Sarrainodu
-
ఆల్‌టైం రికార్డులు తిరగరాస్తోన్న ‘సరైనోడు’
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు’అరుదైన రికార్డ్ సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఆన్‌లైన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో 20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చలనచిత్రంగా ‘బన్నీ’ నటించిన సరైనోడు నిలవడం విశేషం. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను 2017 మే 28న గోల్డ్ మైన్స్ టెలిఫిలింస్ సంస్థ తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైక్స్‌లోనూ రికార్డే 20 కోట్ల మందికి పైగా వీక్షించగా, ఆరు లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. అయితే వ్యూస్‌తో పాటు లైక్స్‌లోనూ సరైనోడు రికార్డులు తిరగరాసింది. ఏ భారతీయ చిత్రానికి లేని విధంగా రికార్డు స్థాయిలో 6.6 లక్షల లైక్స్‌తో అల్లు అర్జున్ మూవీ ఇంటర్నెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. 2016లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూ.50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సరైనోడు అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బన్నీ ఈ మూవీలో పూర్తిగా రఫ్ లుక్‌లో అదరగొట్టి మాస్ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత విడుదలైన సరైనోడు అప్పట్లో బన్నీకి హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చింది. తెలుగులో భారీ విజయం సాధించిన సరైనోడు.. బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాయడంపై బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆన్లైన్లో అత్యధిక మంది చూసిన సినిమా’
అల్లు అర్జున్ హీరోగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ కెరీర్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా తరువాత ఆన్‌లైన్‌లోనూ అదే జోరు చూపిస్తుంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈసినిమాను ఆన్లైన్లో 146 మిలియన్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. త్వరలో 150 మిలియన్ల మార్క్‌ను అందుకునేందుకు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఆన్లైన్లో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను 2017 మే 28న గోల్డ్ మైన్స్ టెలిఫిలింస్ సంస్థ తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేశారు. -
నార్త్‌ను సైతం షేక్ చేస్తున్న బన్నీ!
స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్‌గా తెలుగు సినిమాలే చేస్తున్నప్పటికీ, తన స్టైలిష్ లుక్‌తో, డ్యాన్సులతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. తాజాగా ఉత్తరాదిలో బన్నీ అభిమానుల బలం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ తాజా చిత్రం ’దువ్వాడ జగన్నాథం’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయాయి. టాలీవుడ్ సినిమాల డబ్బింగ్‌కు ఇంత ధర పలుకడం ఎప్పడూ లేదని అంటున్నారు. ఇక విషయానికొస్తే.. బన్నీ సూపర్ హిట్ చిత్రం ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాదిలో ప్రకంపనలు రేపుతోంది. ఓ పాపులర్ వీడియో షేరింగ్ షైట్లో విడుదల చేసిన ఈ సినిమాకు తక్కువ సమయంలోనే 64లక్షలకుపైగా హిట్స్ వచ్చాయి. తాజా జోరు చూస్తుంటే ఉత్తరాదిలో బాగా పాపులర్ అయిన సౌతిండియన్ స్టార్‌గా బన్నీ నిలిచాడంటే అతిశయోక్తి కాదంటున్నారు. -
మాలీవుడ్‌లో బన్నీ రికార్డ్
ఇన్నాళ్లు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన మన తెలుగు హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మీద కూడా దృష్టి పెడున్నారు. ఈ లిస్ట్ అందరికన్నా ముందున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాలీవుడ్‌లో మల్లు అర్జున్‌గా ఫేమస్ అయిన బన్నీ తన సినిమాలతో అక్కడ కూడా భారీ వసూళ్లనే సాధిస్తున్నాడు. ఇప్పటికే మరే తెలుగు హీరోకి సాధ్యం కానీ ఫాలోయింగ్ సాధించిన బన్నీ, తన తాజా చిత్రం సరైనోడుతో మరో రికార్డ్ సృష్టించాడు. డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయిన సరైనోడు సినిమాను టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్‌లో నిలబెట్టిన బన్నీ, మాలీవుడ్‌లో కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో 115 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా మాలీవుడ్‌లో 24 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడింది. కేరళలో 20కి పైగా సెంటర్లలో 50 రోజులు పాటు ప్రదర్శింపబడిన తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తనకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన మళయాల ప్రేక్షకులను స్వయంగా కలిసేందుకు త్వరలో కేరళ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. -
ఈ జోడీ కుదిరింది!
పాత్ర డిమాండ్ మేరకు తనను తాను మలుచుకోవడం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్. ‘సరైనోడు’తో తనలోని స్టైల్‌తో పాటు ఊర మాస్‌ని చూపించారు. ఈ సినిమా విజయం తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’, సాయిధరమ్ తేజ్‌కి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి విజయాలు అందించారు హరీశ్. ‘ఆర్య’తో యూత్, ‘పరుగు’తో ఫ్యామిలీ ప్రేక్షకులకు అల్లు వారబ్బాయిని దగ్గర చేసిన ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు సమాచారం. నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాల్లో నటించిన పూజ ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు కమిట్ కాలేదు. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ సరసన ‘మొహంజొదారో’లో నటిస్తున్నారామె. ఇక.. అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘‘ఏడేళ్ల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న చిత్రమిది. అతని ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథను హరీష్ సిద్ధం చేశారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
'సరైనోడు టీమ్ తరపున థ్యాంక్స్'
హైదరాబాద్: 'సరైనోడు' సినిమా యూనిట్ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రేక్షకులకు హీరో అల్లు శిరీష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. రాజమౌళి సినిమాల తర్వాత 'సరైనోడు' ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నంబవన్ గా నిలిచినందుకు అతడు ట్విటర్ ద్వారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. బాహుబలి, మగధీర మాత్రమే 'సరైనోడు'కు కంటే ముందున్నాయని వెల్లడించాడు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వంద కోట్లు వసూలు చేసి తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన స్థానం సంపాదించింది. తనకు మరచిపోలేని భారీ విజయం అందించినందుకు బన్నీ ఇప్పటికే ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. Heartfelt thank you to audiences across Telangana, AP & Karnataka on behalf of Team Sarrainodu! https://t.co/58VbIeRRZ6 — Allu Sirish (@AlluSirish) 17 May 2016 -
కొత్త అభిమానులు ఏర్పడ్డారు!
ఫ్యాన్స్ గుండెల్లోకి రేసుగుర్రంలా దూసుకెళ్లిపోయారు అల్లు అర్జున్. ‘దే...వు...డా’ అంటూ సరదాగా నవ్వించినా, ‘గమ్మునుండవోయ్’ అంటూ మాటలతో కొట్టినంత పని చేసినా... బన్నీ ఏం చేసినా స్టైల్‌గా ఉంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ చేసిన ‘సరైనోడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం ఆనందంగా ఉంది’ అని బన్నీ అన్నారు. ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు చెప్పారు. బోయపాటితో సినిమా అనగానే, తెరపై మీరు కనిపించరు.. బాలకృష్ణే కనిపిస్తారని చాలామంది అనుకున్నారు.. కానీ మీరే కనిపించారు? (నవ్వుతూ..) బాలకృష్ణగారితో బోయపాటి వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ తరువాత ఏ హీరోతో సినిమా చేసినా.. ఆ హీరోని బాలకృష్ణగారిలానే చూపిస్తారేమో అనుకుని ఉంటారు. బాలకృష్ణగార్ని ఎలా ప్రెజెంట్ చేయాలో ఆయన్ను బోయపాటి అలానే ప్రెజెంట్ చేశారు. ‘సరైనోడు’ షూటింగ్ సమయంలో ‘నాకు మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్, మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ సినిమా తీస్తా’ అని బోయపాటి అన్నారు. హీరో ఎలా ఉంటే దానికి తగ్గట్టు సినిమా తీస్తారాయన. ‘హీ ఈజ్ వెరీ గుడ్ డెరైక్టర్’. నన్ను ప్రెజెంట్ చేసేటప్పుడు ఏ స్థాయిలో పుష్ చేయాలో అంతే చేశారు. ఎంత పుష్ చేయాలో, ఎక్కడ ఆపాలో తెలిసిన వ్యక్తి. ఊర మాస్‌గా కనిపించడంతో మీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు... అభిమానులు హ్యాపీ అంటే నేను హ్యాపీనే. కానీ, ఇప్పుడున్న ఫ్యాన్స్ కాకుండా కొత్త ఫ్యాన్స్ కూడా ఏర్పడేలా చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నా సినిమాలు ఒక లెవల్ వరకు వెళ్లాయి కానీ, ఈ చిత్రం కింది స్థాయి వరకూ తీసుకెళ్లింది. ఇటు క్లాస్, అటు మాస్ కాకుండా యూనివర్సల్ అవ్వాలనేదే నా కోరిక. అది ‘సరైనోడు’తో తీరింది. 50 కోట్ల మార్క్ దాటేశారు... వంద దాకా? యాభై కోట్లు అనేది ఈ సినిమాతో కాదు.. ఎప్పుడో దాటేశా. రికార్డ్స్ గురించి మాట్లాడను. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాను. ‘సన్నాఫ్..’, ‘రేసుగుర్రం’ కొంచెం క్లాస్ పర్సన్స్‌కి, చదువుకున్నవారికీ నచ్చాయి. కానీ, ‘సరైనోడు’ లారీ డ్రైవర్... ఆఫీస్ బాయ్.. ఇలా అందరికీ రీచ్ అయ్యింది. ఇప్పటివరకూ నేను రీచ్ కాని వారికి కూడా దగ్గరవడం హ్యాపీగా ఉంది. ‘రుద్రమదేవి’లో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కింద లెవల్‌కి వెళ్లడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే, ‘సరైనోడు’ ఫుల్‌గా చేసింది. కొత్త కాన్సెప్ట్స్‌తో తీసే సినిమాలపై మీ అభిప్రాయం? కొత్తగా ట్రై చేయడం మంచిదే. నా మటుకు నేను కొత్తగా ఉంది కదా అని ఒప్పేసుకోను. అది బాగుందా? లేదా? అని చెక్ చేసుకుని, ఆ తర్వాతే ముందుకెళతా. కొత్తగా ఉన్నది ప్రేక్షకులకు నచ్చాలని లేదు, నచ్చకూడదనీ లేదు. బేసిక్‌గా గుడ్ ఫిల్మ్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. ‘సరైనోడు’నే తీసుకుందాం.. కొత్తగా చేయాలనే కోరిక నాకుంది. కొత్తగా చూపించాలనే కోరిక బోయపాటికి ఉంది. నేర్చుకోవాలనే తపన నాకుంది, నేర్పించాలని ఆయనకుంది. అందుకే సినిమా బాగా వచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా రిజల్ట్‌ని మీరు జడ్జ్ చేయగలిగారా? ఈ చిత్రకథ విని, రిజల్ట్‌ని జడ్జ్ చేయడం కష్టం. హీరోను ప్రెజెంట్ చేసే విధానం, ఆడియోను సరైన చోట ప్రెజెంట్ చేయడం, యాక్షన్ పార్ట్ వంటివన్నీ సరిగ్గా కుదిరితే ‘ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం’. ఈ సినిమాకి బోయపాటి అన్నీ చక్కగా కుదిరేలా చేశారు. కొన్ని చిత్రాలకు ముందే రిజల్ట్ ఊహించడం కష్టం. ‘ఆర్య’ను తీసుకుందాం. క్యారెక్టర్ని ఫాలో అయ్యే సినిమా అది. కొన్ని చిత్రాలు స్క్రీన్‌ప్లే బేస్డ్గా ఉంటాయి. ఒక్కో ఫిల్మ్ ఒక్కో దాన్ని బేస్ చేసుకుని వెళుతుంటుంది. ఇప్పట్లో మాత్రం పర్ఫెక్ట్ స్టోరీతో నడిచే చిత్రాలంటే కష్టమే. నేను చేసినవాటిలో ‘పరుగు’ అలాంటి సినిమానే. మంచి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ. ఫైట్స్ లేని సినిమా చేయడానికి రెడీయా? సినిమాలో ఫైట్స్ లేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే హై కంటెంట్ ఉండాలి. అది ఉన్నప్పుడు చేయొచ్చు. ‘24’ చిత్రం... మీ చిత్రం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందా? ఒక ప్రాంతీయ చిత్రాన్ని ఎప్పుడూ ఓ డబ్బింగ్ సినిమా బీట్ చేయలేదు. ఎంత స్ట్రాంగ్ హీరో వచ్చినా కూడా. ఇక్కడ నా సినిమా వంద శాతం వసూలు చేస్తే, తమిళంలో ఇరవై నుంచి ముప్ఫై శాతం చేస్తుందంతే. అదే సూర్యగారి సినిమా తమిళంలో వంద శాతం వసూలు చేస్తే, ఇక్కడ ఇరవై నుంచి ముప్ఫై శాతం రాబడుతుంది. రజనీకాంత్‌గారు సీనియర్ కాబట్టి ఆయన సినిమా ఇక్కడ యాభై నుంచి అరవై శాతం వసూలు చేస్తుంది. పదమూడేళ్ల కెరీర్‌ని తల్చుకుంటే ఏమనిపిస్తోంది? నాకున్న లుక్స్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి ఇంతదూరం రావడం ఎక్కువ. వచ్చేశా. ఇంకో 20 ఏళ్ల కెరీర్ ఉంటుందేమో. ఇలానే కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. మీ సినిమాల గురించి మీ ఆవిడ స్నేహ ఏమంటారు? పెద్దగా పట్టించుకోదు. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటుంది. అదే బెస్ట్. నేను మాత్రం సినిమా విడుదలకు మూడు రోజులు ముందు, తర్వాత ఓ మూడు రోజులు కొంచెం తికమకగా ఉంటా. నా మూడ్‌ను అర్థం చేసుకుని ఆ టైమ్‌లో తను కూడా ఏమీ మాట్లాడదు. మీ అబ్బాయి పుట్టినరోజును ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇక్కడ కాకుండా విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకలా? వన్ ఇయర్, టు ఇయర్స్ పిల్లలకి ఎంత గ్రాండ్‌గా బర్త్‌డే చేసినా, అది వాళ్లకు తెలియదు. ఆ టైమ్‌లో అందర్నీ పిలిచి సెలబ్రేట్ చేస్తే అందరూ ఎవరికి వాళ్లు మాట్లాడుకోవడం తప్ప పిల్లలకు సెలబ్రేట్ చేసినట్టుండదు. నాకు తెలిసి నాలుగేళ్లో, ఐదేళ్లో వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తే వాడి ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే ఊహ తెలిశాక ఇక్కడ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మాత్రం పిల్లలను ఎక్కడికి తీసుకెళితే ఎంజాయ్ చేస్తారో అక్కడి తీసుకెళుతున్నాను. విదేశాలకు వెళ్ళిపోతే తగినంత ప్రైవసీ ఉంటుంది. అక్కడ జూకు తీసుకెళితే జంతువులను చూసి, ఎంజాయ్ చేస్తాడు. నేను వాటివైపు చూడకపోతే నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు. అప్పటికీ చూడకపోతే ‘అర్జున్’ అని పిలుస్తాడు. అర్జున్ అని పిలుస్తాడా? ఆ పిలుపు ఎలా అలవాటైంది? మా ఆవిడ అలానే పిలుస్తుంది. అది వింటాడు కదా. సరే.. మీ అబ్బాయి అయాన్ గురించి ఇంకొన్ని ముచ్చట్లు చెప్పండి. ఏవైనా తినమంటే ఒక్కోసారి మారాం చేస్తుంటాడు. అబ్బాయి కదా... హుషారుగా పరిగెడుతుంటాడు. తిన్న వెంటనే అదంతా కక్కేసుకునే రేంజ్లో ఆడతాడు. మాకేమో ఖంగారు. కన్ను మూసి తెరిచే లోపు ఏదో ఒకటి లాగేస్తుంటాడు. గోల గోల చేసేస్తాడు (నవ్వుతూ...). చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది. అయాన్‌కి మీరెప్పుడైనా స్నానం చేయించారా? ఒక్కసారి చేయించాను. స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి, నేను మ్యాట్ మీద నిలబడి, తనని నా కాళ్ల మధ్యలో నిలబెట్టుకున్నాను. అంతే.. జర్రున జారాడు. వెనక్కి బోర్లా పడ్డాడు. తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది. గుక్కపట్టి ఏడ్చేశాడు. దాంతో పాటు తిన్నది మొత్తం కక్కేశాడు. భయమేసేసింది. కొద్ది సేపటికి నార్మల్ అయ్యాడు. మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి, చెక్ చేయించాం. నార్మల్.. ఏం ఫర్లేదని చెప్పారు. ‘నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా..?’ అని మా ఆవిడ సీరియస్ అయ్యింది. నేనైతే ఓ రోజు హ్యాండిల్ చేయగలనేమో కానీ అంతకంటే ఎక్కువంటే కష్టం. కొంతమంది పిల్లలు ఎత్తుకోమంటూ మారాం చేస్తారు. మరి, మీవాడు? ఎత్తుకోమంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒకరుంటారు కాబట్టి, అందరూ ఎత్తుకుంటారు. విదేశాలు వెళ్లేటప్పుడు కూడా ఒక మనిషిని తీసుకెళతాం. కానీ, ఎంత తీసుకెళ్లినా స్విమ్మింగ్ పూల్‌లో దిగినప్పుడో, జూకి వెళ్లినప్పుడో మనమే జాగ్రత్తగా ఎత్తుకోవాలి కదా. అప్పుడు నా చేతులు నొప్పి పుడతాయి చూడండీ.. మామూలుగా ఉండదు. అయ్య బాబోయ్.. పిల్లల్ని పెంచడం చాలా కష్టమండీ బాబు. కొంతమంది ఎవరి హెల్పూ లేకుండా పెంచుతారు. వాళ్లకు జోహార్లు చెప్పాల్సిందే. సెలబ్రిటీ లైఫ్ కొంచెం క్లిష్టమే. పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా? ఫ్రెండ్స్‌తో కొంచెం సరదాగా ఉంటా. పబ్లిక్ ఫంక్షన్లో డీసెంట్‌గా ఉంటా. స్టేజ్‌పైన ఉన్నప్పుడు సరదాగా మాట్లాడే మాట ఒక్కోసారి ఎక్కడికో దారి తీస్తుంది. కావాలని అలా అనకపోయినా కొంతమందిని ఆ మాటలు హర్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆలోచించుకుంటే... ఏంటీ.. అలా మాట్లాడేశామని అనిపిస్తుంది. అందుకే పబ్లిక్ ఫంక్షన్స్‌లో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉంటా. -
సరైనోడు సక్సెస్ మీట్
-
మాస్, క్లాస్, ఫ్యామిలీస్ ఇష్టపడుతున్న సరైనోడు
మాస్... ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం బోయపాటి సినిమాలు. ‘భద్ర’ నుంచి ‘సరైనోడు’ వరకు బోయపాటి అంటే కేరాఫ్ మాస్ మసాలా సినిమాలే. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్ ఎంటర్టైనర్స్ని అందించిన బోయపాటి ఇప్పుడు ‘సరైనోడు’ని అదే పంథాలో స్టైల్ జోడించి, తీశారు. బన్నీతో బోయపాటి సినిమా కమిటైన తర్వాత చాలా మందికి వచ్చిన అనుమానం.. ఎవరి దారిలోకి ఎవరొస్తారు అని. కానీ విచిత్రంగా... ఇద్దరూ ఒకే దారిలో పయనించారు. అల్లు అర్జున్ తనలోని టన్నులు టన్నుల ఎనర్జీనంతా ధారపోశారు. బోయపాటి తనలోని మాస్‌కి డోస్ పెంచడంతో పాటు స్టైల్‌ని కూడా జోడించి, మంచి స్టైలిష్ మాస్ మూవీ అందించారు. అల్లు అర్జున్ పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో... పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో కథను భుజాలమీద తీసుకెళ్లారు. మాస్, క్లాస్ తేడా లేకుండా ప్రేక్షకులు సరైనోడికి నీరాజనాలు అందిస్తున్నారనడానికి హౌస్‌ఫుల్ కలెక్షన్సే నిదర్శనం. పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా కితాబులు అందుకుంటోందని చిత్రబృందం అంటోంది. ‘సరైనోడు’లో హీరోకు సిస్టమ్‌తో పని ఉండదు. తప్పు జరిగితే ఎంత పెద్ద వాళ్లనైనా వచ్చి కొట్టేసి వెళ్లిపోవడమే. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ పాత్రను అల్లు అర్జున్ అద్భుతంగా చేశారు. తనను తాను కొత్తగా చూపించుకోవాలని తపించే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ప్రతీ సినిమాకు తనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ... కెరీర్లో వరుసగా యాభై కోట్ల మార్కును చేరుకుంటున్నారు. బన్నీలోని పవర్ఫుల్ యాంగిల్‌ను బాగా వాడుకున్నారు బోయపాటి. డైలాగ్ డిక్షన్‌లోనూ మార్పు తీసుకొచ్చారు. తనకు కావాల్సిన దాన్ని కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే పలికించుకున్నారు బోయపాటి. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఫైట్ అయితే బోయపాటికి యాక్షన్ ఎపిసోడ్స్‌పై ఉన్న ప్రేమను చూపిస్తుంది. మాస్ సామ్రాజ్యాన్ని బోయపాటి ఏలేస్తున్నారనడానికి ‘సరైనోడు’ సరైన రుజువు. మాస్లో పీక్స్‌ని టచ్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సెంటిమెంట్, యువతను గిలిగింతలు పెట్టే లవ్‌స్టోరీతో ఫుల్ మీల్స్‌లాంటి సినిమాని అందించారు బోయపాటి. దిట్టమైన కండలు పెంచి, ఫిజిక్ వైజ్‌గా కూడా అదుర్స్ అనిపించుకున్నారు బన్నీ. అలాగే ఫైట్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ప్రతీ సీన్లోనూ మాస్‌ని ఎట్రాక్ట్ చేసే విధంగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. రిథమిక్ స్టెప్పులతో డ్యాన్సులేసి ఊపు తీసుకొచ్చారు. ఆది పినిశెట్టి.. ఈ బ్యాడ్ బాయ్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ‘సరైనోడు’ సినిమాలో తన నటనతో ఆది అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. హీరోగా రాణిస్తున్న ఆది విలన్‌గా నటించింది తొలిసారే అయినా భేష్ అనిపించుకున్నారు. నువ్వా? నేనా? అన్నట్లుగా హీరో, విలన్ పాత్రలను డిజైన్ చేయడంలో బోయపాటి సఫలీకృతులయ్యారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే కేథరీన్ మోడ్రన్ ఎమ్మెల్యేగా మెప్పించింది. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో రకుల్ అలరించింది. అల్లు అర్జున్‌కి బాబాయ్‌గా శ్రీకాంత్ నటన బాగుంది. మిగిలిన పాత్రల్లో బన్నీకి తండ్రిగా నటించిన జయప్రకాష్ మంచి క్యారెక్టర్లో కనిపించారు. బ్రహ్మానందం, విద్యుల్లేఖా రామన్, పృథ్వీ కామెడీ పండించే పనిలో సక్సెస్ అయ్యారు. హిలేరియస్ కామెడీ పంచ్‌లతో నవ్వించారు. ‘సరైనోడు’ చిత్రానికి ప్రధానమైన, కీలకమైన కోర్టు సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందించారు బోయపాటి. హైలీ ఎమోషనల్ సీన్‌తో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశారు. పబ్‌లో స్కేటింగ్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసి యాక్షన్‌లో సరికొత్త కోణాన్ని చూపించారు. ఏ చిత్రానికైనా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు బోయపాటి. ‘సరైనోడు’లోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ రూపొందించారు. యాక్షన్ పార్ట్‌కి తమన్ రీ-రికార్డింగ్ అదిరిపోయింది. ఈ చిత్ర విజయంలో డైలాగ్స్ మరో ప్రధాన భూమిక పోషించాయి. హీరో, విలన్ మధ్య బ్యాక్ గ్రౌండ్ గురించి, బ్రాండ్ గురించి రత్నం రాసిన డైలాగ్స్‌కి క్లాప్స్ పడుతున్నాయి. అలాగే హీరో రాసిన లవ్ లెటర్‌ను తండ్రి చదివే సందర్భంలో కామెడీ పండింది. ఆ తర్వాత విలన్ బ్యాచ్‌తో పెళ్లి చూపుల సీన్ కూడా హిలేరియస్‌గా పండింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఉంది. నిర్మాత అల్లు అరవింద్ ఖర్చుకు వెనకాడకుండా లావిష్‌గా నిర్మించిన వైనం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మాస్, క్లాస్ తేడా లేకుండా అందర్నీ మెప్పించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఈ సమ్మర్‌కి అందించారు. ఇప్పటికే హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. క్లాస్, మాస్, ఫ్యామిలీస్ ఆదరణతో మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళ్తోంది. సమ్మర్ సీజన్‌కి మాస్, క్లాస్, ఫ్యామిలీస్‌కి ‘సరైనోడు’ వచ్చాడు. -
'సరైనోడు'కు పాజిటివ్ రివ్యూ
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' సినిమా ఈరోజు విడుదలలైంది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు సినిమా తారలు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. 'సరైనోడు' బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటూ చిత్రయూనిట్ కు దగ్గుబాటి రానా శుభాకాంక్షలు తెలిపారు. రకుల్ ప్రీత్ కు ప్రత్యేకంగా 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. ఈ ఉదయమే ముంబై వెళుతున్నందున్న మొదటిరోజే సినిమా చూడలేకపోతున్నానని రానా ట్విటర్ ల్లో పేర్కొన్నాడు. రానాకు కు రకుల్ థ్యాంక్స్ చెప్పింది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా 'సరైనోడు' టీమ్ కు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. కోలీవుడ్ లో 'సరైనోడు' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయని రకుల్ ప్రీత్ ట్వీట్ చేసింది. 'సరైనోడు' సూపర్ గా ఉందని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా విజయవంతం అవుతుందని టీమ్ మొత్తం దీమాగా ఉంది. అల్లు అర్జున్ ను కొత్త తరహాలో చూపించానని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చెప్పారు. Wishsing the team of #Sarrainodu @alluarjun @Rakulpreet all the very best. Hope you guys rock your way to the box-office. — Rana Daggubati (@RanaDaggubati) 22 April 2016 Early morning flt to Mumbai will miss #Sarrainodu day 1 in cinemas!! — Rana Daggubati (@RanaDaggubati) 22 April 2016 Positive Reviews From FDFS @alluarjun , @Rakulpreet , @MusicThaman & Best Wishes To Team #Sarrainodu pic.twitter.com/NkFOo10Las — Team Kollywood (@TeamKollywood) 22 April 2016 -
‘సరైనోడు’ పాటల విజయోత్సవం
-
సరైనోడు మొదలెట్టేశాడు
సమ్మర్ బరిలో పోటీ పడుతున్న హీరోలు ఒక్కొక్కరుగా ప్రమోషన్ వేగం పెంచుతున్నారు. వేసవి బాక్సాఫీస్‌ను ఓపెన్ చేసిన నాగార్జున మంచి హిట్‌తో స్వాగతం పలకగా, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రయూనిట్ కూడా భారీగానే ప్రచారం చేస్తోంది. ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించిన చిత్రయూనిట్, ప్రస్తుతం టీవీ ప్రమోషన్ల మీద దృష్టిపెట్టింది. ఇదే బాటలో సమ్మర్ బరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సరైనోడు కూడా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్ టీజర్‌ను కూడా రిలీజ్ చేసిన బన్నీ గ్యాంగ్, తాజాగా ఓ సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది. మాస్ మాసాలా ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఐటమ్ నంబర్‌ను అభిమానుల కోసం తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. ఈ పాటలో ఆడిపాడిన తెలుగుమ్మాయి అంజలి అందాలు ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సరైనోడు సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో అందాల భామ కేథరిన్ థెరిస్సా కీలక పాత్రలో నటిస్తోంది. చాలా కాలం తరువాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సరైనోడు సినిమా పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. -
ఊర మాస్‌గాడు!
ఒక్క డైలాగ్ చాలు.. హీరో పాత్ర ఎలా ఉంటుందో చెప్పేయడానికి. ఆ మధ్య విడుదలైన ‘సరైనోడు’ టీజర్లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసింది. ‘ఎర్ర తోలు కదా.. స్టైల్‌గా ఉంటాడను కుంటున్నావేమో.. మాస్ ఊర మాస్..’ అంటూ సీరియస్ లుక్‌తో బన్నీ చెప్పిన డైలాగ్‌కి అభిమానులు ఆనందపడిపోయారు. అసలే బన్నీ మాస్ హీరో. ఇక, బోయపాటి శ్రీను వంటి మాస్ డెరైక్టర్‌తో సినిమా చేస్తే? ఊర మాస్‌గానే ఉంటుంది కదూ. అందుకే ‘సరైనోడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ నాయకా నాయికలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని శనివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఈ చిత్రం కోసం బన్నీ, కేథరిన్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని టాకీ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. బన్నీ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. మార్చి నెలాఖరున పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నారు.