విరివిగా వాడితేనే మెరుగైన ర్యాంకు | "Sarveksan freedom 'to the closing deadline | Sakshi
Sakshi News home page

విరివిగా వాడితేనే మెరుగైన ర్యాంకు

Published Mon, Jan 2 2017 10:51 PM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

"Sarveksan freedom 'to the closing deadline

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’కు సమీపిస్తున్న గడువు
నగరవాసులు ముందుకు రావాలని   మేయర్, కమిషనర్‌ విజ్ఞప్తి


వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహా నగరంలో పారిశుద్ధ్య స మస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛత’ యాప్‌ను ప్రజలు విరివిగా ఉపయోగించాలని గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, కమిషనర్‌ శ్రుతి ఓజా ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవడం ద్వారా నగరంలో చెత్తాచెదారం, అపరిశుభ్రత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సత్వరమే పరిష్కారమవుతాయని తెలిపారు.

రెండు రోజులే గడువు
ఈనెల 4వ తేదీలోగా స్వచ్ఛత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మేయర్, కమిషనర్‌ కోరారు. ఈ రెండు రోజుల్లో యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎక్కువ సంఖ్యలో సమస్యలను తెలియజేయడం ద్వారా దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ లో వరంగల్‌ నగరం ర్యాంకు మెరుగవడంతో పాటు నగరంలో పరిశుభ్రత సాధ్యమవుతుందని తెలిపారు. నగరంలోని యువత ‘స్వచ్ఛత’ అప్లికేషన్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement