Santosh Yadav
-
ఆరెస్సెస్ చరిత్రలోనే తొలిసారిగా.. ఎవరామె?
నాగ్‌పూర్: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది. అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్ యాదవ్‌ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. ఎవరెస్ట్‌ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్ యాదవ్ పేరిట పదిలంగా ఉండిపోయింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది. -
‘వెల్’డన్.. కుక్కపిల్లను కాపాడారు!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఫోన్ మోగింది. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో ఏమో! ఐదుగురు యువకులు ఆ అర్ధరాత్రే బయలుదేరారు. 200 కి.మీ. ప్రయాణించి ఓ పాడుబడిన బావికి చేరుకున్నారు. అందులోకి తొంగిచూడగా అంతా అంధకారం. దట్టంగా పెరిగిన చెట్లు దడ పుట్టిస్తున్నాయి. అయినా వెరవక అందులోకి దిగారు. బిక్కుబిక్కుమంటున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకున్నారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా పునర్జీవం పోశారు. పురాతన బావిలోకి దిగి... నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ శివారులో నిజాం జమానాలో రాతితో నిర్మించిన ఓ పురాతన వ్యవసాయబావి ఉంది. అందులో 20 రోజుల క్రితం 4 నెలల వయసున్న ఓ కుక్కపిల్ల పడిపోయింది. బాగా లోతుగా ఉన్న ఆ బావిలో చుక్క నీరులేదు. విపరీతంగా చెట్లు మొలిచాయి. అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించడంలేదు. సంతోష్‌యాదవ్ అనే స్థానికుడు ఆ కుక్క పిల్లను గమనించి కొద్దిరోజులుగా పైనుంచి దానికి ఆహారం అందిస్తున్నాడు. భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్ల చనిపోయే స్థితికి చేరడంతో దానిని రక్షించేవారికి కోసం ఇంటర్నెట్లో వివరాలు వెతికాడు. నగరంలోని ‘యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ’వారి ఫోన్ నంబర్ కనుక్కొని సంస్థ ప్రధాన కార్యదర్శి సంజీవ్ వర్మకు శుక్రవారం రాత్రి 11.30కు ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. సంజీవ్ వర్మ వెంటనే సంస్థ సభ్యులైన మెస్సీ, రాఘవ్, ప్రభు, అమర్నాథ్లతో కలసి శనివారం ఉదయం సిరికొండకు వచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా 200 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చి కుక్కపిల్లను కాపాడిన ఆ యువకులను గ్రామస్తులు అభినందించారు. కొద్దిరోజుల క్రితం వరంగల్‌లో ఓ వ్యవసాయబావిలో పడిన కుక్కను , హైదరాబాద్‌లో ఓ పురాతన దేవాలయంలో ఉన్న బావిలో పడిన పిల్లిని, నగర శివారులో ఓ గుర్రాన్ని కూడా ఇలాగే రక్షించామని సంజీవ్‌వర్మ తెలిపారు. -
పాపను కిడ్నాప్ చేసి 25 కోట్లు అడిగారు!
పట్నా: బిహార్ లోని కతిహార్ నగరం నుంచి గతవారం కిడ్నాపైన చిన్నారి స్పర్శ సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. నేపాల్ లో ఆమెను కనుగొన్నారు. స్థానికంగా పెద్ద వ్యాపారస్తుడైన భాను అగర్వాల్ కుమార్తె అయిన స్పర్శను స్కూల్ నుంచి వస్తుండగా ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. రూ. 25 కోట్లు ఇస్తేనే చిన్నారిని విడిచిపెడతామని భాను అగర్వాల్ కు రెండు రోజుల తర్వాత దుండగులు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ నరేశ్ యాదవ్ కుమారుడు సంతోష్ యాదవ్ ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కిడ్నాపర్ల జాడ తెలిసింది. పాపను నేపాల్ లోని విరాట్ నగర్ సమీపంలో దాచినట్టు కనుగొన్నారు. నేపాల్ పోలీసులు చిన్నారిని సురక్షితంగా విడిపించి సోమవారం ఉదయం సరిహద్దు వద్ద తల్లిదండ్రులకు అప్పగించారు.