Satilaits
-
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44 రాకెట్
-
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44
శ్రీహరికోట (సూళ్లూరుపేట)/ టీ.నగర్ (చెన్నై): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ– సీ 44 (పీఎస్ఎల్వీ– డీఎల్) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం కొత్త పథకం రూపొందించామన్నారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో జిల్లాకు ముగ్గురిని ఎంపికచేసి అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ అందిస్తామన్నారు. -
శ్రీహరికోటకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహం
సాక్షి, నెల్లూరు : ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1 (ఐఆర్ఎన్ఎస్ఎస్-1) ఉపగ్రహాన్ని జిల్లాలోని శ్రీహరికోటకు తరలించారు. శుక్రవారం ఉదయం భారీ భద్రత మద్య ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి తరలించారు. వచ్చే నెల 12న పీఎస్ఎల్వీ సీ-41 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. -
ఆ ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ప్రయోగించనున్న 104 ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు. ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.28కు నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్‌ను 14న ఉదయం 5.48కు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,500 కిలోల బరువున్న 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 650 కిలోల బరువున్న కార్టోశాట్–2డీ, 30 కిలోల బరువున్న ఇస్రో నానో శాటిలైట్స్(ఐఎన్ఎస్–1ఏ,1బీ) స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 820 కిలోలున్న 101 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.