ఇట్లు ప్రేమతో...
జో దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘యువర్స్ లవింగ్లీ’. కథనాయకుడు పృథ్వీ పొట్లూరి నిర్మిస్తున్నారు. సౌమ్యా శెట్టి కథానాయిక. కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకుడు.
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను తాండ్ర పాపారాయ విద్యాసంస్థల అధినేత తుమ్మల భాస్కరరావు, బొబ్బిలి పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి అచ్చుతవల్లి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తుమ్మల దంపతుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉంది. పృథ్వీ పొట్లూరికి మంచి భవిష్యత్ ఉంటుంది. మొదటి సినిమా అయినా బాగా నటించాడు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు.