2016 టెక్నాలజీ ఫెయిల్యూర్స్
2016 టెక్నాలజీ ఫెయిల్యూర్స్
Published Thu, Dec 1 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7: దీని దెబ్బకు సదరు సంస్థ ఇప్పటికీ కోలుకోలేదు. ఆర్థికంగా నష్టంతోపాటు సంస్థ ప్రతిష్ట కొంతమేర మసకబారింది.
ఫాలింగ్ డ్రోన్స్: ఆకాశంలో అదిరిపోయే ఫొటోలను తీస్తామంటూ దూసుకొచ్చిన కర్మ డ్రోన్స్ కూడా విఫలమయ్యాయి. ఆకాశంలోకి ఎగరగానే ఇవి తమ పవర్‌ను కోల్పోయాయి.
మిస్సింగ్ పోర్ట్స్: ఎటువంటి హెడ్ ఫోన్స్ లేకుండా సంగీతాన్ని వినండంటూ యాపిల్ సంస్థ హెడ్‌జాక్‌లను తీసుకొచ్చింది. అయితే ఇవి మార్కెట్లోకి రాగానే నిరాశను మిగిల్చాయి. చిన్న డాంగెల్ లాంటి పరికరం లేకుండా పనిచేసే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారుల ఆదరణ పొందలేకపోయాయి.
Consumer Friendly 360: వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చిన 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ కెమెరాల వీడియో క్వాలిటీ సరిగా లేకపోవడంతో ఆరంభంలోనే చతికిలపడ్డాయి.
చాట్ బోట్స్: ఫేస్‌బుక్.. మెసెంజర్‌లో చాట్ బోట్స్ అంటూ ఓ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. అయితే ఇది అనుకున్నంతగా జనాదరణ పొందలేదు.
Advertisement
Advertisement