కందిపప్పులోనూ కక్కుర్తే
హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు 'సంక్రాంతి కానుక' కోసం ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సరుకుల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ చోటు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కందిపప్పు కొనుగోలు విషయంలో మిల్లర్లలంతా టెండర్లు రింగ్ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో కేజీ కందిపప్పు రూ. 84 చొప్పున దాదాపు 65 లక్షల కేజీల కందిపప్పు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇదే రకం కందిపప్పును తెలంగాణలో కిలో రూ. 66ల చొప్పున కేసీఆర్ సర్కార్ కొనుగోలు చేస్తుంది.
దాంతో దాదాపు రూ. 7 కోట్ల మేర చేతులు మారనున్నాయి. అసలు మార్కెట్ ధరను మించి సరకు కొనుగోలు చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్రీయ భండార్ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. కందిపప్పు కొనుగోలు కోసం బాలాజీ గ్రౌండ్ నట్ మిల్లుతో సంయుక్త టెండర్ వేసింది. అలాగే విజయనగరం జిల్లా చీపురపల్లికి చెందిన ఓ మిల్లు ద్వారా సరఫరాకు పథకాన్ని రూపొందించినట్లు సమాచారం. సంక్రాంతి కానుక పేరిట మిగతా సరకుల విషయంలోనూ ప్రభుత్వం ఇదే తీరుపై విమర్శలు వస్తున్నాయి.