sankranthi kanuka
-
తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం వైఎస్ జగన్
-
రావమ్మా పౌష్యలక్ష్మి ఇవ్వమ్మా.. సిరులు కొలిచి
సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించడానికే ఉత్తరాయణమని పేరు. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన అయ్యప్ప స్వామి భక్తులు స్వామి వారిని మకర జ్యోతిరూపంలో దర్శనం చేసుకుంటారు. పెద్ద పండుగ అని ఎందుకంటారు? సంక్రాంతిని పెద్ద పండుగ అనటానికి మరో కారణమేమిటంటే తొలిపంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలోనే కాబట్టి ఈ పండుగను పౌష్యలక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. రైతులు తమకు సంవత్సరమంతా సేవలు అందించిన వివిధ వృత్తిదారులకు సంక్రాంతినాడు ఏడాదికి సరిపడా ధాన్యం కొలిచి ఇస్తుంటారు పల్లెటూళ్లలో. విష్ణుపూజతో విశేషమైన పుణ్యం సంక్రాంతి రోజు స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన ఉండలను భుజించడం, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. సంక్రాంతి దానాలు దివ్యఫలాలు సంక్రాంతి నాడు పితృ దేవతలకు, అర్హులకు ఏమి దానం చేస్తామో అవి ముందుజన్మలలో కూడా మనకు ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు ఎవరి ఇంటా ‘లేదు’అనే మాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ కాలంలో ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చేయటం ఉత్తమం. వీటిని దానం చేసేంత శక్తి లేనివారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో కూష్మాండం అంటే గుమ్మడి పండును దానం చేస్తే మంచిదని ప్రతీతి. ముత్తయిదువలు మంగళకరమైన ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, అద్దం, దువ్వెన, బొట్టుపెట్టె, రవికల గుడ్డ వంటివి వాయనమివ్వాలి. చిన్నవాళ్లందరూ పెద్దలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకోవాలి. పతంగుల పండగ సంక్రాంతిని తెలంగాణలో పతంగుల పండగగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలందరూ ఉల్లాసోత్సాహాలతో పతంగులు ఎగుర వేస్తారు. దీని వల్ల జీవితాన్ని సమతౌల్యంలో ఉంచడం చేతనవుతుందని నమ్ముతారు. పౌరాణిక పరంగా చూస్తే సంక్రాంతితో తదేవతలకు పగటికాలం ప్రారంభమవుతుంది కాబట్టి వారి దృష్టిని ఆకర్షించేందుకు పతంగులు ఎగరవేస్తారని చెబుతారు. పశువులను పూజించే కనుమ సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. అందుకనే గారెలు, మాంసంతో పెద్దలకి పెట్టుకుంటారు. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములే కాబట్టి మినప గారెలు చేసుకుంటారు. అందుకే ‘కనుమ రోజు మినుము...’ అనే సామెత మొదలైంది. మినుములు చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదా? కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించ మని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ... ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. సంక్రాంతిని తమిళనాడులో కూడా బాగా జరుపుకుంటారు. వారు దీనిని పొంగల్‌గా జరుపుకుంటే పంజాబ్‌లో లోహిరిగానూ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఉత్తరాయన్గానూ జరుపుకుంటారు. – డి.వి.ఆర్. భాస్కర్ ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
అన్నదాతలకు సంక్రాంతి కానుక
-
ఇదేమి అలక్ష్యం !
పశ్చిమగోదావరి, కొవ్వూరు: ప్రచారార్భాటానికి పెద్దపీట వేస్తున్న టీడీపీ సర్కారు.. సంక్రాంతి కానుకల పంపిణీపై శ్రద్ధ చూప లేదు. ఫలితంగా పండగొచ్చినా జిల్లాలో నేటికీ 1,27,997 మందికి కానుకలు అందలేదు. చౌక దుకాణాలకు అందించిన ఆరు రకాల సరుకుల్లో తూకం వ్యత్యాసాల వల్ల కొన్ని రకాల ప్యాకెట్లు తగ్గాయి. దీంతో సుమారు పది శాతం మంది లబ్ధిదారులు కానుకలు పొందే అవకాశం కోల్పోయారు. 90 శాతంలోపే పంపిణీ జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 12,39,698 ఉన్నాయి. వీటిలో ఇంత వరకు 11,11,701 మందికి మాత్రమే కానుకలు అందాయి. అంటే జిల్లాలో 89.68 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. దాదాపు అన్నీమండలాల్లోనూ 86 నుంచి 90శాతం లోపు మాత్రమే పంపిణీ పూర్తయింది. కేవలం పదహారు మండలాల్లోనే 90 శాతం పంపిణీ పూర్తయింది. ఉండ్రాజవరం మండలంలో గరిష్టంగా 93.09 కొయ్యలగూడెంలో 92.55 శాతం పంపిణీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 88.26 శాతం పూర్తయినట్టు సమాచారం. మిగిలిన వాళ్లకు పండగ రోజుకైనా కానుకలు అందుతాయా అంటే అనుమానమే. ప్యాకెట్ల రూపంలో రావడం వల్లే..! నేడు భోగి పండగ. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సోమ, మంగళ, బుధ వారాలు పండగ రోజులు కావడంతో మిగిలిన వారికి రానున్న రెండు, మూడు రోజుల్లో కానుకలు అందడం గగనమే అని చెప్పవచ్చు. పౌర సరఫరాల గోదాముల నుంచి రేషన్ డీలర్లకు అందించిన ఆరు రకాల సరుకుల్లో కొన్ని ప్యాకెట్లు తక్కువగా వచ్చాయి. ప్రతి సరుకునూ విడివిడిగా యాభై కిలోల బస్తాల్లో ప్యాకెట్ల రూపంలో పంపించడంతో తూకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. దీంతో ఒక్కో రేషన్ దుకాణంలో ప్రతి సరుకు ప్యాకెట్లు సుమారు పది వరకు తక్కువయ్యాయి. ఈ లెక్కన ప్రతి చౌకదుకాణం పరిధిలో యాభై నుంచి అరవై మంది వరకు కానుకలు పొందే అవకాశం కోల్పోతున్నారు. అధికారులు ఉన్న సరుకులు హెచ్చుతగ్గులున్న చోట సర్దుబాటు చేసినా జిల్లా వ్యాప్తంగా లక్ష మందికిపైగా కార్డుదారులకు కానుకలు అందడం కష్టమే. తలలు పట్టుకుంటున్న డీలర్లు ఒక్కో బస్తాలో ఐదారు ప్యాకెట్లు తక్కువగా రావడంతో డీలర్లు పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్డుదారులు డీలర్లతో వాగ్వివాదాలకు దిగుతున్నారు. గోధుమ పిండి, బెల్లం, శెనగ పప్పు ప్యాకెట్లు నిర్దేశించిన తూకం కంటే ఎక్కువ రావడంతో బస్తాల్లో ప్యాకెట్లు సంఖ్య తగ్గింది. గోదాముల నుంచి డీలర్లు సరుకు తీసుకునే సమయంలో నికర తూకం సరిపోవడంతో వాటిని తెచ్చుకున్నారు. తీరా పంపిణీకి వచ్చేసరికి ప్యాకెట్లు తగ్గిన విషయం గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు గోధుమ పిండి 60 నుంచి 120 గ్రాము లు వరకు ఎక్కువగా వస్తుందని డీలర్లు చెబుతున్నారు. బెల్లం, కంది పప్పు, శెనగపప్పులదీ అదే పరిస్థితి. ప్రతి బస్తాకి ఐదారు ప్యాకెట్లు తక్కువ వచ్చాయి. నెయ్యి ప్యాకెట్లు చిరిగిపోవడం వల్ల తక్కువ వచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. ఇలా ప్రతి చౌక దుకాణంలో అన్ని సరుకులూ కలిపి యాభై, ఆరవై వరకు ప్యాకెట్లు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కొందరు డీలర్లు ప్రారంభంలోనే గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. బెల్లం నాసిరకం.. సంచుల్లేవు బెల్లం నాసిరకంగా ఉండడంతో అధికారులు మళ్లీ ఆ స్టాకును వెనక్కి పంపించారు. కొందరు డీలర్లు కానుకలు అందజేసే సంచులు సైతం తక్కువగా అందాయని చెబుతున్నారు. అయితే తగ్గిన సరుకులు మళ్లీ వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. సమ్మె, పోర్టబిలిటీ వల్ల కొంత ప్రభావం గత నెలలో డీలర్ల సమ్మెతోపాటు డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ తాత్కాలికంగా పొర్టబులిటీ సదుపాయం తొలగించడం సంక్రాంతి కానుకల పంపిణీ జాప్యానికి కారణంగా చెబుతున్నారు. దీనివల్ల సంక్రాంతి కానుకల పంపిణీ అస్తవ్యస్తమైంది. జిల్లా వాప్యంగా 1,63,582 మంది పోర్టబిలిటీ సదుపాయం వినియోగించుకోగలిగారు. ప్యాకెట్లు తక్కువ వచ్చిన విషయం తెలియదుసంక్రాంతి కానుకలు పంపిణీలోజిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. సరుకుల ప్యాకెట్లు తక్కువగా అందిన విషయం నా దృష్టికి రాలేదు. మండల స్ధాయి అధికారులెవరూ ఈ సమస్యచెప్పలేదు. ఏవైనా సరుకులు తేడాలుఉంటే పౌర సరఫరాల గిడ్డంగి నుంచి మళ్లీ పొందవచ్చు. కొన్నిచోట్ల నాసిరకంగాబెల్లం ఉందని చెబితే మార్పించాం. – జి.మోహన్‌బాబు,జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
'అక్రమాలు జరిగితే సహించవద్దు'
విజయవాడ: సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరిగితే సహించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం చంద్రబాబు.. 8 వేల మంది అధికారులు, ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి కానుక సరుకుల్లో నాణ్యత లేకుంటే ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని చంద్రబాబు అన్నారు. ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అధికారులకు సూచించారు. -
'ఈ సారి కూడా సంక్రాంతి కానుక'
జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఈసారి కూడా పశువైద్యశిబిరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈసారి కూడా సంక్రాంతి కానుక ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు నిర్వహించాలని, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. శనివారం చంద్రబాబు అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్కూల్ డ్రాప్ అవుట్స్‌పై పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. నర్సరీలను ఏర్పాటు చేయడానికి 15 వేల పాఠశాలలను గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు నిధుల కొరత లేదని, 3నెలల్లో రూ.500 కోట్లు ఖర్చు చేసే వీలుందని, అధికారులు దీన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈనెల 30న కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేదలకు అందుబాటులో అన్నిరకాల వైద్యసేవలు అందించడానికి వీలుగా వైద్య ఆరోగ్య శాఖలో సమూల సంస్కరణలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో జనవరి 1 నుంచి హెల్త్ చెకప్ ఉచిత సేవలు ప్రారంభిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు ఆయనకు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు పంపిణీకి సిద్దంచేసినట్టు చెప్పారు. బ్లడ్ టెస్టు దగ్గర నుంచి అన్ని రకాల టెస్టులను ప్రాథమిక ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఫ్లోరైడ్ సమస్య వున్న 329 ప్రాంతాలలో జనవరి నాటికి మినరల్ వాటర్ సరఫరా చేయాలని సూచించారు. -
కానుక కొందరికే
పేదలకు అరకొరగానే చంద్రన్న ‘కానుక’ పంపిణీ ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం.. ప్రణాళిక లోపంతో అస్తవ్యస్తం కార్డుదారుల్లో 60 శాతం మందికి కూడా అందని సంక్రాంతి సరుకులు పలుచోట్ల మూడు, నాలుగు వస్తువుల పంపిణీతో సరిపెట్టిన వైనం నాణ్యత నాసిరకం.. కరిగిపోయిన బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు చాలా చోట్ల నెయ్యి లేదు.. వస్తువుల తూకం కూడా తగ్గిన ఉదంతాలు సంచులు లేవు.. లబ్ధిదారుల చేతుల్లోనే సరుకులను పెడుతున్న వైనం అందని వారికి పండుగ తర్వాత సరుకులు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పండుగ నాటికి తెల్లకార్డుదారులందరికీ.. ఆరు సరకులు ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు పదేపదే చెప్పినా ఆచరణలో పూర్తిగా అమలు చేయలేకపోయారు. గురువారం సంక్రాంతి పండుగ కాగా.. బుధవారం సాయంత్రానికి తెల్లకార్డుదారుల్లో 60% మందికి కూడా పంపిణీ జరగలేదు. సకాలంలో జిల్లాలకు సరుకులు పంపాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోవడంతో అంతటా గందరగోళం నెలకొంది. చాలా జిల్లాలకు మంగళవారం సాయంత్రం వరకూ సరుకులు తరలిస్తూనే ఉన్నారు. పలు జిల్లాల్లో తెల్లకార్డుల సంఖ్యకు అనుగుణంగా సరుకులు ఇవ్వలేదు. దీంతో అనేక చోట్ల ఆరు సరుకులకు గానూ మూడు, నాలుగు సరుకులే ఇస్తున్నారు. నెయ్యి, కందిపప్పు చాలా మందికి అందడంలేదు. పలుచోట్ల ఇచ్చిన సరుకులు కూడా బాగా నాసిరకంగా ఉన్నాయి. పాకంలా కారుతున్న బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు పంపిణీ చేశా రు. ఏ వస్తువులోనూ కొలత సరిగా లేదని రాష్ట్రమంతా వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్లో 25 గ్రాములు, అర కేజీ కందిపప్పుకు 450 గ్రాములు, కేజీ శనగలకు 850 గ్రాములు, అర లీటరు నూనెకు 400 గ్రాములు ఇలా ప్రతి వస్తువులోనూ తూకం తక్కువే ఉంది. ఈ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇస్తానన్న సంచులు రాష్ట్ర వ్యాప్తంగా 30% కూడా ఇవ్వలేదు. దీంతో పలుచోట్ల కార్డుదారుల చేతుల్లోనే వస్తువులను పెడుతుండగా, కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగుల్లో వాటిని ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ సరైన ప్రణాళికతో అమలు చేయనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులకు నెలవారీ సరుకులతో పాటు సంక్రాంతి కానుక అందలేదు. * విశాఖ జిల్లాలో 98 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు చెప్తున్నా ఇంకా చాలా గ్రామాల్లో సరుకులు అందలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ 60 శాతం జరిగినా ఎక్కువ మందికి మూడు, నాలుగు సరకులే అందాయి. * తూర్పుగోదావరి జిల్లాలో 15.19 లక్షల తెల్లకార్డుదారులకు సరకులు ఇవ్వాల్సివుండగా 75 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ లక్షన్నర మందికి నెయ్యి ప్యాకెట్లు అందలేదు. గోధుమపిండి, కందిపప్పు సగం మంది కార్డుదారులకు మాత్రమే వచ్చాయి. * పశ్చిమగోదావరి జిల్లాలో 11.27 లక్షల మందికి సరకులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పంపిణీ చేశారు. బుధవారం కూడా చాలా చోట్ల సరకులను డీలర్లకు అందివ్వలేకపోయారు. * కృష్ణా జిల్లాలో పంపిణీ దాదాపు పూర్తయినా తూకాల్లో తేడాలు రావడం, నాసిరకం వస్తువులు ఇవ్వడంతో కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని డీలర్ పాయింట్లకు స్టాకు అందలేదు. * ప్రకాశం జిల్లాలో మొత్తం 8.32 లక్షల మంది కార్డుదారులుండగా సగం మందికి ఇంకా సరకులను పంపిణీ చేయలేకపోయినా అధికారులు మాత్రం 95 శాతం పంపిణీ పూర్తయినట్లు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో బెల్లం కేజీ చొప్పున బ్లాకులు ఇవ్వడంతో వాటిని పగలగొట్టి సమానంగా ఇవ్వాల్సి రావడం డీలర్లకు తలనొప్పిగా మారింది. * నెల్లూరు జిల్లాలో 8.24 లక్షల మందికి చంద్రన్న కానుక ఇవ్వాల్సి ఉండగా 2.50 లక్షల మందికే సరకులు వచ్చాయి. * కర్నూలు జిల్లాలో మొత్తం 10.36 లక్షల కార్డులుండగా సుమారు 2 లక్షల మంది కార్డుదారులకు సంక్రాంతి కానుక అందలేదు. * అనంతపురం జిల్లాలో మండల స్టాకు పాయింట్ల నుంచి డీలర్లకు సకాలంలో సరకులు చేరలేదు. * సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 9.84 లక్షల తెల్లకార్డుదారులు ఉండగా 80 శాతం మందికే సరకులు వచ్చాయి. ఇప్పటివరకూ 60 శాతం మందికే సరకులు అందాయి. కడప జిల్లాలో పంపిణీ 70 శాతం వరకూ పూర్తయినా చాలా చోట్ల డీలర్లు కార్డుదారుల నుంచి రూ. 20 చొప్పున వసూలు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి.