samaikyandhra sankharavam
-
నేడు విశాఖ జిల్లాలో ‘సమైక్య శంఖారావం’
-
నేడు విశాఖ జిల్లాలో జగన్ ‘సమైక్య శంఖారావం’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సమైక్య శంఖారావం’ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు. -
మనమే ముందు నిర్వహిద్దాం!
వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం కన్నా ముందే సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ సభలు... గంటా నివాసంలో శైలజానాథ్, లగడపాటి భేటీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర శంఖారావం సభ నిర్వహించడానికి ముందే సీమాంధ్రలో జిల్లాల వారీగా భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు గంటా శ్రీనివాసరావు నివాసంలో మంగళవారం సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ ఎస్.శైలజానాథ్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. సీమాంధ్రలో గత రెండు నెలలుగా జీతాల్లేకుండా ఏపీఎన్జీవోలు సమ్మెను కొనసాగిస్తున్నారని, వారిలో నైతిక సై్థర్యం దెబ్బతినకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమెలా? అన్న విషయంపై వారు చర్చించారు. అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తనవైపు తిప్పుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, అందువల్ల ఆ పార్టీ కంటే ముందే జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదన్న భావనకు వారు వచ్చారు. ఏ జిల్లాలో ఎప్పుడు సభ నిర్వహించాలనే అంశంపై ఈనెల 3న హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న క్లబ్‌హౌస్‌లో నిర్వహించే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. -
షర్మిల బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం అనంతపురంలో వెల్లడించారు. ఆ మహానేత కుటుంబంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రను సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.