scheme suspended
-
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన. -
ల్యాప్‌టాప్ పథకానికి మంగళం!!
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకానికి మంగళం పాడేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ. 2.75 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఈ పథకానికి కొత్త ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే, ఈ పథకానికి అఖిలేష్ మంగళం పాడేసినట్లే అర్థమవుతోంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ పుస్తకాలు, ఈ లెర్నింగ్ మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని అఖిలేష్ మీడియాతో అన్నారు. ల్యాప్‌టాప్‌ల పథకంతో పాటు బాలికలకు స్కాలర్షిప్ ఇచ్చే 'కన్యా విద్యా దాన్', నిరుద్యోగ భృతి లాంటి పథకాలకు కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు. ఎన్నికల్లో ఈ పథకాలు అమలుచేస్తామంటూ తాము హామీ ఇచ్చినా.. ఇవి ఓట్లు రాల్చడంలేదన్న ఆలోచనలో సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 సీట్లకు గాను కేవలం ఐదింటిని మాత్రమే సమాజ్‌వాదీ గెలుచుకోగలిగింది. బీజేపీ ఇక్కడ భారీ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఏకంగా 12400 కోట్లను యూపీ సర్కారు కేటాయించింది.