San Jose
-
అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి
సాన్‌జోస్ (అమెరికా): కాలిఫోర్నియాలోని సాన్జోస్లో బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. సిలికాన్ వ్యాలీలో బస్సు, లైట్ రైలు సేవలు అందించే వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీకి చెందిన ఉద్యోగి సామ్ కాసిడీ ఈ దాడికి తెగబడ్డాడు. బుధవారం ఉదయం 6.30 గంటలకు కాసిడీ సాన్‌జోస్ రైల్వే యార్డులో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. అతని సహోద్యోగులు సహా మొత్తం 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. కాసిడీ కూడా చనిపోయాడు. అయితే అతనెలా చనిపోయింది తెలియరావట్లేదు. చదవండి: గాజాకు అండగా మేముంటాం: అమెరికా -
కారులో గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడని చితకబాదారు
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో గత శుక్రవారం ఒక కన్వెన్సన్ హాల్లో ఫ్యూరీ కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు. ఫర్రీస్ అంటే వివిధ రకాల జంతువులను పోలిన వేషదారణతో కల్పిత పాత్రలను ధరించి కథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఫర్రీస్ వేషం ధరించిన ఇద్దరు వ్యక్తులు సిగరేట్ తాగేందుకని బయటకు వచ్చారు. అప్పుడే వారి ముందు ఒక నీలం రంగు కారు వెళ్లి కొంచెం దూరంలో ఆగింది. ఆ తరువాత కారులోంచి ఎవరో అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు. కారులో ఒక యువకుడు తనతో పాటు ఉన్న యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కారు డోరును తెరిచే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో లోపల ఉన్న యువతి అతన్ని నెట్టివేసి డోర్ అన్‌లాక్ చేసింది. దీంతో లోపల ఉన్న వ్యక్తిని ఇద్దరు కలిసి బయటికి లాగారు. ఆమెను ఎందుకలా కొడుతున్నావని ప్రశ్నింస్తుండగానే వారిపై దాడికి దిగాడు. దీంతో ఫర్రీస్ అతని ఈడ్చి కిందపడేసి పిడిగుద్దుల వర్షం కురింపించారు. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా వీరిద్దరికి తోడయ్యి అతనిపై దాడి చేశారు. కాగా సమాచారం అందుకున్న శాన్‌జోస్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారందరిని విడిపించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తి పేరు డెమిట్రీ హార్డ్నెట్ అని, అతనికి 22 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తన గర్ల్‌ప్రెండ్‌ను కారులో ఇష్టమొచ్చిన రీతిలో కొట్టడంతో ఫ్యూరిస్ వేషదారులు ఎందుకలా కొడుతున్నావు అని ప్రశ్నింనందుకు వారిపై దాడి చేశాడని, అందుకే తిరిగి ప్రతిదాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కాగా డెమిట్రీ హార్డ్నెట్పై గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఫర్రీస్ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. pic.twitter.com/7QVA01UYO1 — ROBBIE! 🏝️ (@robbiesets) January 18, 2020 -
'ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ ఫ్లైట్'
శాన్ హోసె: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు ఢిల్లీకి నుంచి నేరుగా ఎయిరిండియా విమానం ప్రారంభిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసెలో ఎస్ఏపీ సెంటర్ లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి వారానికి మూడుసార్లు ఈ విమానం నడుపుతామని తెలిపారు. భారత్ లో అవినీతిని అంతం చేయడానికి జామ్(జేఏఎం) ప్రారంభించినట్టు తెలిపారు. జనధన్ యోజన బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో మొబైల్ గవర్నెన్స్ తో అనుసంధానించడమే 'జామ్' అని వివరించారు. ఉగ్రవాదం, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి ప్రధాన సవాలు మారిన సమస్యలని మోదీ అన్నారు. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అనేది ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్వచించడానికి ఐక్యరాజ్యసమితి 15 ఏళ్లు తీసుకుంటే, దానిపై పోరాటానికి ఇంకెంత సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు. -
చతుర్లు, విసుర్లు... ఉర్రూతలు
శాన్ హోసె: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో దూసుకుపోతున్నారు. ప్రతి అడుగులో తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసె ఎస్ఏపీ సెంటర్ లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ఆయన ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఎన్నారైలు కరతాళధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తనపై తానే ప్రశ్నలు సంధించుకుని సభికులతో సమాధానాలు రాబట్టారు. తన పాలనకు సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రవాసులను కోరారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ తనశైలిలో చతుర్లు, విసుర్లు కలగలపి ఉపన్యసించారు. ప్రవాస భారతీయులు తమ మేధాశక్తిని స్వదేశాభివృద్ధికి ధారపోయాలని ఉద్బోధించారు. 21వ శతాబ్దం ఇండియాదేనని ఉత్తేజపరిచారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాలకు వరకు ఎదిగామని వివరించారు. భారత్ యువశక్తిపై తనకున్న అపార నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని హామీయిచ్చారు. దేశం కోసం జీవిస్తా, దేశం కోసం ప్రాణమిస్తా అంటూ మోదీ చేసిన ప్రసంగం ఎన్నారైలను ఉర్రూతలూగించింది. కాగా, మోదీ సభకు ఎన్నారైలు పోటెత్తారు. సభా ప్రాంగణం కిక్కిరిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోవాల్సివచ్చింది. -
నాకు మీ సర్టిఫికెట్ కావాలి: మోదీ
-
నాకు మీ సర్టిఫికెట్ కావాలి: మోదీ
శాన్ హోసె: ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తానని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానిగా 16 నెలలు పనిచేసిన తనకు ఎన్నారైల సర్టిఫికెట్ కావాలని అడిగారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసెలో ఎస్ఏపీ సెంటర్ లో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 'ఒకప్పుడు ఢిల్లీకి అపరిచితుడిలా వచ్చాను. అప్పుడు పార్లమెంటుకు ఎలా వెళ్లాలో కూడా ఎవరినైనా అడగాల్సి వచ్చేది. 21వ శతాబ్దం ఎవరిది.. (ఈ ప్రశ్న అడగగానే అక్కడున్నవాళ్లంతా మోదీ.. మోదీ.. మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు) భారతదేశానిదని మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంది. ఈ మార్పు ఎక్కడినుంచి వచ్చింది? ఈ మార్పు మోదీ వల్ల రాలేదు.. ఈ మార్పు 125 కోట్ల మంది భారతీయుల సంకల్పం వల్ల వచ్చింది. 125 కోట్ల మంది భారతీయులంతా మనస్సులో సంకల్పం చెప్పుకొన్నారు. వాళ్లు సంకల్పం చెప్పుకొంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఈ ప్రపంచమంతా నిన్నటివరకు భారతదేశాన్ని ఎలా చూసినా ఇప్పుడు మాత్రం కేంద్ర బిందువులా చూస్తోంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచం వైపు చూసేది.. అందరూ ఎలాగోలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేందుకు ఆరాటపడుతోంది. చిన్న సంఘటన జరిగితే చాలు.. మీ మొబైల్ ఫోన్లో వెంటనే ఎలర్ట్ వచ్చేస్తుంది. దేశంలో వచ్చిన ఈ మార్పు వల్ల దేశంలో జరిగిన ప్రతి విషయం మీకు తెలిసిపోతుంది. స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూస్తున్నా.. బాల్ ఎటు వెళ్తోందో, అంపైర్ ఏం చెబుతున్నాడో కష్టపడి చూడాల్సి వచ్చేది. కానీ టీవీలో మాత్రం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఉండి దేశాన్ని చూసేవాళ్లకు తెలియదు గానీ, మీకు మాత్రం దేశంలో ఏం జరుగుతోందో, లేదో తెలిసిపోతుంది. మోదీ ఏం చేస్తున్నాడో అంతా మీకు తెలుసు. నేను శ్రమపడటంలో ఏమాత్రం వెనకడుగు వేయను. దేశప్రజలు నాకిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రతి క్షణం, శరీరంలో ప్రతి కణం నూటికి నూరుశాతం పనిచేస్తాను. ఇప్పుడు 16 నెలల తర్వాత నాకు మీ సర్టిఫికెట్ కావాలి. నా ప్రమాణం నేను నిలబెట్టుకున్నానా లేదా? శ్రమ పడుతున్నానా లేదా? దేశం కోసం చేస్తున్నానా? మీరు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నానా లేదా? మన దేశంలో రాజకీయ నాయకుల మీద కొద్ది కాలానికే ఆరోపణలు వస్తాయి. ఆయన 50 కోట్లు, ఈయన 100 కోట్లు తీసుకున్నాడని అంటారు. కొడుకు 150 కోట్లు, కూతురు 500 కోట్లు, అల్లుడు వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని అంటారు. సవతి తమ్ముడు కాంట్రాక్టులు, ఇంకొకళ్లు ఇంకోటి తీసుకున్నారని విని విని మీ చెవులు దిబ్బళ్లు పడిపోయాయా, అవినీతి మీద మీకు చికాకు పుట్టిందా లేదా.. నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నా మీద ఏమైనా ఆరోపణలున్నాయా? నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. జీవించినా దేశం కోసమే.. మరణించినా దేశం కోసమే.. మన దేశం శక్తి, సామర్థ్యాలతో నిలబడింది. ఇంత ఆత్మవిశ్వాసం మీకు ఎక్కడినుంచి వచ్చింది అడుగుతారు. మీ దేశం ముందుకెళ్తుందని ఎలా తెలుసని అంటారు. నాకు మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది. నమ్మకం ఎందుకంటే, నా దేశం యువదేశం. ఏదైనా దేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవాళ్లయితే ఆ దేశం ఏం చేయలేదు? 800 మిలియన్ల యువత ఉన్నప్పుడు 1600 భుజాలు కలిస్తే.. ఏం చేయలేవు? ఇక ఈ దేశం వెనకబడి ఉండలేద'ని పేర్కొన్నారు. ఇంకా.. ''ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు మనం ఎదిగాం. భారతదేశం మార్స్ మిషన్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఈ ఘనత ఒక్క భారతదేశానిదే. మన జాతి శక్తి సామర్థ్యాలేంటో చూడండి. ప్రపంచ బ్యాంకు కానివ్వండి, మూడీస్ కానివ్వండి, మరే ఇతర సంస్థయినా కూడా భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెబుతున్నాయి. ఈ-గవర్నెన్స్ అంటే ఈజీ, ఎఫెక్టివ్ అండ్ ఎకనమికల్ గవర్నెన్స్. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి కొత్త శక్తిని ఇచ్చింది. మేం కూడా దానికి తగ్గట్లే డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం'' అని చెప్పారు. -
ఆన్ లైనా.. ఆఫ్ లైనా?
శాన్ జోసె: సాంకేతికత అంటే తన దృష్టితో సాధికారత అని... ఇది ఆశకు, అవకాశానికి మధ్య వారధిలా పనిచేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీతో అభివృద్ధి సాధ్యమని ఆయన పునురుద్ఘాటించారు. కాలిఫోర్నియాలో శాన్ జోసెలో 'డిజిటల్ ఇండియా'లో భాగంగా ఐటీ దిగ్గజ సంస్థల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడ్డారు. ఐటీతో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. మీరు నిద్రపోతున్నారా, మెలకువగా ఉన్నారా అనేది పోయి ఆన్ లైన్ లో ఉన్నారా, ఆఫ్ లైన్ లో ఉన్నారా అనే ట్రెండ్ వచ్చిందని చమత్కరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... * ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. * మేము అధికారంలోకి రాగానే పేదరికాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీ సాయంతో యుద్ధం చేస్తున్నాం * సోషల్ మీడియాతో సామాజిక ప్రతిబంధకాలు తగ్గాయి * ట్విటర్ ప్రతి ఒక్కరినీ రిపోర్టర్ గా మార్చేసింది * ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ మనకు ఇప్పుడు కొత్త మిత్రులు * గూగుల్, ట్విటర్ ప్రపంచాన్ని మార్చేశాయి * గూగుల్ సహకారంతో భారత్ లో 500 రైల్వే స్టేషన్లలో వై-ఫై సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం * పాఠశాలలు, కాలేజీలు బ్రాడ్ బ్యాండ్ తో అనుసంధానిస్తాం * 125 కోట్ల మందిని డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించాలని భావిస్తున్నాం * అందరికీ డిజిటల్ లిటరసీ అవసరం * ఐటీతో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం * నా మొబైల్ యాప్ MyGov.inతో ప్రజలకు దగ్గరగా ఉన్నా * టెక్నాలజీతో ప్రజలకు పరిపాలన చేరువ చేస్తాం * స్థానిక భాషల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి * ఐటీ దిగ్గజ కంపెనీలు డిజిటల్ ఇండియాలో భాగస్వాములు కావాలి -
ఇంట్లో అలిగి.. విమానం టైర్లో దాగి!
కాలిఫోర్నియాలో 16 ఏళ్ల బాలుడు ఇంట్లో గొడవపడ్డాడు. కోపంతో ఇంటి నుంచి బయటపడ్డాడు. సాన్‌జోస్ విమానాశ్రయం గోడ దూకేసి... హవాయి ఎయిర్‌లైన్స్ విమానం దగ్గరకు చేరుకున్నాడు. అందరి కళ్లుగప్పి విమానం టైర్ తొర్రలో దాక్కున్నాడు. విమానం గాల్లోకి ఎగిరింది... 38 వేల అడుగుల ఎత్తుకు చేరింది. ఎముకలు కొరికే చలి... ఆక్సిజన్ అతి తక్కువగా ఉండే అంత ఎత్తున దాదాపు 5 గంటలు ప్రయాణం చేసిందా విమానం! చివరకు హవాయిలో ల్యాండ్ అయింది. ఆశ్చర్యకరంగా... ఆ యువకుడు కూడా కిందకు దిగాడు. కానీ, ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కాడు.