ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 11వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు.
గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు వారికి కేటాయించిన కేంద్రాల్లో ఆయా తేదీల్లో మూడు రోజుల పాటు శిక్షణకు హాజరుకావాలని ఆయన కోరారు. మొత్తం 18 మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన రిసోర్స్‌పర్సన్లు, కోర్స్ డెరైక్టర్లకు శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ప్లానింగ్ సమావేశం జరుగుతుందన్నారు. రిసోర్సుపర్సన్లు, కోర్సు డెరైక్టర్లు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు.
జిల్లాలో శిక్షణ కేంద్రాలు,
సబ్జెక్టు టీచర్లు, తేదీల వివరాలు...
చీరాలలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13వ తేదీ వరకు గణితం, 18 నుంచి 20వ తేదీ వరకు సైన్స్ టీచర్లకు శిక్షణ ఇస్తారు.
పర్చూరులో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం
మార్టూరులో మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, యద్దనపూడి మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్
అద్దంకిలో అద్దంకి, ముండ్లమూరు, జె.పంగులూరు, కోరిశపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం
ఒంగోలు-1లో ఒంగోలు, మద్దిపాడు మండలాలు. 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్
ఒంగోలు-2లో కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు మండలాలు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం
చీమకుర్తిలో తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్
పొదిలిలో పొదిలి, దర్శి, మర్రిపూడి, కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, పొదిలి, దర్శి, మర్రిపూడి మండలాల టీచర్లకు 25 నుంచి 27 వరకు గణితం
దొనకొండలో కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం
కందుకూరులో కందుకూరు, పొన్నలూరు, కొండపి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం. కందుకూరు, పొన్నలూరు, కొండపి, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల సైన్స్ టీచర్లకు 18 నుంచి 20 వరకు...
సింగరాయకొండలో ఉలవపాడు, గుడ్లూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం
వలేటివారిపాలెంలో వలేటివారిపాలెం, లింగసముద్రం, పామూరు మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం
కనిగిరిలో కనిగిరి, పీసీ పల్లి మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు గణితం, కనిగిరి, పీసీపల్లి పామూరు మండలాల సైన్స్ టీచర్లకు 21 నుంచి 23 వరకు...
వెలిగండ్లలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, సీఎస్ పురం మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు సైన్స్, సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం
మార్కాపురంలో తర్లుపాడు, పెద్దారవీడు, మార్కాపురం మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్
యర్రగొండపాలెంలో యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం
కంభంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్
గిద్దలూరులో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం.
ప్రాథమికోన్నత టీచర్లకు 11 నుంచి శిక్షణ
Published Sat, Aug 9 2014 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement