Samiyakashkaram
-
నేడు జగన్ యాత్ర సాగుతుందిలా..
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడవ విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం నాటి పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి ప్రారంభం తట్టివారిపల్లె, గౌనివారిపల్లె, చేనేతనగర్, సర్కార్ తోపు, ఎలకపల్లె, అమ్మచెరువు మిట్ట, నీరుగట్టు వారిపల్లె మీదుగా గొల్లపల్లెల్లో రోడ్ షో గొల్లపల్లెలో కంచికొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. తట్టివారిపల్లెలో విగ్రహాన్ని ఆవిష్కరించి, తురకపల్లె, ఆరోగ్యవరం, పోతబోలు క్రాస్, కొత్తవారిపల్లె క్రాస్, గుడిసెవారిపల్లె, సీటీఎం క్రాస్ వరకు రోడ్డుషో. సీటీఎం గంగపురంలో శనక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి పూలవాండ్లపల్లె, కాశిరావు పేటలో రోడ్‌షోలో పాల్గొని, వాల్మీకిపురంలో బస చేస్తారు. -
జన తరంగం
=అరకు సమైక్య శంఖారావం అపూర్వ రీతిలో విజయవంతం =వెల్లువలా తరలివచ్చిన గిరిజనం =మన్యంలో మార్మోగిన జగన్నినాదం అరకు/ఆరకు రూరల్, న్యూస్‌లైన్: అరకులో జనసాగరం హోరెత్తింది. వెల్లువెత్తిన ప్రజానీకంతో జన జలపాతం పరవళ్లు తొక్కింది. సమైక్య శంఖారావం సభకు హాజరైన గిరిజనంతో అరకు నలుదిశలా జన సమూహమే కనిపించింది. మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనంతో అరకులో జాతర జరుగుతున్న భావం కదలాడింది. వైఎస్సార్సీపీ సారథి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఉప్పొంగిన గిరిజనోత్సాహం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్ నామస్మరణతో అరకులోయ మార్మోగింది. వైఎస్సార్ సీపీ జెండాలతో కళకళలాడింది. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో ప్రతిద్వనించింది. మునుపెన్నడూ లేని విధంగా మారుమూల గూడేల నుంచి తరలివచ్చిన గిరిజన సంతతి అరకులో కదం తొక్కింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించింది. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ పార్టీ వైఎస్సార్ సీపీయేనని, సమైక్యరాష్ట్రం కోసం తపన పడుతున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించింది.. వేల సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలను చూసి ఇతర పార్టీల నాయకులలో ఆశ్చర్యం వెల్లువెత్తింది. కుంభా రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమైక్య శంఖారావం సభకు వచ్చిన ప్రజానీకంతో అరకు జనసంద్రమైంది. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద నుండి ఎంపీడీఓ కార్యలయం, టౌన్షిప్, వైఎస్సార్ జంక్షన్ మీదుగా సభా స్థలికి వైఎస్సార్సీపీ నేతలతో కలసి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సభ జరిగినా జనం కదలకుండా ప్రసంగాలు విన్నారు. వందలాది మంది శ్లాబ్‌లు, ప్రహారీ గోడలు, దుకాణాలపై ఎక్కి నేతల ప్రసంగం ఆలకించారు. సోనియా, చంద్రబాబు కుట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తమకు భవిష్యత్తు ఉండదన్న భయంతో సోనియా గాంధీ, చంద్రబాబు రాష్ట్ర విభజనకు తలపెట్టారని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకే సోనియా, బాబు విభజన కుయుక్తి పన్నారని విమర్శించారు. అరకులో నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్య నిర్వహక అరకులో శంఖారావం సభ జగన్ సభను తలపించిందని పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు ప్రశంసించారు. ఇటలీ బొమ్మ సోనియాకు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయం తెలియవని, అందుకే ఆమె విభజనకు సిద్ధపడ్డారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంత అభివృద్దికి ఎంతో కృషి చేశారని చెప్పారు. అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జీసీసీ దళారీ వ్యవస్థగా మారిపోయిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఏపీని రెండు కాదు మూడు రాష్ట్రాలుగా చేయాలని కంకణం కట్టుకొని చెబుతుండడం దారుణమని చెప్పారు. బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జి బేబి నాయన మాట్లాడుతూ వైస్సార్ బ్రతికి ఉంటే విభజన జరిగేది కాదని చెప్పారు. చంద్రబాబును రెండు సార్లు ప్రజలు ఓడించినా సిగ్గురాలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుందని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద రెడ్డి, మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, జెడ్పీ మాజీ చైర్మన్, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త వంజంగి కాంతమ్మ, మాడుగుల సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, ఎస్‌కోట వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు చినరాంనాయుడు, సుబ్బరాజు, సీఈసీ సభ్యుడు పీవీఎస్ఎన్రాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు బిబి. జగ్గన్న, శోభ వీరభద్రరాజు, పాంగి చిన్నారావు, పల్టాసింగి విజయ్‌కుమార్, పొద్దు అమ్మన్న, దూరు గంగన్నదొర, పాగి అప్పారావు, సొనాయి కృష్ణారావు, పట్టాసి కొండలరావు, కొర్రా కాసులమ్మ, వచ్చంగి పద్మ, రాందాస్, రవణమూర్తి, వెచ్చంగి కొండయ్య, దురియా రుక్మిణి, 56 మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు సమైక్య శంఖారావం బహిరంగ సభలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆద్వర్యంలో అలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ బృందం వేదికపై నృత్యాలు చేస్తూ పాడుతూ ఉంటే సభలో ఉన్న గిరిజనం కేరింతలు కొట్టారు. రెండు ప్రసంగాలకు మధ్య సాంస్కృతిక బృందం పాటలు పాడుతూ జనాన్ని ఉత్సాహపరిచారు. పార్టీలో పలువురు చేరిక : శంఖారావం సభలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మాడగడ మాజీ సర్పంచ్, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన సొనాయి బజ్జింగు, అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రేగబోయిన స్వామి, వాలసి, శిరగాం, కివర్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీలోకి చేరా రు. వీరికి దాడి వీరభద్రరావు, అరకు నియోజక వర్గం సమన్వయకర్త కుంభా రవిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
గుడ్డి ప్రభుత్వాలను కూలగొట్టండి
పెడన, న్యూస్‌లైన్ : దేశంలో, రాష్ట్రంలో గుడ్డి ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నాయని, వాటిని కూకటివేళ్లతో కూలగొట్టండని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పిలుపునిచ్చారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ శుక్రవారం ఏర్పాటుచేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో నాని మాట్లాడుతూ ఎంపీలు, కేంద్రమంత్రులు మూడు నెలల అధికారం కోసం సీమాంధ్రలో ఉన్న ఆరున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారని, తమ వ్యాపార లావాదేవీల ముసుగులు ఎక్కడ బయట పడతాయోననే భయంలో ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ అవసరం తీరాక తెప్పతగలేసే రకంగా మారాయన్నారు. వైఎస్ హయాంలో విభజనవాదం వినిపించకుండా చేశారని, ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్ల అసమర్థత వల్లే విభజన వాదం బయటికొచ్చిందని విమర్శించారు. ఎన్టీఆర్ నడిచిన బాటలో ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని, అందుకే టీడీపీ నేతలు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు. బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో నీరున్న దాళ్వా ఉందా లేదా అని ఇంతవరకు జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక రైతులందరూ దాళ్వాకు సిద్ధంకావాలని, తాము పోరాటం చేసి సాగునీరు విడుదల చేయించేందుకు నడుంబిగిస్తామని భరోసా ఇచ్చారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే డెల్టా ప్రాంతం ఎడారిగా మారి కోస్తా తీర ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ బందరు పార్లమెంటు కన్వీనర్ కుక్కల విద్యాసాగర్, అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, నేతలు ఉప్పాల రాము, మావులేటి వెంకట్రాజు, మాదివాడ రాము, బొడ్డు శ్యామలాదేవి, పిచ్చుక శంకర్, అంకెం సముద్రయ్య, ముత్యాల నాగేశ్వరరావు, సంగా మధు, యాళ్ల బాబులు పాల్గొన్నారు. -
29న బాబు రాక?
=తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం =తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం నింపేందుకే =వాయిదాపడ్డ శంఖారావం 29న జరిగే అవకాశం సాక్షి, తిరుపతి: జిల్లాలో నీరసంగా ఉన్న తెలుగు తమ్ముళ్లను ఉత్తేజ పరచడానికి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నట్లు తెలిసింది. అదే రోజున ఎన్నికల శంఖారావం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అక్టోబర్ 29వ తేదీన శంఖారావం పేరుతో తిరుపతిలో సభను ఏర్పాటు చేయాలనుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ సభను నవంబర్ ఏడో తేదీన ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తుపాను పేరుతో నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు నీరసించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ వచ్చినా తమ్ముళ్లలో ఉత్తేజం కనిపించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని తిరుపతి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29వ తేదీన మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. దీనికిగాను జన సేకరణ ప్రారంభించాలని అధిష్టానం నుంచి సమాచారం రావడంతో, జిల్లాలోని ‘దేశం’ నాయకులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తాననడం, వాయిదా పడడం రెండు సార్లు జరగడంతో, ఈ సారైనా కచ్చితంగా వస్తారా లేదా అని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం తిరుమలకు వచ్చిన పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు కొంత మంది నాయకులను కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు 29న వ చ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. దీంతో జన సేకరణ ఏ విధంగా చేపట్టాలనే విషయంపై జిల్లా నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. దాదాపు లక్షమందితో ఈ సభను నిర్వహించాలని, ఎన్నికల శంఖారావం కావడంతో, సభ భారీగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. జనం తక్కువయినా, ఎక్కువగా కనిపించే చోటు మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ ఒక్కటేనని, అందుకే అక్కడే సభను నిర్వహించాలని జిల్లా నాయకులు అనుకుంటున్నారు. ఒక వేళ ఎక్కువ మందిని సమీకరించగలిగితే వేదికను మార్చే అవకాశం ఉంది. -
కుప్పం నుంచి సమైక్య శంఖారావం
-
బాబు కోట నుంచి జగన్ శంఖారావం
*నేడు కుప్పం నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం *వివిధ ప్రాంతాల నుంచి కుప్పం చేరుకుంటున్న అభిమానులు *టీడీపీలో గుబులు సాక్షి, తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెప లాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబు ఇలాకాలో శనివారం అతి పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించలేదు. తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా కుప్పం సరిహద్దు కాళికమ్మ ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం నాయకుల్లో గుబులు నెలకొంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం కుప్పంలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగనుంది. తొలి రోజున నాలుగు చోట్ల దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి కుప్పం చేరుకున్నారు. జగన్ పర్యటన పర్యవేక్షణను టూర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చేపడుతున్నారు. సమైక్య శంఖారావం సభకు కుప్పం పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ శ్రేణులతో నిండిపోయింది. జగన్ పైపాళెంలో ఓదార్పు ముగించుకుని వచ్చిన తరువాత సమైక్య శంఖారావం సభను బస్‌స్టాండ్ వద్ద నిర్వహిస్తారు. దీనికోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సమైక్య శంఖారావానికి జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పాటు, కార్యకర్తలు, పార్టీలకతీతంగా ప్రజలు హాజరుకానున్నారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమైక్య సభపై కుప్పం వాసులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ సమైక్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సమైక్యత కోసం కట్టుబడిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో నీళ్లు రాకపోయినా పట్టించుకోవడం లేదని, విభజన జరిగితే అసలు నీళ్ల్లే దొరకవని ఆందోళనగా ఉందంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
జగన్ యాత్రతో బాబుకు దిమ్మతిరగడం ఖాయం
=మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి =రేపు కుప్పం నుంచి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర =అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు దిమ్మతిరగడం ఖాయమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. శనివారం కుప్పం నుంచి ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం పీలేరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణవార్త విని గుండెపగిలి చనిపోయిన కుటుంబాలను జగన్ ఓదారుస్తారని తెలిపారు. అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్య వాదులు వేలాదిగా తరలివచ్చి యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యాత్రను అడ్డుకునే విధంగా ప్రజలను రెచ్చగొట్టడం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దిగజారు డు తనానికి నిదర్శనమన్నారు. తనస్థాయి మరచి వార్డు సభ్యునికన్నా హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ సమైక్య యాత్ర రాయలసీమతో పాటు తెలంగాణ , కొస్తాంధ్రలోనూ సాగుతుందన్నారు. ఆయన యాత్రను చూసి చంద్రబాబుకు దిమ్మతిరగడం ఖాయమన్నారు. జగన్‌తోనే రాజన్న సువర్ణ యుగం సాధ్యమన్నారు. సీఎం కిరణ్, చంద్రబాబులు ఇక ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని, వచ్చే ఎన్నికల్లో ఇరువురూ తట్టాబుట్టా సర్దుకోక తప్పదని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలూ ఎన్ని అవాంతరాలు సృష్టిం చినా కాబోయే సీఎం జగనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డాక్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ కదిరి వెంకట్రామయ్య, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ ఓ.లక్ష్మీనారాయణ, బీడీ.నారాయణరెడ్డి, షామియాన షఫీ, రమేష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, జనార్దన్‌రెడ్డి, ఎల్ఐసీ ద్వారకనాథరెడ్డి, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, చినబాబు, భాస్కర్‌రెడ్డి, విక్టరీ వెంకట్రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, సదుం నాగరాజ, కాలనీ చిన్న, ఉదయ్‌కుమార్, పూల కుమార్, కత్తి రామలింగారెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమైక్య శంఖారావానికి తరలిరండి పుత్తూరు: జగన్ చేపట్టనున్న సమైక్య శంఖారావానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి పిలుపునిచ్చారు. గురువారం పుత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. జగన్ యాత్రతో టీడీపీ కంచుకోట బద్ధలవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ఇచ్చిన లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. అక్కడ ఏర్పాటు చేయనున్నబహిరంగ సభలో సమైక్యాంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గం.లకు చిత్తూరు జిల్లాలోకి జగన్ ప్రవేశించనున్న జగన్..ఓదార్పు కుటుంబాలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.గం.లకు కుప్పంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. కుప్పం వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తొలుత ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు. తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు. -
బాబు ఇలాకా నుంచి..సమైక్య శంఖారావం
=30న కుప్పం రానున్న వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి =ఆయన రాకకు వైఎస్ఆర్ సీపీ ఘనంగా ఏర్పాట్లు =కుప్పంలో ఓదార్పుతో పాటు బహిరంగ సభ సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇలాకా అయిన కుప్పం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోన్రెడ్డి సమైక్య శంఖారావం వినిపించనున్నారు. కుప్పం వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈనెల 30వ తేదీన ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు. తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు. కుప్పం ‘దేశం’లో గుబులు కుప్పంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన కోసం ఆ పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న ఏర్పాట్లు తెలుగుదేశం నాయకుల్లో గుబులు రేపుతోంది. ఏర్పాట్ల సమావేశానికే భారీగా కార్యకర్తలు తరలిరావడం కొత్త పరిణామమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో జరిగే సభకు ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు అందజేసినట్లు సమాచారం. ఆ సభకు కుప్పంవాసులు హాజరుకాకుండా చూడాలని పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలిసింది. కుప్పంవాసులు సభ రోజు ఇళ్లకు తలుపులు వేసుకోవాలని సూచిం చినట్లు సమాచారం. వైఎస్ఆర్ సీపీ ఉత్సాహం ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమ బలం నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో తెలుగుదేశం ఓటు బ్యాంకు తగ్గినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్లు గతుకుల మయం కావడం, వీధి కొళాయిల్లో నీళ్లు రాకపోవడం, విద్యుత్ కోతలతో కుప్పం వాసులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి రాకతో చంద్రబాబు ఓటు బ్యాంకు వైఎస్ఆర్ సీపీ వైపు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన పర్యటకు హాజరు కాకూడదని కుప్పం ప్రజలను టీడీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు. జగన్ పర్యటన కుప్పం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.