న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లో మరో రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మంగళవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో ‘నోట్ 10’ ఫోన్ ధర రూ.69,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.3 అంగుళాల డిస్‌ప్లే, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా (16 మెగాపిక్సెల్, 12 ఎంపీ, 12 ఎంపీ), ముందువైపు 10 ఎంపీ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈఫోన్ స్పెసిఫికేషన్లుగా ప్రకటించింది. ‘నోట్ 10 ప్లస్’ మోడల్‌లో రెండు వేరియంట్లు ఉండగా.. ఇందులో ప్రారంభ ధర రూ.79,999 నుంచి నిర్ణయించింది.కెమెరాలు ఈ నూతన వేరియంట్లలో ఒకేలా ఉండగా.. హైఎండ్‌లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. నోట్ 10 ప్లస్.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో విడుదలయ్యాయి. ఆగస్టు 23 నుంచి ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment