the season
-
అధికారుల మెడకు చంద్రన్న క్షేత్రం
సాక్షి, కడప : వ్యవసాయంలో సాంకేతిక మార్పులను వినియోగించుకుని అత్యధిక దిగుబడులకు రూపకల్పన చేస్తామని పదేపదే చెబుతూ వస్తున్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సీజన్ ముగిశాక కళ్లు తెరిచింది. ఖరీఫ్, రబీకి సంబంధించి సీజన్ దాదాపు పూర్తయ్యే సమయంలో చంద్రన్న వ్యవసాయ క్షేత్రం పేరుతో హడావిడి చేస్తోంది. పంటలే లేనపుడు...భూ సేకరణ ఎలా?... ఎరువులు ఇప్పుడెలా ఖర్చు చేయాలి అంటూ పలువురు అధికారులు తమ చేత కాదని ఏకంగా లేఖల ద్వారా స్పష్టం చేశారు. ఎలాగైనా 2014-15కు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు స్థానిక వ్యవసాయాధికారులను వెంటాడుతున్నాయి. ఈ నేపధ్యంలో సీజన్ ముగిసిన తర్వాత చంద్రన్న వ్యవసాయ క్షేత్రాన్ని చేయలేక.... ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక వ్యవసాయాధికారులు, ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు. అక్టోబరులో ప్రారంభం కావాల్సి ఉండగా.... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబరు రెండవ వారంలో చంద్రన్న వ్యవసాయక్షేత్రం పథకాన్ని అమలు చేస్తున్నట్లు నిబంధనలు తయారు చేసినా ఇప్పటివరకు అధికారుల దరిచేరలేదు. ఈ మధ్యకాలంలో జనవరి 2వ తేదీన వ్యవసాయశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖచ్చితంగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ఉన్నతాధికారులు స్థానిక వ్యవసాయాధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 12 వ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా, ఇందులో 12 మంది ఏడీలు, జిల్లాలోని 50 మండలాలకు సంబంధించి 11 మంది ఏఓలు, మండలానికి ఇద్దరు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వీరందరికి సంబంధించి ఒక్కొక్కరికి 10 హెక్టార్లు చొప్పున తీసుకుని భూసార పరీక్షలకు మట్టిని సేకరించి..... కేంద్రానికి పంపితే అక్కడినుంచి వచ్చే నివేదికల ఆధారంగా ఎరువులను సూచిస్తూ ప్రణాళిక రూపొందిస్తారు. ఉదాహరణకు ఒక వ్యవసాయ డివిజన్‌కు సంబంధించి ఏడీ, ఏఓ, ఏఈఓలు 15 మంది ఉన్నారనుకుంటే.... వారందరికీ 150 నుంచి 170 హెక్టార్ల భూమిని దత్తత తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. భూసారపరీక్ష నివేదిక ప్రకారం భాస్వరం, పొటాష్, నత్రజని, యూరియా, మ్యాంగనీస్, జిప్సం, జింక్ తదితర ఎరువులు అవసరమని ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. తద్వారా ఒక్కొక్క డివిజన్‌కు 40 నుంచి 50 లక్షల విలువైన ఎరువులు, ఇతరత్రా యంత్రాలు వస్తే వాటిని రైతులకు సబ్సిడీపై అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్టోబరు రెండవ వారంలో ప్రారంభమై యుద్ధ ప్రాతిపదికన చేసి ఉంటే రబీ రైతులకు అరుునా న్యాయం జరిగేది. ఇప్పుడు మట్టి నమూనాలు, ఎరువులు, ఇతరత్రా రైతులు ఏం చేసుకుంటారని పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. చేతులెత్తేసిన అధికారులు చంద్రన్న వ్యవసాయ క్షేత్రంలో భాగంగా ప్రస్తుతం ఒత్తిడి చేసినా ఇప్పటికిప్పుడు లక్ష్యాలను ప్రారంభించలేమని పలువురు అధికారులు చేతులేత్తాశారు. అందుకు సంబంధించి జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్లకు సంబంధించిన అధికారులు లేఖల ద్వారా చేయలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒక్క హెక్టారు కూడా ఇప్పటి పరిస్థితుల్లో చేయలేమని, ఉన్న పంటలు కూడా ఇప్పటికే అయిపోయాయని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. మరికొన్ని డివిజన్లకు సంబంధించి 20-30 హెక్టార్లు సాధించామని చెబుతున్నా... అవన్నీ మొక్కుబడి వ్యవహారమే అని చెబుతున్నారు. ఏది ఏమైనా రైతులకు సంబంధించి సీజన్‌కు ముందస్తుగా చంద్రన్న క్షేత్రాన్ని తీసుకొస్తే బాగుంటుంది కానీ అంతా ముగిసిన తర్వాత తీసుకొచ్చి అమలు చేయాలనిచూడటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ వచ్చే సీజన్లోనూ మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఆ జట్టు ప్రకటించింది. 2013 వరకు ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్... గత సీజన్లో మెంటార్‌గా వ్యవహరించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి మే 25 వరకు ఎనిమిదో సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. ప్రస్తుతం తమ దగ్గర 24 మంది క్రికెటర్లు ఉన్నారని, ట్రేడింగ్‌లో ఎవరినీ తీసుకునే ఆలోచన లేదని రాజస్థాన్ జట్టు తెలిపింది. -
ఏటికొప్పాక మద్దతు ధర రూ.2384
ఎస్.రాయవరం : ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లుకు రానున్న సీజన్‌కు టన్ను చెరకు ధర రూ. 2384.64లుగా యాజమాన్యం ప్రకటించింది. ఫ్యా క్టరీ ప్రాంగణంలో సోమవారం 82వ మహాజన సభ నిర్వహించారు. గతేడాది, రానున్న సీజన్లకు సంబంధించి క్రషింగ్, రికవరీ, లావాదేవీల నివేదికలను ఎమ్డీ కెఆర్ విక్టర్‌రాజు చదివి వినిపించారు. అనంతరం సభలో చైర్మర్ రాజాసాగి రాంభద్రరాజు మాట్లాడుతూ రానున్న సీజన్లో 2 లక్షల టన్నులు క్రషింగ్‌కు అవకాశం ఉందన్నారు. కాగా కొందరు రైతులు సభావేదిక వద్దకు దూసుకొచ్చి పంచదార బస్తాలు చోరీకి గురవుతంటే యాజమాన్యం ఏం చేస్తున్నదని నిలదీశారు. చోరీకి పాల్పడిన వారిపై కేసు ఎందుకు పెట్టలేదని దుయ్యబట్టారు. టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3200లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొందరు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపైకి వచ్చి వివరించారు. ఏటా సర్వసభ్య సమావేశాలప్పుడు ప్రకటిస్తున్న హామీలు ఏవీ నెరవేర్చడం లేదని వాపోయారు. దీంతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. చివరిగా గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతలకు ప్రోత్సాహాక భహుమతులు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
‘గోవాడ’ రైతులకు చేదు కబురు
మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం నిరసన వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు. అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు. మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు. ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులకు ప్రోత్సాహకాలు : మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు. ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు.