విజయవాడ: సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరిగితే సహించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం చంద్రబాబు.. 8 వేల మంది అధికారులు, ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సంక్రాంతి కానుక సరుకుల్లో నాణ్యత లేకుంటే ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని చంద్రబాబు అన్నారు. ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అధికారులకు సూచించారు.
'అక్రమాలు జరిగితే సహించవద్దు'
Published Sat, Jan 9 2016 9:18 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement