Samsung Galaxy Note
-
శాంసంగ్.. గెలాక్సీ ‘నోట్ 10’
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లో మరో రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లను మంగళవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో ‘నోట్ 10’ ఫోన్ ధర రూ.69,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.3 అంగుళాల డిస్ప్లే, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా (16 మెగాపిక్సెల్, 12 ఎంపీ, 12 ఎంపీ), ముందువైపు 10 ఎంపీ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈఫోన్ స్పెసిఫికేషన్లుగా ప్రకటించింది. ‘నోట్ 10 ప్లస్’ మోడల్లో రెండు వేరియంట్లు ఉండగా.. ఇందులో ప్రారంభ ధర రూ.79,999 నుంచి నిర్ణయించింది.కెమెరాలు ఈ నూతన వేరియంట్లలో ఒకేలా ఉండగా.. హైఎండ్‌లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. నోట్ 10 ప్లస్.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో విడుదలయ్యాయి. ఆగస్టు 23 నుంచి ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. -
2016 టెక్నాలజీ ఫెయిల్యూర్స్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7: దీని దెబ్బకు సదరు సంస్థ ఇప్పటికీ కోలుకోలేదు. ఆర్థికంగా నష్టంతోపాటు సంస్థ ప్రతిష్ట కొంతమేర మసకబారింది. ఫాలింగ్ డ్రోన్స్: ఆకాశంలో అదిరిపోయే ఫొటోలను తీస్తామంటూ దూసుకొచ్చిన కర్మ డ్రోన్స్ కూడా విఫలమయ్యాయి. ఆకాశంలోకి ఎగరగానే ఇవి తమ పవర్‌ను కోల్పోయాయి. మిస్సింగ్ పోర్ట్స్: ఎటువంటి హెడ్ ఫోన్స్ లేకుండా సంగీతాన్ని వినండంటూ యాపిల్ సంస్థ హెడ్జాక్లను తీసుకొచ్చింది. అయితే ఇవి మార్కెట్లోకి రాగానే నిరాశను మిగిల్చాయి. చిన్న డాంగెల్ లాంటి పరికరం లేకుండా పనిచేసే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారుల ఆదరణ పొందలేకపోయాయి. Consumer Friendly 360: వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చిన 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ కెమెరాల వీడియో క్వాలిటీ సరిగా లేకపోవడంతో ఆరంభంలోనే చతికిలపడ్డాయి. చాట్ బోట్స్: ఫేస్బుక్.. మెసెంజర్లో చాట్ బోట్స్ అంటూ ఓ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. అయితే ఇది అనుకున్నంతగా జనాదరణ పొందలేదు. -
బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ సి తమ షోరూమ్‌లలో ‘శామ్సంగ్ గెలాక్సీ నోట్ 5’ మొబైళ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల కోసం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్ధ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి మాట్లాడుతూ... తమ కస్టమర్ల సంతోషం కోసం ఎప్పటికప్పుడు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ.. వారికి బహుమతులను అందిస్తున్నామని... అందులోభాగంగానే ఇప్పుడు వినూత్నంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.