sarannavaratri festivals
-
ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్
-
విజయవాడ : రేపు ఇంద్రకీలాద్రికి సీఎం వైఎస్ జగన్
-
గాయత్రీదేవి రూపంలో అమ్మవారి దివ్యదర్శనం
సాక్షి, విజయవాడ: దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మంగళవారం గాయత్రిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయానికి తరలివస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకలమంత్ర సిద్ధిఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. -
భక్తజనకీలాద్రి
-
ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతివ్వడంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీబాల త్రిపురసుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. కన్నులపండువగా ప్రారంభం ఇంద్రకీలాద్రిపై పదిరోజులపాటు సాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కన్నులపండువగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటి కనక ప్రభలతో శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మల్లిఖార్జున మహామండపంలో ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం ఆరుగంటలకు అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు విశాఖపట్నం: చినముసిరివాడ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజూ మహేశ్వరి అలంకరణలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి.. శారదా చంద్రమౌళీవ్వరులకు విశేష పంచామృతాభిషేకాలతోపాటు చక్రనవావరణార్చనను స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహించారు. -
జోగుళాంబ ఆలయం ముస్తాబు
నేటినుంచి దక్షిణకాశీలో శరన్నవరాత్రి ఉత్సవాలు అలంపూర్: తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో అలంపూర్ ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. జోగుళాంబ ఆలయంలో పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌వరణం, మహాకలశ స్థాపన, సాయంత్రం అంకురారోపణము, ధ్వజారోహణం పూజలు నిర్వహించనున్నారు. నవావరణ అర్చనలు, చండీహోమాలు వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. గురువారం రాత్రి అమ్మవారు శైలపుత్రి దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళహారతి, మంత్రపుష్ప పూజలు చేస్తారు. festivals, alampur