ఫ్లిప్‌కార్ట్ డే 2: స్మార్ట్ఫోన్లపై గ్రేట్ డీల్స్
సాక్షి, బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్ ఐదు రోజుల పండుగ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డేస్ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు వంటి వాటిపై ఫ్లిప్‌కార్ట్ బుధవారం గ్రేట్ డీల్స్‌ను అందించింది. నేటి నుంచి మొబైల్, ఎలక్ట్రానిక్స్ బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.
స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న టాప్ ఆఫర్స్...
శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ధర రూ.46వేల నుంచి రూ.29,990కు తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.23వరకు తగ్గింపు
ఆపిల్ ఐఫోన్ 7(32జీబీ) రూ.38,999కే అందుబాటు, ఎక్స్చేంజ్పై రూ.15,300 వరకు తగ్గింపు, అదనంగా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్పై 10 శాతం వరకు తగ్గింపు
ఓప్పో ఎఫ్3 ప్లస్(64జీబీ) ఫోన్ రూ.24,990కే లభ్యం, ఎక్స్చేంజ్పై రూ.23,500 వరకు తగ్గింపు,
హెచ్‌టీసీ యూ11 ఫోన్‌పై రూ.6,991 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుతం ఇది రూ.44,999కే అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.20వేల వరకు ఆఫర్ కూడా ఇస్తోంది.
మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డీల్స్...
ఆసుస్ జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, లెనోవో కే8 ప్లస్(3జీబీ) ఫోన్లు రూ.8,999కే లభ్యం
రెడ్మి నోట్ 4 ఫోన్ ఫ్లాట్ డిస్కౌంట్ రూ.2000. రూ.10,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటు, ఎక్స్చేంజ్లో ఈ ఫోన్‌పై రూ.10వేల వరకు తగ్గింపు ఉంది.
ఎంఐ మ్యాక్స్2(బ్లాక్, 64జీబీ) ఫోన్‌ఫై రూ.2000 తగ్గింపు, రూ.14,999కే విక్రయం, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.14వేల వరకు తగ్గిస్తోంది.
మోటో ఎం(64జీబీ) ధర రూ.12,999
నోకియా 3 రూ.9,505
కొత్త ఫోన్లపై కూడా ఆసక్తికరమైన ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. పానసోనిక్ ఎలుగ రే 700 ధర రూ.10వేలు. జెన్‌ఫోన్ సెల్ఫీ రూ.13,999కే లభ్యం.