scrapyard
-
పోలీస్‌స్టేషన్‌లో టూ వీలర్ల కుప్పలు : ఆధారాలు చూపిస్తే మీవే!
సోలాపూర్: సోలాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యర్థంగా పడిఉన్న వాహనాలను పక్షంరోజుల్లోగా రుజువులు చూపించి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో వాటిని స్క్రాప్ కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని సోలాపూర్ తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేశ్‌పాండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘స్టేషన్ ఆవరణలో నాలుగు ఫోర్‌వీలర్లు, 67 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి యజమానులు అవసరమైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను గుర్తించి తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే వాటిని పాడుబడిన వాహనాలుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి : ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా! -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది. Photo Courtesy: Mv Werften జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. Photo Courtesy: Mv Werften తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. Photo Courtesy: Mv Werften దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది. చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..! -
గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా..
వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది. జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్ సంస్థ గ్లోబల్ డ్రీమ్ పేరుతో భారీ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో గ్లోబల్ డ్రీమ్ 1 పూర్తిగా సిద్ధం అవగా దాన్ని కంటే పెద్దదిగా గ్లోబల్ డ్రీమ్ 2 నిర్మాణ పనులు గత కొన్నేళ్లుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పడవలో ఏకకాలంలో 9,000ల మంది ప్రయాణించేంత పెద్దగా దీని నిర్మాణం మొదలు పెట్టారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఎక్కడగా వెనక్కి తగ్గలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకున్నారు. కరోనా కాటు షిప్ నిర్మాణం సగం పూర్తైన తర్వాత ప్రపంచాన్ని కరోనా సంక్షోభం చుట్టేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత షిప్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ప్రస్తుతం జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డా ఇంకా జనాల్లో పూర్తిగా కలిసేందుకు జంకుతున్నారు. దీంతో గ్లోబల్ డ్రీమ్ వంటి భారీ క్రూయిజ్షిప్లకు డిమాండ్ అస్సలు లేకుండా పోయింది. దివాళా కరోనాకి ముందు మేం కొంటామంటే మేం కొంటామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత పత్తాలేకుండా మాయం అయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్ సంస్థ దిక్కు తోచని స్థితిలో పడింది. ఓవైపు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్ముడుపోని షిప్ మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి. చివరకు ఒత్తిడి తట్టులోకే తాను దివాళా తీస్తున్నట్టు వెర్ఫ్‌టెన్ కంపెనీ 2022 జనవరిలో ప్రకటించింది. అడ్డుగా డ్రీమ్‌లైనర్ దివాళా ప్రక్రియ మొదలైన తర్వాత వెర్ఫ్‌టెన్‌కి చెందిన నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ నౌకలకు డిమాండ్ పెరిగింది. దీంతో వెర్ఫ్‌టెన్‌కి చెందిన షిప్‌యార్డులో యుద్ధ నౌకలు 2024 నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గ మార్పులు షిప్‌యార్డులో చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అడ్డుగా ఆ షిప్‌యార్డులో అమ్ముడుపోని గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్ షిప్ ఉంది. చివరికి తుక్కే దిక్కు వెర్ఫ్‌టెన్‌కి అప్పులిచ్చిన బ్యాంకులు గ్లోబల్ డ్రీమ్ 2ను వేలం పాటలో వేసినా కొనేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. మరోవైపు యుద్ధ నౌకల కోసం ఈ షిప్‌యార్డులో మార్పులు చేయాల్సి వస్తోంది. దీంతో అమ్ముడుపోని భారీ క్రూయిజ్ షిప్‌ని కనీసం తుక్కుగా అయినా అమ్మేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి బ్యాంకులు. కల్లలైన కలలు వేలకోట్లు పోసి అత్యాధుని సౌకర్యాలతో విలాసవంతంగా తయారైన గ్లోబల్ డ్రీమ్ 2 చివరకు తన కలల ప్రయాణం ప్రారంభించకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోయి తుక్కుగా మారనుంది. చదవండి: స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి.. -
ముంబై: స్క్రాప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై, మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు.. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో ఈ తెల్లవారుజామున ఉన్నట్లుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 6 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది. (చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు) ఇప్పటి వరకు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా, ఎవరు చేస్తున్నారు? Maharashtra: Fire breaks out at a scrapyard in Mankhurd area of Mumbai; six fire engines pressed into action — ANI (@ANI) September 16, 2021 -
నూతన పాలసీ ఎఫెక్టు.. 40 లక్షల వాహనాలు తుక్కేనా?
బెంగళూరు: పాత వాహనాలను తుక్కు చేసేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంతో రాష్ట్రంలో లక్షలాది వాహనాలు గుజరీ దారి పట్టనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 2.46 కోట్ల వాహనాల్లో 40 లక్షలకు పైగా వాహనాలు ఈ జాబితాలోకి వస్తాయి. కొత్త స్క్రాప్ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద మారిస్తే కేంద్రం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. అలా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం చట్టం ఉద్దేశం. 9 లక్షల పెద్ద వాహనాలు 31 లక్షల బైక్‌లు 15 ఏళ్లకు పైబడిన మ్యాక్సిక్యాబ్‌లు, కారు, ఆటోరిక్షా, బస్సు, లారీలతో పాటు 9 లక్షలకు పైగా వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. 20 ఏళ్లు దాటిన 31 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. యజమానులు స్వయంప్రేరితంగా గుజరికి వేసేయవచ్చు. లేదా మూడు సార్లు ఫిట్నెస్ పరీక్ష విఫలమైతే రవాణా శాఖ వాటిని స్క్రాప్‌కి తరలిస్తుంది. ఒకవేళ ఎప్సీ పరీక్షలో పాసైనప్పటికీ గ్రీన్ ట్యాక్స్ చెల్లించడం యజమానికి ఆర్థిక భారమే. వ్యాపారులు, మెకానిక్‌లలో భయం ఈ చట్టంతో పాత కార్లు, లారీలు కలిగి ఉన్న వారిలో భయం నెలకొంది. పాత కార్ల వ్యాపారుల్లోనూ గుబులు ఏర్పడింది. లక్షలు పెట్టి కార్లు కొనలేనివారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారు తక్కువ ధరతో పాత కార్లను కొని మోజుతీర్చుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం పడిపోయే ప్రమాదం ఉందని ఓ పాత కార్ల వ్యాపారి మధు తెలిపారు. పాత వాహనాలను నమ్ముకుని గ్యారేజ్‌లు నిర్వహిస్తున్న మెకానిక్‌లు జీవనానికి కొత్త చట్టంతో ఇబ్బందులే అన్నారు. అన్ని పాత వాహనాల్నీ గుజరీకి తరలిస్తే రిపేరి పనులు తగ్గిపోతాయని మెకానిక్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చట్టం వల్ల తమ కుటుంబాలు వీధిపాలవుతాయని లారీ యజమానుల సంఘాల ఒక్కోట అధ్యక్షుడు బి.చెన్నారెడ్డి అన్నారు. 10–11 ఏళ్లు దాటిన పాత లారీలు స్థానికంగా తిరుగుతూ ఎంతోకొంత ఉపాధినిస్తుంటాయి. అలాంటి లారీల యజమానులకు ఏమీ పాలు పోవడం లేదని అన్నారు. -
చెత్త డబ్బాలో చిన్నారి
వేలూరు: జోలార్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓంశక్తి ఆలయం వద్దనున్న మున్సిపల్ చెత్త బాక్సులో 11 నెలల చిన్నారి ఉండడాన్ని గమనించిన స్థానికులు అవాక్కయ్యారు. చిన్నారి కేకలు విన్న స్థానికులు చెత్త బాక్సులో చూడగా చీమలు కరుస్తున్న స్థితిలో చిన్నారి కనిపించింది. చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు జోలార్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నారి ఆలంగాయం సమీపంలోని పూంగులం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆనందన్ ప్రియ దంపతుల కుమార్తె కిర్తిక అని తెలిసింది. ప్రియ రెండు రోజుల క్రితం చిన్నారితో ఇంటి నుంచి మాయమైంది. దీనిపై ప్రియ తండ్రి మురుగన్ ఆలంగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ప్రియ, చిన్నారి ఫొటోను పోలీసుల వద్ద ఇచ్చాడు. ఈ ఫొటో ద్వారా చిన్నారి కిర్తికను పోలీసులు గుర్తించారు. ప్రియ చిన్నారిని చెత్త బాక్సులో ఎందుకు వేసి వెళ్లింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సాయంత్రాల్లోనూ చెత్త తొలగింపు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ్లల్లోనూ చెత్త తొలగించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో పలు అంశాలపై జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగా సాయంత్రాల్లోనూ చెత్త తరలింపునకు ఎన్ని అదనపు వాహనాలు అవసరమో అధ్యయనం చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5న నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితహారం, ఇంకుడు గుంతల తవ్వకం, ప్లాస్టిక్ నిషేధం అనే మూడు ప్రత్యేక అంశాలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరిగిందని, ఈ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరంలోని 150 వార్డుల్లో ప్రతి వార్డులోనూ కనీసం రెండు లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ప్రకటించారు. ఇందుకుగాను ప్రతి వార్డులో రోడ్ల విస్తీర్ణం, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల వివరాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, మొక్కల పంపిణీ వివరాల ప్రణాళికలతో కూడిన ప్రత్యేక బుక్లెట్లను రూపొందించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని మెట్రో వాటర్ వర్క్స్‌కు చెందిన అన్ని కార్యాలయాలు, వాటర్ ట్యాంక్‌ల ప్రదేశాల్లో నర్సరీల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సాహెబ్ నగర్‌లోని మెట్రో బోర్డు కార్యాలయంలో దాదాపు 40 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉందని, ఇదే విధమైన మెట్రో కార్యాలయాల ఖాళీ స్థలాల్లో వెంటనే నర్సరీల పెంపునకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ మొదటి లేదా రెండో వారం నుంచి నగరంలో సెల్లార్ల తవ్వకం పై నిషేధం విధించే అవకాశం ఉందన్నారు. నగరంలో గుర్తించిన పురాతన, శిథిల భవనాల కూల్చివేతపై సంబంధిత యజమానులకు తిరిగి నోటీసులు జారీ చేయాలన్నారు. నగరంలో రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా పునర్నిర్మించేందుకు చేపట్టిన పనుల్లో 6వేల మ్యాన్‌హోళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఆస్తిపన్ను సేకరణలో భాగంగా రూ. 1200 నుండి రూ.లక్ష లోపు ఆస్తిపన్ను చెల్లించే భవనాలను రీ–అసెస్మెంట్ చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు నానో మానిటరింగ్ వాహనాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. వివిధ అంశాలపై నగరవాసుల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిపై తాను ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జోనల్ కమిషనర్లతో నేరుగా సమావేశాలు నిర్వహించేందుకుగాను వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి కాటా, శృతిఓజా, అద్వైత్‌కుమార్‌సింగ్ సందీప్‌జా, సిక్తాపట్నాయక్, జయరాజ్ కెనెడి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, చీఫ్ ఇంజినీర్లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై చెత్త పడేస్తే శిక్షార్హులు
గార్డెన్ సిటీ గార్బేజ్ సిటీగా మారుతుండడంతో హైకోర్టు కొరడా ఝలిపించింది. చెత్త సమస్యను మీరు పరిష్కరిస్తారా?, మేం రంగంలోకి దిగాలా? అని అక్షింతలు వేయడంతో నగర పాలికెలో చలనమొచ్చింది. నగరంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేసేవారిపై నిఘా వేసి జరిమానాలు విధిస్తోంది. నెలరోజుల్లోనే భారీగా పట్టుబడడంతో సత్ఫలితాలను ఇస్తున్నట్లే ఉంది. కర్ణాటక , బనశంకరి: ఉద్యాననగరిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తే చుట్టుపక్కల ప్రజలు ఏమీ అనలేకపోవచ్చు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్స్ మాత్రం చూస్తూ ఉరుకోరు. అలా చెత్త పడేసేవారిపై ఒక నెల వ్యవధిలో 2,965 కేసులు నమోదు చేశారు. చెత్త నిర్వహణ లోపాలపై హైకోర్టు బీబీఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాలికె మేలుకుంది. సుమారు 40 మంది మార్షల్స్ ను నియమించడంతో రాత్రి సమయాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే వారిని గుర్తించి 2,965 కేసులు నమోదు చేసి అక్కడే వారిపై జరిమానా విధించారు. చెత్త వాహనాల్లో వేయరెందుకు రోజూ ఉదయం వేళ ఇళ్ల వద్దకు వచ్చే పాలికె చెత్త వాహనాల్లో చెత్త వేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. అంతేగాక చెత్త వాహనం కోసం వేచిచూడటం కంటే రాత్రి సమయంలో రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్త బ్యాగ్‌లు పడేయడం సులభమని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్ అలాంటివారు కనిపిస్తే జరిమానా విధిస్తారు. మార్షల్స్‌కు పట్టుబడిన వారు ఇకపై రోడ్లపై చెత్త వేయబోమని అంటున్నారు. ఒక నెల అవధిలో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం విశేషం. ఎవరెవరు దొరికారు బీబీఎంపీ మార్షల్స్ ఆచూకీ కనిపెట్టిన 2,965 కేసుల్లో 1,023 మంది బైక్‌లు, స్కూటర్లలో చెత్త తీసుకువచ్చి పడేసి వెళ్లేవారు. 128 మంది ఆటోరిక్షాల్లో , 71 మంది వివిధ మోటారు వాహనాల్లో , 22 మంది ట్రక్కుల్లో, 33 మంది ట్రాక్టర్లులో, 1,688 మంది నడచి వెళ్లి చెత్తపడేసినిట్లు తేలింది. చిన్నపాటి బ్యాగుల్లో మాత్రమే కాకుండా ట్రాక్టర్లు, ట్రక్కుల్లో తెచ్చి అక్రమంగా చెత్త పడేస్తుండటంతో నగరంలో ఎటుచూసినా చెత్త రాశులు కనిపిస్తున్నాయి. మార్షల్స్ సంఖ్య పెంచాలి బెంగళూరులో కేవలం 40 మంది మార్షల్స్‌తో చెత్త వేసే వారిని అడ్డుకట్టవేయడం కుదరదని, ఇంకా 240 మంది మార్షల్స్ నియమించుకోవడానికి నిధులు అందించాలని బీబీఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ప్రతి మార్షల్‌కు నెలకు రూ.18,525, మరో 8 మంది జూనియర్ అధికారులకు రూ.40 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. వీటిన్నింటిని కలిపితే ఏడాదికి రూ.8.48 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. చెత్త పడేసివెళ్లే వారిపై జరిమానా రూపంలో వసూలు చేసిన దానిలో మార్షల్స్ కు 5 శాతం ప్రోత్సాహక ధనం అందించాలని తీర్మానించారు. జరిమానాలు పెంపు? ♦ ప్రస్తుతం చెత్త పడేస్తున్న వారిపై కనీసం రూ.500 జరిమానా విధిస్తున్నారు. జరిమానా పెంచితే సమస్య తగ్గుముఖం పడుతుందని బీబీఎంపీ అభిప్రాయపడింది. ♦ చెత్త పడేసే వారిపై రూ.1,000 నుంచి రూ.25 వేలు వరకు జరిమానా విధించాలని బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ♦ ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.500, తడి–పొడి చెత్త విభజన చేయనివారిపై రూ.1,000, కట్టడ శిథిలాలు పడేసేవారిపై రూ.25 వేలు చొప్పున జరిమానా విధించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి బీబీఎంపీ కోరింది. -
అరటి ఆకులు.. ఆపండి
కర్ణాటక, బనశంకరి: బెంగళూరులో చెత్త సమస్య పరిష్కారానికి చరమగీతం పాడటానికి కొత్త, కొత్త ఆలోచనలు చేస్తున్న బీబీఎంపీ దృష్టి అరటి ఆకులపై పడింది. కళ్యాణ మంటపాలు, సభలు– సమావేశాలు, వేడుకల్లో టిఫిన్లు, భోజనాలకు అరటి ఆకులను వాడరాదని సూచిస్తోంది. వాటికి బదులు స్టీల్‌ప్లేట్లను ఉపయోగించాలని నిర్వాహకులను కోరుతోంది. అరటి ఆకులతో చెత్త సమస్య ఏర్పడుతోందని పాలికె భావిస్తుండడమే దీనికి కారణం. సమస్యలు వస్తున్నాయని.. ఇటీవలి కాలంలో కాగితం లేదా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను వేడుకల్లో అధికంగా వినియోగిస్తున్నారు. ఆ తరువాత గుట్టలుగా పేరుకుపోతున్న ఈ చెత్తను తరలించడం, ప్రాసెస్ చేయడం ఎంతో కష్టంగా ఉందని పాలికె చెబుతోంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు కుళ్లిపోకపోగా, వర్షం నీటిలో కొట్టుకుపోయి డ్రైనేజీ కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు కాలువలు పొంగి నీరు రోడ్లు, ఇళ్లలోకి చొరబడటానికి ఇదొక కారణమని తెలుస్తోంది. ఇక బీబీఎంపీ గ్యాస్ ఉత్పాదన కేంద్రాల్లో వాడేసిన అరటి ఆకుల ప్రాసెసింగ్ సవాల్‌గా మారుతుంది. అరటి ఆకులను సేకరించడం, తరలించడం కూడా కష్టంగానే ఉండడంతో బీబీఎంపీ వాటిపై నిషేధానికి మొగ్గుచూపుతోందని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. కానీకొన్ని ప్రాంతాల్లో కాగితం ప్లేట్లు, గ్లాసులు వినియోగిస్తుండగా అనేక ప్రాంతాల్లో అరటి ఆకులను వాడుతున్నారు. పాలికెతీరుపై తీవ్ర అభ్యంతరాలు అందరూ ఇష్టపడే అరటి ఆకులపై పాలికె ఆంక్షల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది. స్టీల్‌ప్లేట్లను కడగడానికి అధికనీటి వాడకం, ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. అంత పెద్ద సంఖ్యలో ప్లేట్లు లభించవని కూడా అంటున్నారు. మొత్తం మీద పాలికె సూచన విచిత్రంగా ఉందని హోటల్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలికె అధికారులు ఏమంటున్నారు దీనిపై పాలికె అధికారి మాట్లాడుతూ.. చెత్త సంస్కరణ కేంద్రాలకు, గ్యాస్ ఉత్పాదన కేంద్రాల్లో అరటి ఆకుల సంస్కరణ కష్టతరమైన నేపథ్యంలో వాటిని తక్కువగా వినియోగించాలని తెలిపామన్నారు. కానీ కచ్చితంగా నిషేధించాలని చెప్పలేదని, కొన్ని సంస్థలు స్టీల్‌ప్లేట్లను రాయితీ ధరలో అద్దెకు ఇస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళ్యాణ మంటపాల్లో పెద్ద ఎత్తున అరటి ఆకులు వినియోగిస్తుండటంతో చెత్త అధికంగా పోగవుతుంది. దీంతో హోటల్స్, కళ్యాణ మంటపాలకు స్టీల్‌పాత్రలు వినియోగించాలని కోరినట్లు బీబీఎంపీ పొడిచెత్త విభాగం జాయింట్ కమిషనర్ సర్ఫరాజ్‌ఖాన్ తెలిపారు. -
భోపాల్‌లో స్క్రాప్ గోడౌన్లో అగ్నిప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్‌లోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా పక్కనున్న 4 ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 35 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలచిపోయింది. ఈ నేపథ్యంలో మంటలను ఆర్పేందుకు కూడా నీళ్లు లేక... ఫైర్ సిబ్బంది వచ్చే వరకూ స్థానికులు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గోడౌన్లో మొదలైన మంటలు క్రమంగా ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఇవన్నీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారయ్యే కర్మాగారాలే. ఘటనలో పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.