search engines
-
గూగుల్‌లో ఈ 3 విషయాలు వెతకొద్దు.. సెర్చ్ చేశారంటే జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం డిజిటల్ మయమైంది. అదీ ఇదీ అని కాకుండా ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తాం. గూగుల్, యూట్యూబ్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ బింగ్, బైడూ, యాండెక్స్ వంటి సెర్చ్ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్ తల్లివైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! కాలం మారింది.. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అవేంటో చూద్దాం! 1. చైల్డ్ పోర్నోగ్రఫీ చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త! చదవండి👉🏼 గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు.. 2. బాంబుల తయారీ బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 3. అబార్షన్ అబార్షన్ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. చదవండి👉🏻 చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి -
యాహూ మరోసారి అమ్మకం...! డీల్ విలువ ఎంతో తెలుసా..!
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ మరోసారి చేతులు మారుతున్నాయి. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ వీటిని అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండనున్నట్లు అంచనా మార్కెటు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాహూ, ఏవోఎల్‌తో కూడిన వెరిజోన్ మీడియాను 5 బిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నట్లు వెరిజోన్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం వెరిజోన్‌కి 4.25 బిలియన్ డాలర్లు నగదు రూపంలోను, మిగతాది మైనారిటీ వాటాల రూపంలో లభించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూ వెలుగొందిన సంగతి తెలిసిందే. అలాగే ఏవోఎల్ పోర్టల్ కూడా యూజర్లను ఆకర్షించింది. గూగుల్ తదితర టెక్ దిగ్గజాల ప్రాచుర్యం పెరిగే కొద్దీ వీటి ప్రభావం తగ్గిపోయింది. మొబైల్ మార్కెట్లోకి వేగంగా విస్తరించవచ్చనే ఉద్దేశంతో 2015లో ఏవోఎల్‌ను 4 బిలియన్ డాలర్లు వెచ్చించి వెరిజోన్ కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అంతకు మించి వెచ్చించి యాహూను దక్కించుకుంది. అయితే, వేగంగా వృద్ధి చెందిన గూగుల్, ఫేస్బుక్ సంస్థలు.. వెరిజోన్ ఆశలపై నీళ్లు జల్లాయి. తాను ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో వీటిపై చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను వెంటనే నిలుపివేయగా చేసిన వెరిజోన్.. తాజాగా అమ్మేయాలని నిర్ణయించుకుంది. చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్ గేట్స్ -
గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని?
తాము ఎంత చెప్పినా పట్టించుకోకుండా సెక్స్ సెలెక్షన్, అబార్షన్లకు సంబంధించిన ప్రకటనలను పెడతారా అంటూ ప్రముఖ సెర్చింజన్లు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్లపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇలాంటి ప్రకటనల ద్వారా సెర్చింజన్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు, సెర్చింజన్ల ప్రతినిధులతో పది రోజుల్లోగా సమావేశం ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాళ్లు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా, వాటిని బ్లాక్ చేయడానికి ఏమీ చేయలేకపోతున్నామని, ఇలాంటి ప్రకటనలను ఆపి తీరాల్సిందేనని ధర్మాసనం చెప్పింది. ఇలాంటి అక్రమ ప్రకటనలను బ్లాక్ చేయడానికి ఏం చేస్తారో ఈనెల 25లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి తెలిపింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను తాము ఇవ్వడం లేదని సెర్చింజన్ల తరఫున హాజరైన న్యాయవాదులు చెప్పారు. అయితే వారి వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. -
తెలంగాణలో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం!
ఇంటర్నెట్ లో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా బూతు వైబ్‌సైట్ లను బంద్ చేయాలని సర్కారు యోచిస్తోంది. దాదాపు 1,350 అశ్లీల వెబ్సైట్లను మూసివేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలంగాణ పోలీసు వ్యవస్థలోని ఐటీ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పెద్దలు మాత్రమే వీక్షించే చిత్రాలు ఇకపై తెలంగాణ ఇంటర్నెట్ వినియోగదారులు అందుబాటులో ఉండవన్నారు. బూతు బొమ్మల వెబ్సైట్లను చెక్ పెట్టేందుకు చైనా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే యోచనలో అధికారులున్నారు. పోర్నోగ్రఫీ చూడాలనే వారు తరచుగా కొన్ని రకాల పదాలను ఉపయోగించి సెర్చ్ ఇంజిన్స్ లో వెతుకుతుంటారు. ఇలాంటి వెబ్సైట్లకు చెక్ పెడితే పోర్నోగ్రఫీ కంటెంట్ లభించదు. అయితే దీనికి కేంద్ర సమాచార-ప్రసారశాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆమోదం లభించాల్సివుంది. కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే విధానపరమైన నిర్ణయమని, కేంద్ర నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మహిళలపై భద్రతపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళుతోంది. లండన్ లాంటి నగరాల్లో అశ్లీల వెబ్సైట్లపై నిషేధం విధించిన విషయాన్ని కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల రాజకీయ పార్టీలు, బుద్ధిజీవులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల వెబ్సైట్లను బంద్ చేయాలన్న ప్రతిపాదనను వారు స్వాగతిస్తున్నారు. అయితే పోర్నోగ్రఫీ వెబ్సైట్లను మూసివేయడంతోనే సరిపెట్టకుండా, ఆన్లైన్ వేధింపులపై కూడా దృష్టి పెట్టాలని మహిళలు కోరుతున్నారు.