లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఓటమి
పాట్నా: లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఓటమి పాలయ్యారు. బీహార్లోని సాసరన్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేది పాశ్వాన్ చేతిలో 61 వేల ఓట్ల మెజారిటీతో పరాజయం పాలయ్యారు.
జేడీ(యూ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పాశ్వాన్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేశారు. సాసరన్ నియోజకవర్గం నుంచి 2004, 2009లో మీరాకుమార్ గెలుపొందారు.