santakumari
-
'మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు'
-
'మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు'
నగరి: ప్రతిసారి వైఎస్సార్ సీపీ శ్రేణులను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు బనాయించడాన్నినగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, ఆ పార్టీ మహిళా నాయకురాలు శాంతా కుమారి తీవ్రంగా తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులుపైనే కాకుండా, స్థానికంగా ఉన్న తమ బంధువులపై కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమపై నాన్ బెయిల్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం రాజకీయ కుట్ర కాదా?అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ తమను వేధింపులు గురి చేస్తున్నారన్నారు. శనివారం అర్ధారాత్రి శాంతాకుమారి ఇంటి గేటుకు వేసి ఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు. *ప్రతిసారి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. *అక్రమంగా నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తున్నారు. *నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో నా ఇంటికి వచ్చి గేటు పగులగొట్టారు *దుర్బషలాడారు, బూతులు మాట్లాడారు *మమ్మల్మి అరెస్ట్ చేస్తే కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంటానని నా పెద్ద కోడలు హెచ్చరించింది *పనిచేయని శాడిస్ట్ కమిషనర్ ను పెట్టి ముద్దు కృష్ణమనాయుడు వేధిస్తున్నాడు 'రాజకీయ కుట్రతో మాపై కేసులు పెట్టారు 'మేమైనా టెర్రలిస్టులమా? -
రేపటి నుంచి బీబీఎంపీలో ‘ఆన్లైన్ పేమెంట్’ సేవలు
బీబీఎంపీ ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లు ఇవే.. facebookaccountuser name : worshipful mayor-bbmp twitter account user name : mayor bangalore బీబీఎంపీ మేయర్ ఎన్ శాంతకుమారి బనశంకరి : బీబీఎంపీలో ఆన్లైన్ ద్వారా చెల్లింపుల విధానాన్ని (ఆన్లైన్ పేమెంట్) బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు మేయర్ ఎన్ శాంతకుమారి తెలిపారు. సోమవారమిక్కడి బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 నుంచి బీబీఎంపీలో ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణా బాధ్యతలను నిర్వర్తించేందుకు గాను నిపుణుల సమితి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమితి రెండు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం బీబీఎంపీ అనేక పథకాలు అమల్లోకి తెస్తోందని, అందులో భాగంగానే పాలికేలోని అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి మేయర్ పేరుతో ట్విట్టర్, పేస్బుక్ అకౌంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు, సూచనలు,సలహాలనైనా సరే ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పంపించవచ్చునని ఆమె తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బీబీఎంపీ సిద్ధంగా ఉందన్నారు. జనవరి మొదటివారంలో జలమండలి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. బీబీఎంపీ వ్యాప్తిలో తాగునీటి సమస్య ఉన్న వార్డుల్లో అధికారులు పూర్తి వివరాలతో సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కారిస్తామన్నారు. నూతనంగా రోడ్లు వేసిన వార్డుల్లో రెండేళ్ల పాటు ఓఎప్సీ కేబుల్ ఏర్పాటు చేయబోమని, అలాగే రోడ్లు విస్తరణకు అనుమతి ఇచ్చేదిలేదని అన్నారు. కేబుల్ అమర్చినట్లైతే ఎచ్డీడీ తరహాలో అమర్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీమేయర్ కే.రంగణ్ణ, అధికారపక్షనేత ఎన్ఆర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మేయర్ శాంతకుమారి ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వీటితో పాటు బీబీఎంపీ సహాయ్ అనే హెల్ప్‌లైన్ వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు. కంట్రాక్టర్లు, అధికార పక్షనేత మధ్య మాటల యుద్ధం బీబీఎంపీలో 24 నుంచి ఆన్లైన్ చెల్లింపు విధానంపై కాంట్రాక్టర్లు , అధికార పక్షనేత ఎన్ ఆర్ రమేశ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఒక్కసారిగా విలేకరుల సమావేశంలోకి వెళ్లారు. కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఓ సంఘం ఉందని, పదాధికారులు ఉన్నారని, తమతో చర్చించకుండా, తమకు కావలసిన వారికి బిల్లులు చెల్లించిన తరువాత ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ఎలా ప్రవేశపెడతారా అంటూ కమిషనర్, మేయర్‌పై గొడవకు దిగారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అధికార పక్షనేత ఎన్ఆర్ రమేశ్ ‘ మీరు ఎందుకు లోపలికి వచ్చారు. ముందు బయటకు వెళ్లండి’ అంటూ కాంట్రాక్టర్లుతో అన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లు ఎన్ఆర్ రమేశ్‌ను ఏకవచనంతో కమిషనర్ ఎదురుగా నిందించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. కమిషనర్ ఇరువర్గాల వారిని శాంతపరిచి.. తమ కార్యాలయానికి పిలుచుకెళ్లారు. అక్కడ కూడా కంట్రాక్టర్లు ఒక్కసారిగా ఆన్లైన్ వ్యవస్థను అమలులోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. -
బీబీఎంపీ మేయర్‌గా శాంతకుమారి
డిప్యూటీ మేయర్‌గా రంగన్న సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన శాంత కుమారి, ఉప మేయర్‌గా కే. రంగన్నలు శుక్రవారం ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కే. శాంత కుమారి మూడలపాళ్య, రంగన్న కామాక్షిపాళ్య వార్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీబీఎంపీ కెంపేగౌడ ఆడిటోరియంలో ఈ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, ఉదయం పదిన్నర గంటలకు శాంత కుమారి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ సీనియర్ సభ్యులు ఎస్కే. నటరాజ్, బీ. సోమశేఖర్లు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఎమ్మెల్యే అశ్వత్థ నారాయణ బలపరిచారు. రంగన్న అభ్యర్థిత్వాన్ని సీకే. రామమూర్తి, సుగుణా బాలకృష్ణ ప్రతిపాదించగా, హెచ్. సురేశ్, సరస్వతమ్మ బలపరిచారు. ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, మరెవరూ సమర్పించక పోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మునిసిపల్ శాఖ ప్రాంతీయ కమిషనర్ గౌరవ్ గుప్తా ప్రకటించారు. అనంతరం వారిద్దరినీ పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారు అభినందించారు. కాగా ఈ ఎన్నికల తర్వాత 12 స్థాయీ సంఘాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉండగా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామలింగా రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడ్డాయి. చెత్త సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యతను ఇస్తానని శాంత కుమారి తెలిపారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెత్త తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. చెత్తను సంస్కరించడానికి ఇప్పటికే నాలుగు బయోమెథనైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మరి కొన్ని యూనిట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. బెంగళూరుకు ఉద్యాన నగరి అని ఉన్న పేరును సార్థకం చేయడానికి ప్రతి వార్డులోనూ పార్కులను నిర్మిస్తామని తెలిపారు. బీబీఎంపీ పాఠశాలలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని అండర్‌పాస్‌లు, ఫ్లైవోవర్లు నిర్మిస్తామని ఆమె వెల్లడించారు.