ముద్దుకు ఓకే అన్నాడు!
హీరో, హీరోయిన్ తెరపై రొమాన్స్ పండిస్తుంటే చూసేవాళ్లకి కనువిందుగా ఉంటుంది. ముఖ్యంగా కుర్రకారు ఇలాంటి సన్నివేశాలకు జై కొడతారు. త్వరలో విడుదల కానున్న ‘కి అండ్ కా’ అనే హిందీ చిత్రంలో అలాంటి కమనీయ దృశ్యం ఒకటుంది. విశేషం ఏంటంటే.. సయీఫ్ అలీఖాన్‌తో పెళ్లయ్యాక కరీనా కపూర్ పెదవి ముద్దు సన్నివేశంలో నటించిన చిత్రం ఇదే. సయీఫ్ను పెళ్లాడాక ‘ఇక ముద్దు సీన్స్‌లో నటించకూడదు అనుకుంటున్నా’ అని స్టేట్మెంట్ ఇచ్చిన కరీనా ఈ సినిమా కోసం తన నిర్ణయం మార్చుకున్నారు. ‘కి అండ్ కా’లో అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ చేసేశారు. దీని గురించి కరీనా మాట్లాడుతూ- ‘‘పెళ్లయిన కొత్తలో ఉండే భావోద్వేగాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ అవి పాత పడి పోతాయి.
ఇంకాస్త అప్డేటెడ్గా, మరింత మెచ్యూర్డ్‌గా ఉండా లనుకుంటాం. అలా అనుకుని తీసుకున్న నిర్ణయంలో భాగం గానే నేనీ ముద్దు సీన్లో నటించాను. స్క్రిప్ట్‌లో మన క్యారెక్టర్ని ఫాలో కావాలి తప్పితే ‘అది చేయను... ఇది చేయను’ అనకూడదని నా అభిప్రాయం. ఈ చిత్రం ఓ భార్యా భర్తల మధ్య సాగుతుంది కాబట్టి ముద్దు సీన్లుంటాయని సయీఫ్కూ తెలుసు. అందుకే ఈ సీన్ చేయడానికి ఓకే అన్నాడు. దర్శకుడు చెప్పింది చేయాలని తనే చెబుతుంటాడు. ఆలాగే సయీఫ్ ఎవరితోనైనా లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తే నాకు అభ్యంతరం లేదు’’ అని చెప్పారు.