sambhavami
-
మహేశ్ మర్మం ఏంటో?
హైదరాబాద్.. ముంబయ్.. అహ్మదాబాద్... ఇండియా అంతా చుట్టేస్తున్నారు మహేశ్‌బాబు. మరోపక్క బ్యాంకాక్‌లో క్లైమాక్స్‌ని చిత్రీకరించాలను కుంటున్నారట! ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే జూన్ 23న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కానీ, ఇప్పటివరకూ టైటిల్ ఏంటో మాత్రం చెప్పలేదు. ‘ఏజెంట్ శివ’, ‘సంభవామి’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి ‘మర్మం’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి.. ఈ మూడు టైటిల్స్‌లో ఏదో ఒకటిని ఖరారు చేస్తారా? లేక వేరే టైటిల్ పెడతారా? అనేది వేచి చూడాలి. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. -
ఇరవై అయిదుకు అంతా రెడీ
మహేశ్‌బాబు హీరోగా నటించబోయే 25వ చిత్రానికి దర్శక–నిర్మాతలు ఖరారయ్యారు. హీరోగా మహేశ్ మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ నిర్మాత సి. అశ్వినీదత్, మహేశ్ నటించిన మొదటి మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిర్మాత ‘దిల్’ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఊపిరి’తో మంచి విజయం అందుకున్న వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. అమెరికా నేపథ్యంలో మంచి కుటుంబ విలువలతో కూడిన కథను దర్శకుడు సిద్ధం చేశారట. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెలుగు, తమిళ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట! దీని తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌బాబు నటిస్తారు. ఆ తర్వాత ఇరవై అయిదో సినిమా ఆరంభమవుతుందని ఊహించవచ్చు. -
విలన్‌గా...మరో హీరో
మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో దర్శకుడు కమ్ హీరో అయిన ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు మరో హీరో కూడా ప్రకటించారు. అతను ఎవరో కాదు... ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్ భరత్. ఇప్పటివరకూ భరత్ నెగిటివ్ రోల్ చేయలేదు. మహేశ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్లో భరత్ కొన్ని రోజులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, పుణేలలో జరగబోయే షెడ్యూల్స్‌లోనూ పాల్గొననున్నారు. ‘‘మహేశ్ ఫ్రెండ్లీ కో–స్టార్. ఈ సినిమాలో ఛాన్స్ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా పాత్రను ఆసక్తికరంగా రాశారు’’ అని భరత్ తెలిపారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. -
కోలీవుడ్ హీరోకి మహేష్ లైఫ్ ఇస్తున్నాడా?
-
దుష్ట శిక్షణకుసంభవామి
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే – ‘‘సత్పురుషుల సంరక్షణకూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపన కోసం... ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను’’ అనేది ‘భగవద్గీత’లోని ఈ శ్లోకం తాత్పర్యం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 24 వరకూ మహేశ్, ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి ‘ఏజెంట్ శివ’తో పాటు పలు టైటిల్స్ వినిపించాయి. అయితే.. ధర్మసంస్థాపన కోసం దుష్టులను శిక్షించే ఓ పోలీసాఫీసర్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుందని చిత్ర బృందం భావించారట! రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31న విడుదల చేస్తారని టాక్. -
ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంత వరకు టైటిల్ నిర్ణయించలేదు. కానీ సినిమా మొదలైన దగ్గరనుంచి ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. ఎనిమి, వాస్కోడగామ, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామీ అనే టైటిల్‌ను నిర్ణయించారట. ఈ సినిమా నిర్మాతలు ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయటంతో మహేష్ బాబు సినిమా కోసమే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే మహేష్ సినిమా కోసమే సంభవామి టైటిల్‌ను రిజిస్టర్ చేశారా..? లేక మరో ప్రాజెక్ట్ కోసమా..? అన్న సంగతి తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. హారీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా 2017లో సమ్మర్ లో రిలీజ్ అవుతోంది.