ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ల్యాప్టాప్ల పథకానికి మంగళం పాడేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ. 2.75 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఈ పథకానికి కొత్త ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే, ఈ పథకానికి అఖిలేష్ మంగళం పాడేసినట్లే అర్థమవుతోంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ పుస్తకాలు, ఈ లెర్నింగ్ మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని అఖిలేష్ మీడియాతో అన్నారు. ల్యాప్టాప్ల పథకంతో పాటు బాలికలకు స్కాలర్షిప్ ఇచ్చే 'కన్యా విద్యా దాన్', నిరుద్యోగ భృతి లాంటి పథకాలకు కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు.
ఎన్నికల్లో ఈ పథకాలు అమలుచేస్తామంటూ తాము హామీ ఇచ్చినా.. ఇవి ఓట్లు రాల్చడంలేదన్న ఆలోచనలో సమాజ్వాదీ పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 సీట్లకు గాను కేవలం ఐదింటిని మాత్రమే సమాజ్వాదీ గెలుచుకోగలిగింది. బీజేపీ ఇక్కడ భారీ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఏకంగా 12400 కోట్లను యూపీ సర్కారు కేటాయించింది.
ల్యాప్టాప్ పథకానికి మంగళం!!
Published Fri, Jun 20 2014 3:57 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement
Advertisement