు, సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో బిల్లును అడ్డుకుంటున్నట్టు పార్లమెంట్ లో డబుల్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ పార్టీ విధానంపై వెల్లువెత్తుతున్న ఆరోపణల్ని హెడ్ లైన్స్ టుడే వెలుగులోకి తెచ్చింది. -
సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
ఎంపీలకు ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి ఉద్యమం ఎలా ఉందో కర్నూలుకు వచ్చి తెలుసుకో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ సమైక్యాంధ్ర కోసం గర్జించిన కర్నూలు సాక్షిప్రతినిధి, కర్నూలు: ‘పొత్తులు, ఎత్తులతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తాం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పుడు అన్ని పార్టీలకు చెందిన అభిమానులు ఉన్నందున పార్టీల గురించి ఇప్పుడే ప్రకటించబోం. సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల్లోని ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎంపీల రాజీనామాలపై ఒత్తిళ్లు పెంచుతాం. అదే సమయంలో శాసనసభ్యులంతా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే వారికి రాజకీయ భవిష్యత్తు మిగులుతుంద’ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. కర్నూలులో ఆదివారం జరిగిన ‘సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల భేరిలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఢవ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘ సమైక్యఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది.. కర్నూలులో సభ అంటే లక్షలాది మంది జనం తరలివచ్చారు. అయితే దీన్ని హైదరాబాద్‌లో జరిగిన సభలో ఓ నాయకుడు (కేసీఆర్) అపహాస్యం చేస్తూ మాట్లాడారు. గడ్డితిని, ఈకలు తింటూ చేసేవి ఉద్యమాలా అంటూ హేళన చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఉద్యమం అంటే ఏంటో తెలుస్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇంకా ఉద్యమం తీవ్రమవుతుంది. మీరు బలహీనపడి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సీమాం ధ్రుల అంగీకారం లేకుండా తెలంగాణ రాదు. తెలంగాణ ప్రకటన చేసి 60రోజులైంది. ముందుకు వెళుతున్నాం అంటున్నారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికి కారణం మా ఉద్యమమే. తెలంగాణ విషయంలో ముందుకు వెళ్లినా ఢిల్లీలో ఆపే శక్తి మాకుంది. మా ఎంపీల మెడలు వంచి తెలంగాణను ఆపుతాం. ఇప్పటి వరకు గాంధీల్లా శాంతియుత ఉద్యమం చేస్తున్నాం. రెచ్చగొడితే మా గుండెల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు బయటకి వస్తారు. మేం సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మీరు సర్దుకుపోయాం అంటున్నాం. ఇప్పుడు మేం సర్దుకుపోతాం కలిసుందాం అంటున్నాం’ అని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను గెలిపించాం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ విభజన లేనందుకే ఆ పార్టీని గెలిపించామని, విభజన అన్న పార్టీలను ఓడించామని అశోక్‌బాబు గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రంగా ఉంచుతారని నమ్మకంతో ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసగించి తెలంగాణ ప్రకటన చేయడం సరికాదన్నారు. నదీజలాల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఉండడానికి మేమేం అటు ఇటు కాని వాళ్లం కాదు. పార్లమెంటులో బిల్లు పెట్టిన రోజున ఢిల్లీలో మిలియన్మార్చ చేస్తామని ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు వి.సిహెచ్ వెంగళరెడ్డి అధ్యక్షత వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర నేత చలసాని శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, కర్నూలు జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశ్, పరిపాలన అధికారి సంపత్ కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొని ప్రసంగించారు. -
విజయవంతంగా ముగిసిన జనభేరీ, సమైక్య గర్జన
హైదరాబాద్/కర్నూలు: తెలంగాణవాదులు హైదరాబాద్‌లో సకల జన భేరీ పేరుతో, సమైక్యవాదులు కర్నూలు సమైక్య గర్జన పేరుతో నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సకల జనభేరి సభకు, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభకు జనం భారీగా తరలి వచ్చారు. రెండు ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించిన రెండు సభల ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. సకల జనభేరీ తెలంగాణ నినాదాలతో, సమైక్య గర్జన సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయాయి. సకల జనభేరీలో నేతలు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవలసిందేన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్టోబరు 6 తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండరని చెప్పారు. ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని అన్నారు. సమైక్య గర్జనలో మాట్లాడిన నేతలు సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యచరణ: అశోక్ బాబు
కర్నూలు: సీమాంధ్ర ఉద్యమానికి లక్ష గొంతుకలు తోడవడంతో కర్నూలు పట్టణం సమైక్య గర్జనతో మార్మోగింది. గత రెండు నెలల నుంచి సమైక్య నినాదంతో గర్జించిన సీమాంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ సభలో పలువురు మాట్లాడారు. ఈ సభకు రాజకీయ నాయకులు రాకపోయినా, ప్రజలే నాయకులుగా ఉండి సభను విజయవంతం చేశారు. ఈ సభలో చివరిగా ప్రసంగించిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహద పడితే.. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు భాగస్వామ్యం లేదనడం భావ్యం కాదని అశోక్ బాబు సూచించారు. సమైక్య ఉద్యమాన్ని చులకనగా చేసి మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఇస్తామంటే అడ్డుకుంటామన్నారు. ఒకవేళ పార్లమెంట్ లో తెలంగాణ విభజన బిల్లు పెడితే మిలినియం మార్చ్ చేస్తామని అశోక్ బాబు హెచ్చరించారు. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా తమ భవిష్య ఉద్యమ కార్యచరణ ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ఇంత ఉద్యమం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ఆ ఇబ్బందిని దిగుమింగుకుని ఉద్యమంలో పాల్గొంటున్న సంగతిని తెలంగాణ నేతలు గుర్తించాలన్నారు. కేసీఆర్ చాలాసార్లు సీమాంధ్ర సంస్కృతిని అవమానించిన విషయాన్ని అశోక్ బాబు లేవనెత్తారు. సీమాంధ్ర బస్సులపై రాళ్లను వేయించడం తెలంగాణ సంస్కృతా?అని ప్రశ్నించారు. ఈ ప్రజా ఉద్యమంలో సంస్కృతిల పేరుతో విమర్శించుకోవడం భావ్యం కాదన్నారు. ఎవరకు ఉండే సంస్కృతి వారికే ఉంటుదని తెలిపారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే.. ఆనాడు దొరల పాలన, ఈనాడు టీఆర్ఎస్ హవా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ కు తమదే అంటున్నటీఆర్ఎస్ పార్టీ.. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదని సూటిగా ప్రశ్నించారు. -
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన Part 3
-
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన Part 2
-
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన
-
హైదరాబాద్‌లో సకల జనభేరి, కర్నూలులో సమైక్య గర్జన
హైదరాబాద్/కర్నూలు : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సకల జనభేరి జరుగుతుంటే, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభలు జరుగుతున్నాయి. ఈ రెండు సభలకు జనం భారీగా తరలి వచ్చారు. సకల జనభేరిలో నేతలు తెలంగాణవాదం వినిపిస్తున్నారు. మధ్య మధ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. తెలంగాణ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. సమైక్య గర్జనలో నేతలు సమైక్యవాదం వినిపిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లుతోంది. -
ప్రాజెక్టులనూ ముక్కలు చేస్తారా?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు... మరి సాగునీటి ప్రాజెక్టులను ఎలా ముక్కలు చేస్తారు..? నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండు ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి.. వాటి నుంచి నీటి పంపకం ఎలా చేస్తారంటూ సమైక్య గర్జనసభ ప్రశ్నించింది. తెలుగు ప్రజల రెక్కల కష్టమైన హైదరాబాద్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, సీమాంధ్ర మొత్తం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శనివారం విశాఖలో రాజకీయేతర జేఏసీ నిర్వహించిన ‘సమైక్య గర్జన’ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున సమైక్యవాదులు తరలివచ్చారు. సభలో ఎన్టీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజీలు, ఆస్పత్రులు, పరిశోధనా కేంద్రాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ రాజధానిలోనే ఉన్నాయని ఇప్పుడు హైదరాబాద్ మీది కాదు పొమ్మంటే కృత్రిమ గుండెతో ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో విషాన్ని నింపి తెలంగాణ నేతలు ఉద్యమం నడిపించారని, కానీ, సీమాంధ్రలో ఉద్యమానికి నీతి నిజాయితీలే పెట్టుబడులన్నారు. రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.