
మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
శ్రీరాంపూర్ : తాళ్లపల్లి గ్రామ చెరువులో సింగరేణి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ పనులను బుధవారం ఓసీపీ పీవో కవీంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐత శంకర్ మాట్లాడుతూ సింగరేణి కూడా మిషన్ కాకతీయ పనుల్లో భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సింగపూర్ సర్పంచ్ రాజేంద్రపాణి, గ్రామ కార్యదర్శి సప్ధర్ అలీ, ఎంపీటీసీ సభ్యుడు బండారి సుధాకర్, వార్డు సభ్యులు తిరుమల్ పాల్గొన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్..
ఇదిలా ఉంటే అనంతరం వాటర్ ట్యాంక్ ఏరియాలోక్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. వచ్చేది వర్షాకాలం అయినందుకు పారిశుధ్య సమస్య ఉత్పన్నం కాకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ప్రవీణ పాల్గొన్నారు.