satyagraha yatra
-
అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర ఆగబోదు
కాకినాడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కాపుల సత్యాగ్రహ యాత్రకు ఆంక్షలు విధించడం ఎంత మాత్రం సరైంది కాదని, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు నిరసించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం శశికాంత్నగర్లోని శుభమ్ కాపు కళ్యాణమండపంలో జరిగిన జిల్లా కాపుసద్భావన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల హామీ అమలు కోసం ఈనెల 25న రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్ర కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం సారథ్యంలో జరుగుతుందన్నారు. పోలీసులు బందోబస్తుతో ముద్రగడ పాదయాత్ర శాంతియుతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చినా పలు ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కోసం కోరుతుంటే ఉపముఖ్యమంత్రితో సహా మంత్రులందరితో తమ నాయకుడిపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్క మంత్రికీ లేదని, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజం రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు కోడిపందాలు, పేకాట, గుండాట వంటి వాటిని దర్జాగా ఆడుకునేలా చేశారని, అటువంటి వాటికే పర్మిషన్ లేనప్పుడు శాంతియుతంగా పాదయాత్ర చేసుకునేందుకు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. ఏదేమైనా ఈనె 25న ముద్రగడ సారథ్యంలో సత్యాగ్రహపాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో కాపు ప్రతినిధులు బస్వా ప్రభాకరరావు, యాళ్ల శ్రీనివాసరావు, రంకిరెడ్డి దుర్గారావు, కర్రి చక్రధర్, కొప్పిశెట్టి శ్రీను, సిద్దు నూకరాజు పాల్గొన్నారు. -
ముద్రగడ యాత్ర నేపథ్యంలో 'తూర్పు'లో ఆంక్షలు
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 144, 30 సెక్షన్లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. గతంలో జరిగిన ఘటనలతో పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన చెప్పారు. కాగా బుధవారం నుంచి ముద్రగడ సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ అయిదురోజుల పాటు ఆయన యాత్ర చేయనున్నారు. అయితే యాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ స్వస్థలం కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పాదయాత్రకు భద్రత, అనుమతిపై నిర్ణయం వెల్లడించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్ననికి వాయిదా వేసింది. -
‘బాబు’ది రావణాసుర పాలన : ముద్రగడ
ఆరు నూరైనా ముహూర్తానికే సత్యాగ్రహ యాత్ర సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో రావణాసుర పాలన సాగిస్తున్న చంద్రబాబు.. కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కాపు జాతి ఏనాడూ దేహీ అనలేదన్నారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా కాపు సత్యాగ్రహ యాత్ర చేపట్టడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ యాత్ర విషయమై తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు జేఏసీ నేతలతో ముద్రగడ ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అంతర్జాతీయ తీవ్రవాదిగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావులపాలెంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటలకు సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభింస్తున్నట్లు ముద్రగడ ప్రకటించారు. గ్రామాల్లో పోలీసులను మోహరించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు. -
ఈనెల 16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర