sarvepalli radhakrishnans birth day
-
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం
సాక్షి , అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. గవర్నర్ టీచర్స్ డే శుభాకాంక్షలు సమసమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మూలస్తంభాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆయన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడైన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నత విలువల కోసం అహరహం కృషి చేశారని కొనియాడారు. పాశ్చాత్య దేశాలకు భారతీయ తత్వ శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని పరిచయం చేశారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తారని, అటువంటి వారిని గురుపూజోత్సవం రోజు సన్మానించుకోవడం ముదావహమని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. -
గురువుల మహాదీక్ష
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ఒక్కరు కాదు.. ఇద్దరుకాదు.. వందల మంది ఉపాధ్యాయులు ఒక్క చోటికి చేరారు. వారికి తోడుగా వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. అందరూ కలిసి ‘సోలో ఆంధ్రప్రదేశ్’ అని నినదించారు. గురువులకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఉపాధ్యాయులు నివాళులర్పిస్తూ నల్లని జెండాలతో స్వార్థ రాజకీయ నాయకుల వైఖరిని ఎండగడుతూ రిలే నిరసన దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తాడేపల్లిగూడెంలో గురువారం ‘గురువుల మహా దీక్ష’ ద్వారా నిరసన తెలిపారు. స్థానిక కేఎన్ రోడ్డులోని తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు వేసిన 30 షామియానాలలో 1600 మంది ఉపాధ్యాయులు దీక్షలలో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో వెయ్యి మంది ఉపాధ్యాయులు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు చెందిన 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్షలలో పాల్గొని నిరసన తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా ఉన్న సర్వేపల్లి ఫ్లెక్సీని దీక్షా శిబిరాల వద్ద ఉంచి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం దీక్షలలో పాల్గొన్నారు. గంధం జోన్స్‌కు చెందిన విద్యార్థులు 20 అడుగుల నల్లని జెండాతో నిరసన ప్రదర్శన, షిర్డిసాయి విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఎవరి అండదండలు లేకుండా మహోద్యమంగా జరుగుతున్న ఉద్యమం సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అని అన్నారు. విభజన నిర్ణయం ఆగిన తర్వాత ప్రజలు వివిధ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఐటీ ఒక చోట, సినీ పరిశ్రమ ఒక చోట అన్నట్లుగా అభివృద్ధి చెందాలన్నారు. మరో స్వాతంత్య్ర సంగ్రామంలా ఉద్యమం సాగుతుందని జేఏసీ గౌరవాధ్యక్షుడు బుద్దాల రామారావు అన్నారు. దీక్షాపరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట గోపి, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు, యర్రా నవీన్, జేఏసీ నాయకులు మాకా శ్రీనివాసరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ఫైలు శ్రీనివాసరావు, అపుస్మా నాయకులు గంధ ం సుధాకర్, గురువు హరిబాబు, అత్తింటి సుబ్బరాజు, జంగా బాలాజీ, ఎంఎల్‌ఎస్‌ఎన్ రెడ్డి, గూడెం పరిసర ప్రాంత విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. -
జజ్జనకరి... జనాలే.. జనసంద్రంలా సీమాంధ్ర
స్వచ్ఛంద ఉద్యమానికి 37రోజులు సమైక్య భావనతో ఉప్పొంగుతున్న హృదయాలు అందరి నోటా ఒకే మాట...తెలుగుజాతిని చీల్చవద్దు... సాక్షి, నెట్వర్క్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని రోడ్డుపైనే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు సామూహికంగా సెలవులపై వెళ్లారు. దీంతో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమైక్యాంధ్ర చేపట్టిన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు గురువారం 37వ రోజూ ఉధృతంగా కొనసాగాయి. అనంతపురం జిల్లా పామిడిలో సకల జనుల సమైక్య గర్జనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు తమ జీతాలను, జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తోంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు విందులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మడకశిరలో మాదిగలు నిర్వహించిన సింహగర్జన సమైక్య ర్యాలీలో ఎమ్మెల్యే సుధాకర్‌ను రాజీనామా చేయాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది సామూహిక సెలవుపై వెళ్లారు. చంద్రగిరి మండల ప్రజలు రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. నెల్లూరులో కేసీఆర్‌ను వలవేసి పట్టుకున్నట్లుగా వినూత్న నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో ఉపాధ్యాయుల దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే సత్యవతిని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఎమ్మెల్యే అనడంతో గందరగోళం నెలకొంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉపాధ్యాయులు రోడ్లపైనే గురుపూజోత్సవాన్ని జరుపుకుని నిరసన తెలిపారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపైనే విద్యార్థులు భోజనాలు చేయగా, బద్వేలు పట్టణంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే చండీయాగం చేపట్టారు. విశాఖలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించారు. కె.కోటపాడు విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కర్నూలులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ర్ట మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఊరేగించారు. విజయవాడలో సీమాంధ్ర కాలేజీ యాజమాన్యాల జేఏసీ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో రోడ్ల దిగ్బంధన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కిలోమీటరుకు పైగా టెంట్లువేసి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘గురువుల మహాదీక్ష’ చేపట్టారు. పాలకొల్లులో మునిసిపల్ ఉద్యోగులు ‘సమైక్యాంధ్ర నగర సంకీర్తన’ చేపట్టారు. గోదావరి డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి ధవళేశ్వరం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించిన రైతులు కాటన్బ్యారేజీని ముట్టడించారు. ఇన్నీసుపేటలో విద్యార్థులు రోడ్డుపైనే గురుపూజోత్సవం నిర్వహించి, అధ్యాపకులను సన్మానించారు. 23 రకాల పప్పుధాన్యాలతో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని అంగన్వాడీ వర్కర్లు రూపొందించారు. 48గంటల కోనసీమ బంద్ తొలిరోజు విజయవంతమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గోవులతో నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మేకలు, గొర్రెలతో భారీర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా శుక్రవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు విద్యుత్ ఉద్యోగులు కాకినాడలో ప్రకటించారు. అలాగే, 6,200 మంది ఈపీడీసీఎల్ ఉద్యోగులు గురువారం సామూహిక సెలవు పెట్టి విధులను బహిష్కరించారు. తెర్లాంలో 500 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణారంగారావు పాల్గొన్నారు. మరో ఆరుగురు మృతి రాష్ట్ర విభజన నిర్ణయంపై కలతతో భావోద్వేగానికి గురైన ఐదుగురు గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు, గతనెల 4న ఆత్మహత్యకు యత్నించిన సారెడ్డి రామాంజుల రెడ్డి (35) గురువారం మృతి చెందాడు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పొల్గొంటున్న ఇతను ఆ రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సీఎం రాజీనామా చేయాలి తిరుపతి: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రులు, సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో గురువారం సీమాంధ్ర విశ్వ విద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎంతో సహా ఇతర మంత్రులు ఈ నెల 11లోగా రాజీనామాలు చేసి తమతో కలసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే 12నుంచి వారి నివాసాల వద్ద రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రమంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేయూలని, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులపై అక్రమ కేసులను ఎత్తివేయూలని డిమాండ్ చేవారు. ఈ సమావేశం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు హరికృష్ణయూదవ్, కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో జరిగింది. సమైక్య ‘సాగర ఘోష’ సీమాంధ్రలో గళమెత్తిన లక్షలాది జనం సాక్షి, నెట్వర్క్ : జై సమైక్యాంధ్ర అంటూ లక్షలాది గొంతుకలు గళమెత్తాయి. గురువారం కాకినాడలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ సమైక్య సాగర ఘోష నిర్వహించారు. పార్టీ రహితంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలతో కాకినాడ జనసాగరమైంది. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ సమైక్యాంధ్ర పాటలతో ప్రజలను ఉత్తేజపర్చారు. దేశ నాయకుల వేషధారణతో పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రొద్దుటూరు పొలికేక’కు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగ పండు ఉష ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి విశాలాంధ్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమైక్య సింహగర్జన జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం హాజరై సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన లక్షగళ గర్జనతో రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్ష జనగళ ఘోష, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లక్ష గళార్చన శంఖారావం, చిత్తూరు జిల్లా పీలేరులో విద్యార్థి సమైక్య సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో సింహగర్జన జరిగింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో సర్వేపల్లి జయంతి
సాక్షి, హైదరాబాద్: గురుపూజోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డి.ఎ. సోమయాజులు, పి.ఎన్.వి. ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, కె. శివకుమార్, డా.ప్రపుల్లారెడ్డి పాల్గొన్నారు.