Sanitation problem
-
విరివిగా వాడితేనే మెరుగైన ర్యాంకు
‘స్వచ్ఛ సర్వేక్షణ్’కు సమీపిస్తున్న గడువు నగరవాసులు ముందుకు రావాలని మేయర్, కమిషనర్ విజ్ఞప్తి వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరంలో పారిశుద్ధ్య స మస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛత’ యాప్‌ను ప్రజలు విరివిగా ఉపయోగించాలని గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ శ్రుతి ఓజా ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సెల్ఫోన్లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా నగరంలో చెత్తాచెదారం, అపరిశుభ్రత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సత్వరమే పరిష్కారమవుతాయని తెలిపారు. రెండు రోజులే గడువు ఈనెల 4వ తేదీలోగా స్వచ్ఛత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని మేయర్, కమిషనర్ కోరారు. ఈ రెండు రోజుల్లో యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ సంఖ్యలో సమస్యలను తెలియజేయడం ద్వారా దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ లో వరంగల్ నగరం ర్యాంకు మెరుగవడంతో పాటు నగరంలో పరిశుభ్రత సాధ్యమవుతుందని తెలిపారు. నగరంలోని యువత ‘స్వచ్ఛత’ అప్లికేషన్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. కోరారు. -
మంచం పట్టిన బర్నిక వలస
ఏ ఇంట చూసినా జ్వరపీడితులే కనీసం పట్టించుకోని వైద్యసిబ్బంది సంచివైద్యులనే ఆశ్రయిస్తున్న వైనం సాలూరు:మండలంలో నార్లవలస పంచాయతీ బర్నికవలస గ్రామం జ్వరాలతో మంచం పట్టింది. గ్రామంలోని చోడిపల్లి శాంతమ్మ, జన్ని ప్రమీల, నందేల సోమయ్య తదితర సుమారు 10 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో ఇంతమంది జ్వరపీడితులున్నా... ఉన్న స్థానిక వైద్యులు ఎవ్వరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంటి వద్దనే సంచి వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూ... మంచాలకే పరిమితమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ తదితర ఏ పనలూ చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామానికి ఇటీవల వేసిన గ్రావెల్ రోడ్డు కూడా అస్తవ్యస్థంగా ఉంది. గ్రామంలో ఆవులు, మేకలు అధికంగా ఉండడంతో దోమలు విజంభిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని వారు కోరుతున్నారు. పెద్దవలస గ్రామంలో కూడా పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. -
మంచమెక్కిన చింతలవలస
ప్రతి ఇంటిలో ఒకరు, ఇద్దరు జ్వర పీడితులే అపారిశుద్ధ్యం, నీటికలుషితమే కారణమంటున్న గ్రామస్తులు వైద్యసేవలందుతున్నా... కానరాని తగ్గుముఖం మెంటాడ: ఆ పల్లెలో అంతా జ్వరపీడితులే... ప్రతి ఇంటా బాధితులున్నారు. కొన్నిళ్లల్లో ఇద్దరేసీ ఉన్నారు. పల్లెలో అపారిశుద్ధ్యం తాండవిస్తుండటం... కలుషిత తాగునీటిని సేవించడం... స్థానికంగా కనీసం అవగాహన లేకపోవడం... వెరశి ఈ జ్వరాలకు కారణమని తెలుస్తోంది. వైద్యసేవలందిస్తున్నా... అక్కడ పరిస్థితి అంతగా కుదుటపడటం లేదంటే... స్థానికుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇదీ చింతలవలస దుస్థితి. మండలంలోని చింతలవలస గ్రామానికి జ్వరం వచ్చింది. ఇంటికి ఒకరో, ఇద్దరో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. గ్రామంలో వాడుక నీరు, వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం, పలువురు గ్రామస్తులు చెత్తా, చెదారాన్ని బహిరంగ ప్రదేశాల్లో వేయడం, గ్రామంలో ఉన్న బావి, మంచినీటి కుళాయి వద్ద బట్టలు ఉతకడం, అదే నీటిని గ్రామస్తులు తాగడం వల్ల జ్వరాలు వస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా కొందరు మహిళలు కుళాయి వద్ద బట్టలుతకడం, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం జ్వరాలకు కారణమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాలుగోవంతు జ్వరాలే... గ్రామ జనాభా 535 కాగా ఇందులో నాలుగో వంతు గ్రామంలో జ్వరాలతో ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నింటి సింహాచలం, బగ్గాం లక్ష్మి, బగ్గాం రత్నం, బొద్దల ఈశ్వరరావు, పిన్నింటి రామూర్తి, బవిరెడ్ది ప్రశాంత్, పిన్నింటి అప్పలనాయుడు, పిన్నింటి ఎల్లమ్మ, కలిశెట్టి సూర్యనారాయణ, బవిరెడ్డి కష్ణ, రౌతు సతీష్, బొద్దల హర్షిత, మహంతి కమలమ్మ, మహంతి దీపిక, మహంతి తిరుపతమ్మ, మహంతి సత్యం, పిన్నింటి అప్పలనాయుడు, పిన్నింటి వరుణ్ సందీప్, పిన్నింటి అశ్రితతో పలువురు గ్రామస్తులు జ్వరాలతో బాదపడు తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మరికొంత మంది జ్వరపీడితులు గజపతినగరం, విజయనగరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తలనొప్పి, కాళ్లు చేతులు పీకులతో బాధ పడుతున్నట్లు రోగులు తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
డయేరియా పంజా
పల్లెల్లో విస్తతంగా పెరుగుతున్న రోగులు డయేరియాతో కేంద్రాస్పత్రిలో ఒకరి కన్నుమూత పడకలు చాలక వరండాలోనే రోగులకు చికిత్స అధ్వానంగా గ్రామీణ పారిశుద్ధ్యం విజయనగరం ఫోర్ట్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రత్యేకంగా నిధులు విడుదల కాక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యాధుల విస్తతికి కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలానూ నిధులు విడుదల చేయకపోగా... కేంద్రం విడుదల చేస్తున్ను నిధులను సైతం పక్కదారి పట్టిస్తుండటంతో మారుమూల ప్రాంతాల్లో అపారిశుద్ధ్యం కారణంగా వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డయేరియా కారణంగా పలువురు కన్నుమూయడం మరువకముందే మరోవ్యక్తి కేంద్రాస్పత్రిలో మరణించాడు. 12 మందికి పైగా రోగులు గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో 12 మందికి పైగా రోగులు డయేరియా బారిన పడ్డారు. వీరిలో 10 మంది కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరి కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అపారిశుద్ధ్యం, కలుషత నీరు వల్లే వ్యాధి వ్యాప్తి చెందినట్టు తెలిసింది. ఈ ఒక్కచోటే కాదు... పూసపాటిరేగ మండలం పేరాపురం, పూసపాటిరేగ, బొండపల్లి మండలం వేండ్రం, గుర్ల మండలం గుజ్జింగ వలస, జామి మండలం శాసనపల్లి ప్రాంతాలకు చెందిన డయేరియా రోగులు సైతం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రోగులు వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుతోంది. పారిశుద్ధ్య నిధులు పక్కదారి పల్లెలకు నేరుగా 13, 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాటితో పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, నీటిపథకాల్లో క్లోరినేషన్, కాలువల నిర్మాణం ఇతర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వట్లేదు సరికదా... కేంద్రం ప్రభుత్వం అందించిన నిధులు సైతం వేరే పనులకు మళ్లిస్తుండటంతో పల్లెలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఫలితంగా ఎంతోమంది మత్యువాతపడుతున్నారు. తీరా ఎవరైనా చనిపోయాకే పాలకులు హడావుడి చేస్తున్నారు. వైద్యాధికారులను అక్కడకు పంపించడం... అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించడం చేస్తున్నారు. నేరుగా ముందస్తుగానే పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు నిధులు విడుదలైతే ఈ పరిస్థితి తలెత్తేది కాదుకదా అన్నదే ప్రశ్న. పీహెచ్‌సీల్లో మందుల కొరత పల్లెవాసులకు అందుబాటులో ఉంటున్న పీహెచ్‌సీల్లో మందులు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమయింది. దీంతో పల్లెలనుంచి సైతం రోగులు అంతా విజయనగరంలోని కేంద్రాస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా రోజుకు 30 నుంచి 40 మంది వరకు రోగులు ఇక్కడకు వస్తున్నారు. వీరిలో 15 నుంచి 20 మంది వరకు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. ఇక్కడ కూడా పడకలు చాలక వరండాలోని బల్లలపై చికిత్సఅందిస్తున్నారు. డయేరియా వార్డుతో పాటు, సర్జికల్ వార్డులో కొంతభాగాన్ని డయేరియా రోగులకోసం వినియోగిస్తున్నారు. అయినప్పటికీ పడకలు సరిపోవట్లేదు. పీహెచ్‌సీల్లోనే సౌకర్యాలు కల్పిస్తే జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. డయేరియాతో ఒకరి మతి డయేరియా వ్యాధితో బాధ్యపడుతున్న ఓ వ్యక్తి కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మతిచెందాడు. పట్టణంలోని అలకాల గెడ్డకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు అవ్వడంతో కేంద్రాస్పత్రికి 5:30 గంటల ప్రాంతంలో తీసుకు వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ 10 గంటల సమయంలో మతిచెందాడు. దీంతో మిగిలిన రోగుల్లో ఆందోళన మొదలైంది. ఆస్పత్రిలో చేరిన 3నుంచి 4రోజుల వరకు వ్యాధి నయం కాకపోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం: డాక్టర్ ఎం. శారద, డీఎంహెచ్ఓ డయేరియా, జ్వరాల వ్యాప్తి ఉన్నందున వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించాం. డయేరియా గాని జ్వరాలు గాని ప్రబలాయని తెలిసిన వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. -
మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
శ్రీరాంపూర్ : తాళ్లపల్లి గ్రామ చెరువులో సింగరేణి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ పనులను బుధవారం ఓసీపీ పీవో కవీంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐత శంకర్ మాట్లాడుతూ సింగరేణి కూడా మిషన్ కాకతీయ పనుల్లో భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సింగపూర్ సర్పంచ్ రాజేంద్రపాణి, గ్రామ కార్యదర్శి సప్ధర్ అలీ, ఎంపీటీసీ సభ్యుడు బండారి సుధాకర్, వార్డు సభ్యులు తిరుమల్ పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్.. ఇదిలా ఉంటే అనంతరం వాటర్ ట్యాంక్ ఏరియాలోక్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. వచ్చేది వర్షాకాలం అయినందుకు పారిశుధ్య సమస్య ఉత్పన్నం కాకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ప్రవీణ పాల్గొన్నారు.