రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ డబుల్ గేమ్: హెడ్ లైన్స్ టుడే
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ తుఫాన్ ఢిల్లీని చుట్టుముట్టింది అని హెడ్ లైన్స్ టుడే తన కథనంలో వెల్లడించింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జంతర మంతర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని హెడ్ లైన్స్ టుడే పేర్కోంది.
పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని బీజేపీ ఆరోపిస్తున్న విషయాన్ని తన కథనంలో తెలిపింది. తెలంగాణ ఉద్యమకారులను ఆకర్షించడానికి ఓ వైపు, సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో బిల్లును అడ్డుకుంటున్నట్టు పార్లమెంట్ లో డబుల్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ పార్టీ విధానంపై వెల్లువెత్తుతున్న ఆరోపణల్ని హెడ్ లైన్స్ టుడే వెలుగులోకి తెచ్చింది.