హోదా సంజీవనేమి కాదు
– టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవనేమి కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. శ్రీశైలం నియోజవర్గంలోని కేసీ కెనాల్, వెలుగోడు రిజర్వాయర్, తెలుగుగంగ ప్రాజెక్టుల కింద రెండో పంటను సాగునీరు ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి వై.నాగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు.