Sarva Shiksha Abhiyan project
-
అయ్యో..సర్వ శిక్ష అభియాన్
సాక్షి,కడప: పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత గురించి మనం వినే ఉంటాం. అలాగే ఉంది సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కార్యాలయ దుస్థితి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల అభివృద్ధితో పాటు మౌలిక వసతులకు నిధులిచ్చే కార్యాలయ ఇది. అలాంటి కార్యాలయంలో కనీస మౌలిక వసతులు లేవు. సిబ్బందికి సరిపడా గదులు లేవు. ఫైల్స్, ఫర్నిచర్‌కు అదనపు గదుల సౌకర్యం లేదు. దీంతో విలువైన ఫైల్స్‌ను కూడా బీరువాలపైన ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకుంది. పాఠశాలకు ఏవైన పుస్తకాలు వచ్చినా వాటిని కూడా భద్రపరిచేందుకు గదులు లేకపోవడంతో వాటిని కూడా వరండాల్లో ఉంచుతున్నారు. దీంతో విలువైన పుస్తకాలు కూడా పాడైపోతున్నాయి. ఆరుబయట కుప్పలుగా పోసిన పుస్తకాలు ఇందంతా ఒక ఎత్తు అయితే పాఠశాలల సమస్యలు, అభివృద్ధిపై ఆయా పాఠశాలల హెచ్ఎంలు, స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలంటే నగరంలోని ఎమ్మార్సీ దగ్గరకో లేక స్కూల్స్ దగ్గరకో పరిగెత్తి సమీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకుంది. ఇన్ని సమస్యలున్నా కనీసం కార్యాలయ సిబ్బంది ప్రశాంతంగా కూర్చొని విధులను నిర్వహించుకుందా మంటే అది కూడా కుదరని పరిస్థితి. కారణం కూర్చునే కుర్చీకి అటు పక్క ఇటు పక్క ఫైల్సే. సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అదనపు గదులను నిర్మాణానికి అనుమతులిచ్చి ఇరుకిరుకు గదులలో విధుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
యూనిఫామ్‌లు వెంటనే అందించండి
ప్రాజెక్టు అధికారులకు మంత్రి గంటా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు సకాలంలో అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆయా జిల్లాల సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’లో కథనానికి మంత్రి గంటా, కార్యదర్శి స్పందించారు. యూనిఫారాల పంపిణీ ఆలస్యంమవడంతో జిల్లా పీఓలు, శాఖాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ముగిసేలోపు ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. -
రేపటి నుంచి టీచర్లకు శిక్షణ
విశాఖపట్నం: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులకు గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి బి.నగేశ్ తెలిపారు. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 20 వరకూ జరిగే ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాలో43 మండలాల్లో ఉన్న 1197 గణితం, 1412 సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. 12నుంచి 15 వరకూ అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు గవరపాలెం ఎంజీహెచ్ఎస్లోనూ, గణితం వారికి అనకాపల్లి ఎంపీఎల్ మెయిన్ స్కూల్లోనూ శిక్షణ ఇస్తారు. అచ్యుతాపురం, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు గాజువాక జెడ్పీహెచ్ఎస్లోనూ, గణితం శిక్షణ తరగతులు మింది జెడ్పీహెస్లోనూ, నర్సీపట్నం, రోలుగుంట, నాతవరం, కోటవురట్ల మండలాల వారికి సైన్స్ తరగతులు నర్సీపట్నం మెయిన్ జెడ్పీహెచ్ఎస్లోనూ, గణితం జెడ్పీహెచ్ఎస్, నర్సీపట్నంలో నిర్వహిస్తారు. కొయ్యూరు, జీకె వీధి, చింతపల్లి, గొలుగొండ, మాకవరపాలెం మండలాల సైన్స్ తరగతులు నర్సీపట్నం బాలికల హైస్కూల్లో, గణితం పి.బి.పల్లి జెడ్పీహెచ్ఎస్లోనూ జరుగుతాయి. 17 నుంచి 19 వరకూ చోడవరం, చీడికాడ, దేవరాపల్లి మండలాలకు పీఎస్ పేట జెడ్పీహెచ్ఎస్లోనూ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలకు తలారసింగి సీఏహెచ్ఎస్లోనూ, బుచ్చెయ్యపేట, వి.మాడుగుల, రావికమతం మండలాలకు వడ్డాది జెడ్పీహెచ్ఎస్లోనూ తరగతులు జరుగుతాయి. 22 నుంచి 24 వరకూ కె.కోటపాడు వారికి సబ్బవరం జీహెచ్ఎస్లోనూ, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు సైన్స్ తరగతులు గోడిచర్ల జెడ్పీహెచ్ఎస్లో, గణితం నక్కపల్లి జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయి. యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల సైన్స్ తరగతులు యలమంచిలి జెడ్పీ బాలికల పాఠశాలలోనూ, గణితం యలమంచిలి జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయిు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు పెదబయలు, జీటీడబ్ల్యూహెచ్ఎస్(బి)లో నిర్వహిస్తారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకూ డుంబ్రిగుడ, అరకు వేలీ, అనంతగిరి మండలాల సైన్స్ తరగతులు కంతబాంసుగూడ జీటీడబ్ల్యూఏహెచ్ఎస్లో, గణితం డుంబ్రిగూడ జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయి. ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలకు ఆనందపురం జెడ్పీహెచ్ఎస్లో, అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల సైన్స్ తరగతులు గవరపాలెం ఎంజీహెచ్ఎస్లో, గణితం అనకాపల్లి ఎంపీఎల్ మెయిన్ స్కూల్లో జరుగనున్నాయి. నర్సీపట్నం, రోలుగుంట, కోటవురట్ల , నాతవరం మండలాల సైన్స్ తరగతులు నర్సీపట్నం మెయిన్ జెడ్పీహెచ్ఎస్లో, గణితం నర్సీపట్నం బాలికల పాఠశాలలో జరుగుతాయి. 9 నుంచి 13 వరకూ చోడవరం, చీడికాడ, దేవరాపల్లి మండలాలకు పీఎస్ పేట జెడ్పీహెచ్ఎస్లోనూ, అచ్చుతాపురం, గాజువాక, పరవాడ, నాతవరం, కోటవురట్ల మండలాలకు గాజువాక జెడ్పీహెచ్ఎస్లోనూ, బుచ్చయ్యపేట, వి.మాడుగుల, రావికమతం మండలాలకు వడ్డాది జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తారు. 14 నుంచి 16 వరకూ కొయ్యూరు, జీకె వీధి, చింతపల్లి, గొలుగొండ, మాకవరపాలెం మండలాలకు నర్సీపట్నం బాలికల ప్రభుత్వ పాఠశాలలో, యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాలకు యలమంచిలి జెడ్పీ బాలికల పాఠశాలలో, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలకు ఆనందపురం, జెడ్పీహెచ్ఎస్లోన, అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాలకు గవరపాలెం ఎంజీహెచ్ఎస్లో శిక్షణ తరగతులు జరుగుతాయని పీఓ నగేశ్ తెలిపారు. -
ప్రాథమికోన్నత టీచర్లకు 11 నుంచి శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 11వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు. గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు వారికి కేటాయించిన కేంద్రాల్లో ఆయా తేదీల్లో మూడు రోజుల పాటు శిక్షణకు హాజరుకావాలని ఆయన కోరారు. మొత్తం 18 మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన రిసోర్స్పర్సన్లు, కోర్స్ డెరైక్టర్లకు శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ప్లానింగ్ సమావేశం జరుగుతుందన్నారు. రిసోర్సుపర్సన్లు, కోర్సు డెరైక్టర్లు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. జిల్లాలో శిక్షణ కేంద్రాలు, సబ్జెక్టు టీచర్లు, తేదీల వివరాలు... చీరాలలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13వ తేదీ వరకు గణితం, 18 నుంచి 20వ తేదీ వరకు సైన్స్ టీచర్లకు శిక్షణ ఇస్తారు. పర్చూరులో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం మార్టూరులో మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, యద్దనపూడి మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ అద్దంకిలో అద్దంకి, ముండ్లమూరు, జె.పంగులూరు, కోరిశపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం ఒంగోలు-1లో ఒంగోలు, మద్దిపాడు మండలాలు. 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్ ఒంగోలు-2లో కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు మండలాలు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం చీమకుర్తిలో తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ పొదిలిలో పొదిలి, దర్శి, మర్రిపూడి, కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, పొదిలి, దర్శి, మర్రిపూడి మండలాల టీచర్లకు 25 నుంచి 27 వరకు గణితం దొనకొండలో కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం కందుకూరులో కందుకూరు, పొన్నలూరు, కొండపి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం. కందుకూరు, పొన్నలూరు, కొండపి, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల సైన్స్ టీచర్లకు 18 నుంచి 20 వరకు... సింగరాయకొండలో ఉలవపాడు, గుడ్లూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం వలేటివారిపాలెంలో వలేటివారిపాలెం, లింగసముద్రం, పామూరు మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం కనిగిరిలో కనిగిరి, పీసీ పల్లి మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు గణితం, కనిగిరి, పీసీపల్లి పామూరు మండలాల సైన్స్ టీచర్లకు 21 నుంచి 23 వరకు... వెలిగండ్లలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, సీఎస్ పురం మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు సైన్స్, సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం మార్కాపురంలో తర్లుపాడు, పెద్దారవీడు, మార్కాపురం మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్ యర్రగొండపాలెంలో యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం కంభంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ గిద్దలూరులో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం.