free laptops
-
ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రుణ మాఫీ
► విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై ► రాజ్యాంగ పరిధిలో రామ మందిర నిర్మాణం ► యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ వరాల జల్లు లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికీ వరాల జల్లు కురిపించింది. యువత, రైతులే లక్ష్యంగా ఉచిత నజరానాలతో పాటు వివాదాస్పద రామ మందిర నిర్మాణం, త్రిపుల్ తలాక్ వంటి అంశాలనూ చేర్చింది. యూపీలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ పరిధులకు లోబడి రామ మందిరాన్ని నిర్మిస్తామని, త్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల అభిప్రాయాలు సేకరించి.. వాటిని సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు వన్ జీబీ డేటా, భారీ స్థాయిలో ఉద్యోగాలు... రైతులకు పంట రుణాల మాఫీ, 24 గంటల విద్యుత్ అందిస్తామంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామంది. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ మేనిఫెస్టో... ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర్’ను విడుదల చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల ఎస్పీ, బీఎస్పీ పాలనలో యూపీ అన్నింటా వెనుకపడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అమిత్‌షా చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో 403 స్థానాలకు జరగనున్నాయి. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు... ♦ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు 1జీబీ డేటా ♦ అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై... ♦ ‘అహల్యాబాయి విద్యా పథకం’ కింద రాష్ట్రంలోని బాలికలందరికీ డిగ్రీ వరకు ఉచిత విద్య ♦ అలాగే బాలురకు 12వతరగతి వరకు ఉచిత విద్య ♦ దళిత నాయకుడు అంబేడ్కర్, ఓబీసీ నాయకుడు అహల్యాబాయి హోల్కర్ల పేరిట ఎస్సీ, ఓబీసీలకు స్కాలర్షిప్లు ♦ 90 శాతం ఉద్యోగాలు యువతకు ♦ ఐదేళ్లలో అన్ని ఇళ్లకూ గ్యాస్ కనెక్షన్ .. నగరాల్లో గ్యాస్ పైప్‌లైన్ ♦ చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాల మాఫీతోపాటు ఇకపై వడ్డీలేని రుణాలు. – రాష్ట్రంలో 24/7 విద్యుత్ సరఫరా... పేదలకు చౌక ధరకే విద్యుత్ ♦ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ పార్కులు ♦ క్లాస్–3, 4 ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకుఇంటర్వూ్యలు లేకుండా మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ ♦ అక్రమంగా నడుస్తున్న జంతువధ శాలల తొలగింపు ♦ కాల్ చేసిన 15 నిమిషాల లోపే పోలీసులు ఘటనా స్థలికి చేరేలా డయల్ 100 సేవలు మరింత మెరుగు ♦ కళాశాలల్లో ఈవ్‌టీజింగ్ నుంచి బాలికలను రక్షించేందుకు ‘యాంటీ–రోమియో స్క్వాడ్’. దీంతో పాటు ముగ్గురు మహిళల చొప్పున బెటాలియన్లు. ♦ పేదింట పుట్టిన ప్రతి ఆడ పిల్లకు రూ.5 వేలు ♦ భూ, గనుల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళం -
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచిత ల్యాపీలు
పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ.. ఇలా ఏ బోర్డులో చదివినా ప్రతిభావంతులైన 39,600 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ల్యాప్‌టాప్‌లలో సగం పదోతరగతి పాసైన వాళ్లకు, మరో సగం ఇంటర్ పాసైనవాళ్లకు ఇస్తారు. ఆయా బోర్డుల్లో వాళ్లు సాధించిన ఫలితాలను బట్టి వీటిని అందిస్తారు. అయితే ఇందులో 21 శాతం ఎస్సీ, ఎస్టీలకు, 20 శాతం మైనారిటీలకు ఇచ్చే కోటా కూడా కొనసాగుతుంది. 2012 ఎన్నికల మేనిఫెస్టోలోనే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను ఉచితంగా ఇస్తామన్న హామీని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 15 లక్షల ల్యాప్‌టాప్‌లను అందించినా, ట్యాబ్‌ల జాడ మాత్రం ఎక్కడా లేదు. అలాగే 2012 తర్వాత మళ్లీ ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం కూడా మళ్లీ ఇప్పుడే. -
ఆన్లైన్లో అమ్మకానికి అఖిలేష్ ల్యాప్‌టాప్‌లు
ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన ఉచిత ల్యాప్‌టాప్‌లు ఆన్లైన్లో అమ్మకానికి వెళ్తున్నాయి. మొరాదాబాద్‌లో ఓ టీచర్ ఇలా వచ్చిన ఉచిత ల్యాప్‌టాప్‌ను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి దొరికిపోయారు. ఆవిడ 14వేల రూపాయలకు దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ అసలు ప్రభుత్వం వీటిని ఇచ్చింది విద్యార్థులు, విద్యార్థినులకు అయితే.. టీచర్ చేతికి ఎలా వచ్చిందని ఆరా తీస్తే.. ఓ విద్యార్థిని తండ్రా ఆ ల్యాప్‌టాప్‌ను సదరు టీచర్‌కు అమ్మాడట. 'ములాయం వాలా ల్యాప్‌టాప్ ఔర్ సాథ్‌మే నెట్ సెట్టర్, న్యూ కీబోర్డ్, మౌస్' అనే డిస్క్రిప్షన్‌తో ఆమె ఆ యాడ్ పెట్టారు. తాను బీఎస్సీ మ్యాథ్స్, బీఈడీ చేశానని, ప్రభుత్వోద్యోగం ఉన్నా కూడా డబ్బులు చాలక దీన్ని అమ్ముతున్నానని ఆమె చెప్పారు. 2012 సంవత్సరంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 10 నుంచి 12వ తరగతి వరకు చదివిన పిల్లలకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కానీ చాలామంది వాటిని ఉపయోగించుకోకుండా.. ఇలా చేతులు మార్చుకున్నట్లు మొదట్లోనే కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆన్లైన్ అమ్మకాలు కూడా మొదలు కావడంతో వ్యవహారం బట్టబయలైంది. మొరాదాబాద్ జిల్లాలో ఒక్కోటీ రూ. 19వేల విలువ చేసే 24,143 ల్యాప్‌టాప్‌లను పంచినట్లు జిల్లా స్కూల్స్ ఇన్స్పెక్టర్ శర్వణ్ కుమార్ యాదవ్ తెలిపారు. -
ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ
తిరుత్తణి :తిరుత్తణిలోని ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూలు లో చదువుకొంటున్న విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు సురేష్ అధ్యక్షత వహిం చారు. తిరుత్తణి మున్సిపాలిటీ అధ్యక్షుడు సౌందరరాజన్, ఉపాధ్యక్షుడు మాసిలామణి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పాఠశాల హెచ్ఎం సుబ్బలక్ష్మి అందరినీ ఆహ్వానించి ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా అరక్కోణం పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు హరి పాల్గొని ప్రభుత్వం తరపున విద్యార్థుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 374 మంది ప్లస్‌టూ విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు మునుస్వామి, సుమతి పుష్పరాజ్, నాగూర్ పిచ్చై, సుబ్రహ్మణ్యస్వామి సహకార విక్రయ సంఘ అధ్యక్షుడు అన్భళగన్, పట్టణ అన్నాడీఎంకే నిర్వాహకులు అన్భు, భరత్, ఉషారాణి పాల్గొన్నారు. -
ల్యాప్‌టాప్ పథకానికి మంగళం!!
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకానికి మంగళం పాడేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ. 2.75 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఈ పథకానికి కొత్త ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే, ఈ పథకానికి అఖిలేష్ మంగళం పాడేసినట్లే అర్థమవుతోంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ పుస్తకాలు, ఈ లెర్నింగ్ మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని అఖిలేష్ మీడియాతో అన్నారు. ల్యాప్‌టాప్‌ల పథకంతో పాటు బాలికలకు స్కాలర్షిప్ ఇచ్చే 'కన్యా విద్యా దాన్', నిరుద్యోగ భృతి లాంటి పథకాలకు కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు. ఎన్నికల్లో ఈ పథకాలు అమలుచేస్తామంటూ తాము హామీ ఇచ్చినా.. ఇవి ఓట్లు రాల్చడంలేదన్న ఆలోచనలో సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 సీట్లకు గాను కేవలం ఐదింటిని మాత్రమే సమాజ్‌వాదీ గెలుచుకోగలిగింది. బీజేపీ ఇక్కడ భారీ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఏకంగా 12400 కోట్లను యూపీ సర్కారు కేటాయించింది.