'ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ ఫ్లైట్'
శాన్ హోసె: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు ఢిల్లీకి నుంచి నేరుగా ఎయిరిండియా విమానం ప్రారంభిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసెలో ఎస్ఏపీ సెంటర్ లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి వారానికి మూడుసార్లు ఈ విమానం నడుపుతామని తెలిపారు.
భారత్ లో అవినీతిని అంతం చేయడానికి జామ్(జేఏఎం) ప్రారంభించినట్టు తెలిపారు. జనధన్ యోజన బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో మొబైల్ గవర్నెన్స్ తో అనుసంధానించడమే 'జామ్' అని వివరించారు. ఉగ్రవాదం, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి ప్రధాన సవాలు మారిన సమస్యలని మోదీ అన్నారు. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అనేది ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్వచించడానికి ఐక్యరాజ్యసమితి 15 ఏళ్లు తీసుకుంటే, దానిపై పోరాటానికి ఇంకెంత సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు.