Seasons
-
'బిగ్‌బాస్' నుంచి మొదటి వారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే (ఫోటోలు)
-
మల్లెల వేళ... వెన్నెల మాసం
‘వసంతం’ అన్న మాటే ఎంత మృదువుగా చెవిని తాకుతుంది! ఆ మాటలో ఒక్క పరుషాక్షరంకానీ, ద్విత్వాక్షరం కానీ, సంయుక్తాక్షరం కానీ లేవు. ఎందుకుంటాయి? వసంతమంటే, ప్రకృతి మోహపరవశయై రంగురంగుల పూలతో సిగను అలంకరించుకుని నూతన సృష్టికి సంసిద్ధమయ్యే కాలం కదా! స్త్రీపురుషుల ఎదలో తీపి ఊహలు రేపి లలితలలితం చేసే మధుమాసం కదా! వేదాలలో సామంగా, ఛందస్సులలో గాయత్రిగా, మాసాలలో మార్గశీర్షంగా తనను చెప్పుకున్న కృష్ణ పరమాత్మ; ఆరు ఋతువులలోనూ సర్వశ్రేష్ఠం కనుకనే కుసుమాకరమైన వసంతమూ తానేనన్నాడు. సమృద్ధికి సంకేతమైన ఆమని, ఋతుపతి, కామవల్లభము, పికబాంధవము, పూలకారు అనిపించుకునే వసంతఋతువుకు రారాజు మన్మథుడైతే; అతని చెలికాడూ, సేనానీ వసంతుడట! అరవిందం, అశోకం, మామిళ్ళు, కొత్త మల్లెలు, నీలోత్పలాలనే అయిదూ మన్మథుని బాణాలట! అవి ప్రేయసీప్రియుల ఎడదను తాకి వలపు పులకలతో ఠారెత్తిస్తాయట! ఆదికవి నుంచి ఆధునికుని వరకూ వసంత రుతుగానం చేయని కవికోకిల ఎవరుంటారు? సీతావియోగ దుఃఖంతో అడవుల వెంబడి పడిపోతున్న రాముణ్ణి వసంతశోభ ఆకర్షించడమే కాదు, మరింతగా దుఃఖవివశుణ్ణి చేసినట్టు వాల్మీకి వర్ణిస్తాడు. పంపాతీరానికి చేరేసరికి ఆ సరస్సు పద్మాలు, ఉత్పలాలు, చేపలతో కనువిందు చేసింది. అందులోని నీళ్ళు వైడూర్యంలా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. చుట్టుపక్కల అడవి అంతటా ఎత్తైన చెట్లు, పర్వతాలు పచ్చదనంతో ముచ్చట గొలుపుతున్నాయి. పూర్తిగా పుష్పించి ఉన్న చెట్లను లతలు గాఢాలింగనం చేసుకుని ఉన్నాయి. రక రకాల చెట్ల మధ్యలో నీలి, పసుపురంగు గడ్డిభూములు రంగురంగుల పూలదుప్పటి కప్పుకున్నట్టున్నాయి. ఆహ్లాదకరమైన పిల్లగాలితో ఎల్లెడలా పూలు, పండ్ల పరిమళాన్ని గుప్పిస్తూ వసంతం ఎంతో కొత్తగానూ, స్వాతిశయంతోనూ భాసించింది. మేఘాల్లోంచి పడే వర్షంలా అదేపనిగా పూల వాన కురుస్తోంది. ఆదికవిది ఎంత సుసూక్ష్మ పరిశీలనంటే, కొన్ని పూలు అప్పటికే రాలిపోగా, కొన్ని రాలి పోతూపోతూ ఉన్నాయట. ప్రతిచోటా గాలి పూలతో పరాచికాలు ఆడుతూనే ఉందట. కాళి దాసు ఋతుసంహార కావ్యాన్ని గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తాడు. అప్పుడు చెట్లు పూల తోనూ, నీళ్ళు పద్మాలతోనూ, స్త్రీలు ప్రియసమాగమ కాంక్షతోనూ, గాలి పూలగంధంతోనూ, సాయంత్రాలు సుఖం గొలిపేలానూ, పగళ్ళు పరమరమ్యంగానూ ఉండి సమస్తమూ సుమనో హరంగా ఉందంటాడు. మగకోకిల బాగా చిగిర్చిన మామిడి చిగుళ్ళు మెక్కి మదించి తనకు ప్రియమైన ఆడకోకిలను ముద్దాడుతున్నట్టూ; తుమ్మెద కమలాల్లోని పూదేనె గ్రోలుతూ ఝంకారం చేస్తూ ఆడుతుమ్మెదను ఆకర్షించే నర్మవ్యాపారాలు చేస్తున్నట్టూ వర్ణిస్తాడు. ప్రతిపద్య చమత్కృతికి పెట్టిన పేరైన చేమకూర వెంకటకవి తన ‘విజయవిలాస’ కావ్యంలో వసంతుడికీ, చంద్రుడికీ మధ్య స్పర్థను కల్పించి తన ఊహావైభవాన్ని అంచులు దాటిస్తాడు. వసంతుడు వస్తూనే మోడువారిన చెట్లను చిగురింపజేసి రసవంతమైన ఫలపుష్పాలతో నలువైపులా సుగంధాలను వ్యాపింపజేసినా, అవి వట్టి చెట్లే కదానని చెప్పి చంద్రుడు మెచ్చలేదట. ప్రసన్న, సుకుమారమైన తన వెన్నెలజల్లుతో ఏకంగా రాళ్ళనే కరిగింపజేశాడట. చేమకూరకు మరింత చవిని జోడించే మరో పద్యం మన్మథుడి జైత్రయాత్రను చెబుతుంది. రాజు ఎక్కడికైనా వెడుతున్నప్పుడు సూర్యచంద్రుల బొమ్మలున్న పొడవాటి కర్రలను పట్టుకుని పరిచారకులు ముందునడవడం పరి పాటి కాగా; మన్మథుడు జగజ్జేత కనుక తూర్పు, పడమటి కొండలపై ప్రకాశించే సూర్యచంద్రులనే నేరుగా రాజలాంఛనం చేసుకుని దిగ్విజయానికి బయలుదేరాడట. వసంతాగమనాన్ని ఎలా పోల్చుకోవాలో విశ్వనాథవారు తన ‘ఋతుసంహార’ కృతిలో అందంగా ఏకరవుపెడతారు. కౌగి లింత వేళ ఉద్రిక్త అయిన ప్రియురాలి ఎద చెమర్చినా, చన్నీటిస్నాన సౌఖ్యం వల్ల ముక్కుపుటాలలో చెమరింపు పుట్టినా, పేరంటానికి వెళ్ళే పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ కనబడినా, వంగిన వేపకొమ్మకు కావి చిగురుపట్టి పక్క ఈనెకు పూతపట్టినా, హఠాత్తుగా ఓ రోజున పొద్దెక్కినవేళ దూరపు కోన నుంచి కోకిలస్వరం వినిపించినా వసంతం అడుగుపెట్టిందన్న మధురోహ కలుగు తుందంటారు. ఆపైన, కొత్తగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూత్నయవ్వనోద్వేగంతో వేగిపోతూ వసంతవనాంత వీథిలో ముక్కున చిదమని మామిడి చిగురు లేదంటారు. శేషేంద్ర ఏం తక్కువ! ‘ఎక్కడ చూసినా స్వచ్ఛకాంతులీనుతూ సంతోషంలో ముంచే జాజులు, మల్లెలు, తీగసంపెంగలు, కొదమ గులాబులతో విశ్వదిశాంతరాళాన్ని సుమసముద్రం చేస్తున్నది– ఇదేనా మధుమాసమంటే’ అని తన ‘ఋతుఘోష’లో ఆశ్చర్య, పారవశ్యాలను అక్షరీకస్తారు. ‘ఈ ఆకాశమూ, ఈ మహా సము ద్రాలూ, ఈ భూమండలమూ, ఈ తరుప్రపంచమూ ఈ విశ్వమంత అంతర్గత శోభతో ఉర్రూత లూగిస్తున్నాయి; ఊహావిహంగం ఉత్కంఠతో ఎగిరిపోవాలనుకుంటోం’దంటారు. విశ్వమందిరంలో కన్నులపండువగా కొలువైన పురుషునికీ; పూవులతో, ఎర్రని చిగుళ్లతో సింగారించుకుని సొంపుగులికే ప్రకృతికీ మధ్య రాసక్రీడగా వసంతారంభ కాలాన్ని రూపుకడతారు. ఇంకోవైపు, జీవజాల మనే ఒడ్లను ఒరుసుకుంటూ ప్రవహించే ఈ వాసంతరస స్రవంతి వేళ, ప్రియురాలితో కలసి సరస్తీరాలకు, పూపొదల చాటుకు, తోటలకు వెళ్ళే అవకాశం లేకుండా మధ్యాహ్నకాలాల్లో చేలల్లో మగ్గి పోయే శ్రామికజనాలపై జాలితో కరిగినీరవుతారు. వసంతం మామూలుగా కాదు, ఉత్సవంలా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జీవుల మనుగడను ఆహ్లాదపు ఊయెల ఎక్కించి ఊపి విడిచిపెడుతుంది. వసంతానుభవపు మత్తుకు, గమ్మత్తుకు చిత్తు కాని జీవి ప్రపంచంలోనే ఉండడు. మన్మథుడా మజాకానా! ఆయన జగత్తుకే రారాజు కదా!! -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
వానలు కురవాలి
ఇది ఆషాఢ మాసం. వర్షారంభ కాలం. ఆషాఢమంటే ఆకాశంలో కనిపించే మబ్బులు. నేలమీద కురిసే తొలకరి చినుకులు వీచే మట్టి పరిమళాలు. ‘తొలకరి వాన మొలకల తల్లి’ అనే నానుడి ఉంది. ఆషాఢంతో ముడిపడిన అనేక సంప్రదాయాలు మన జనజీవనంలో ఉన్నాయి. ఆషాఢం నుంచి కార్తీకం మొదలయ్యే వరకు వానలు కురుస్తాయి. పూర్వం మనకు వానాకాలంతోనే ఏడాది మొదలయ్యేది. అందుకే, వానను వర్షం అని అంటారు. ఏడాదులను వర్షాలతో లెక్క కట్టడం కూడా మనకు వాడుకలో ఉన్న పద్ధతే! ప్రకృతిలోని జీవకళకు వానలే ఆధారం. వర్షసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘సదా మనోజ్ఞం స్వనదుత్సవోత్సుకమ్/ వికీర్ణ విస్తీర్ణ కలాప శోభితమ్/ ససంభ్రమాలింగన చుంబనాకులం/ ప్రవృత్త నృత్యం కులమద్య బర్హిణామ్’ అని కాళిదాసు ‘ఋతుసంహారం’లో వర్షర్తు సౌందర్యాన్ని వర్ణించాడు. మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన కురుస్తున్నప్పుడు నెమళ్లన్నీ పింఛాలు విప్పి జంటలు జంటలుగా ఒకదానినొకటి ముద్దాడుతూ నర్తిస్తున్నాయట! తొలకరి జల్లులు కురిసే వేళల్లో ఇలాంటి చూడచక్కని దృశ్యాలు కనిపిస్తాయి. ‘ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా/ల్పడి గాలి నట్టిండ్ల దడిపి చనగ/... భూభిదాపాది దుర్భరాంభోభరంపు/... కడవ వంచి/నట్లు హోరని దారౌఘ మైక్యమొంది/ మిన్ను మన్ను నొకటిగా వృష్టి బలిసె’ అంటూ హోరైన గాలితో చిటపట చినుకులుగా మొదలైన వర్షం వేగాన్ని పుంజుకుని మింటినీ మంటినీ ఏకం చేసేంత కుంభవృష్టిగా పరిణమించిన వైనాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యదలో’ కళ్లకు కట్టాడు. ఇలాంటి దృశ్యాన్నే శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్/ పరచెను ఝంఝానిలములు/ కురిసెను వర్షము కుంభగుంభిత రీతిన్’ అని వర్ణించారు. సకాలంలో సజావుగా కురిస్తే, వర్షం హర్షదాయకమే! వర్షం ఒక్కొక్కప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. శేషేంద్ర తన కావ్యంలో వర్షబీభత్సాన్ని కూడా వర్ణించారు. ‘పసికందుల్ జడివానలో వడకగా పాకల్ ధరంగూలి తా/మసహాయస్థితి తల్లిదండ్రులును హాహాకారముల్ సేయగా... నిర్వేల హాలాహల శ్వసనంబుల్ ప్రసవించె దీనజనతా సంసారపూరంబులన్’ అంటూ జడివానకు పూరిపాకలు కూలి పోయినప్పుడు నిరుపేదల నిస్సహాయతను కళ్లకు కట్టారు. రుతువులలో వర్షర్తువంతటి అస్తవ్యస్తమైన రుతువు మరొకటి లేదు. వానాకాలానికి ఉండే సహజ లక్షణం అనిశ్చితి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అని సామెత. వర్షాకాలంలో మోతాదుగా వానలు కురుస్తాయనే భరోసా ఎప్పుడూ లేదు. భూమ్మీద ఎక్కడో ఒకచోట అతివృష్టి లేదా అనావృష్టి దాదాపు సర్వసాధారణం. మనుషులు అతివృష్టినీ తట్టుకోలేరు, అనావృష్టినీ భరించలేరు. సకాలంలో వానలు కురవకుంటే వానల కోసం ఎదురు చూస్తారు. ఎదురుచూపులకు ఫలితం దక్కకుంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ హోమాలు చేయడం వంటి తతంగాలను యథాశక్తి సాగిస్తారు. ప్రార్థనల ఫలితంగానో, ప్రకృతి రుతుధర్మ ప్రకారమో జడివానలు మొదలైతే, చిత్తడితో నిండిన వీథుల్లోకి వెళ్లలేక వానలను తిట్టుకుంటారు. మనుషులు స్తుతించినా, నిందించినా వాటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా వానలు వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అతివృష్టి వరదబీభత్సం వంటి ఉపద్రవాలను తెచ్చిపెడితే, అనావృష్టి కరవు కాటకాలతో ఆకలిమంటలు రేపుతుంది. ‘ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు/ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె తీవ్రంబుగా/... మాకీ కష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్?’ అంటూ దువ్వూరి రామిరెడ్డి తన ‘కృషీవలుడు’ కావ్యంలో కళ్లకు కట్టారు. అనావృష్టి ప్రభావం రైతు లకే ఎక్కువగా ఉంటుంది. చినుకు కరవై బీడువారిన నేలను చూస్తే రైతు గుండె చెరువవుతుంది. ఆషాఢం అంటే తొలకరి చినుకులు మాత్రమే కాదు, అరచేతులను పండించే గోరింట కూడా! ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. పురాతన నాగరికతల కాలం నుంచి గోరింటాకు వాడుకలో ఉంది. అయినా మన కావ్య ప్రబంధాలలో కాళిదాసాది పూర్వకవులు గోరింటాకుపై ఎందుకో శీతకన్నేశారు. గోరింట ప్రస్తావన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలోనే కనిపి స్తుంది గాని, కావ్యాలలో కనిపించదు. జానపద గీతాల్లో గోరింట ప్రస్తావన కనిపిస్తుంది. ‘గోపాల కృష్ణమ్మ పెళ్లయ్యెనాడు/ గోరింట పూచింది కొమ్మ లేకుండా’ అనే జానపద గీతం ఉంది. ‘గోరింటాకు’ సినిమా పాట పల్లవిని కృష్ణశాస్త్రి బహుశా దీనినుంచే సంగ్రహించి ఉంటారు. ఆధునిక కవుల్లో కొద్దిమంది గోరింటపై దృష్టి సారించారు. సరోజినీ నాయుడు ‘గోరింటాకు’ కవిత రాశారు. ‘వధువు నెన్నుదుటికి కుంకుమం ఎరుపు/ మధురాధరాలకు తాంబూల మెరుపు/ లిల్లీల తలపించు కాళ్లకూ వేళ్లకూ/ లేత గోరింటాకు ఎరుపే ఎరుపు’ అంటూ గోరింటాకు ఎరుపును ఎంతో మురిపెంగా వర్ణించారు. ఆమె ఇంగ్లిష్‌లో రాసిన కవితను సినారె తెలుగులోకి అనువదించారు. ‘బొప్పి గట్టినగాని యే పురుషుడైన/ తెలివినొందడు లోకంబు తెలియబోడు/ రాళ్లదెబ్బల గోరింట రంగొసంగు/ మనుజు డగచాటులనె గాని మారడెపుడు’ అంటారు ఉమర్ అలీషా. అగ చాట్లలో నలిగితే తప్ప మనిషి మారడని చెప్పడానికి రాళ్లదెబ్బలతో నలిగితేనే గోరింట రంగునిస్తుందని పోల్చడం విశేషం. ఆషాఢంలోని తొలకరి జల్లులతో మొదలయ్యే వానాకాలంలో సజావుగా వానలు కురిస్తే పంటపొలాల్లో నవధాన్యాలు పండుతాయి. ఆషాఢంలో అతివలు అలంకరించుకునే గోరింటాకుతో అరచేతులు పండుతాయి. ప్రకృతి కరుణిస్తే బతుకులు పండుతాయి. మన పంట పండాలంటే వానలు కురవాలి. -
ఒకనాటి వేసవి
రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉంచేవారు. తెల్లారి పచ్చిమిర్చి అందుకునేవారు. దాన్ని మధ్యకు చీల్చి, ఉప్పుగల్లు దూర్చి, నాష్టాలో ఒక ముద్ద అది... పంటి కింద ఇది. బాగుండేది. నీటిసొద జాస్తి. దూరం దూరం పోయి, చాలని తాడుకు కొత్తది ముడివేసి, అడుగు నుంచి లాగి, బిందె భుజాన మోసి... అయితేనేం? నేస్తులతో కలసి కబుర్లాడుకుంటూ నడుస్తుంటే బాగుండేది. తొణికే నీళ్లు వీపున చరుస్తూ ఉన్నా బాగుండేది. కలిగిన వాళ్లు కొత్త తాటాకుల పందిరి వేసేవారు. కుదిరినవారు కొబ్బరాకులతో నీడ పరిచే వారు. కింద నిలబడితే ఆ చలువదనం బాగుండేది. ఐసుబండి ఆపితే ఆ జిల్లుదనమూ బాగుండేది. కోసి చూపించమని అడక్కుండా పుచ్చకాయ కొనేదే లేదు. త్రికోణాకార ముక్కను అప్పటికప్పుడు తినకుండా వదిలిందీ లేదు. ముంతమామిళ్లవి పలు రంగులు. వాటి మరకలు బట్టలు మీద పడితే వీపు మీద అమ్మ జాజ్ డ్రమ్ కొట్టేది. పచ్చి తాటాకుల పొట్లాల్లో ముంజలు తెచ్చేవారు. ఆపి బేరం చేస్తే ఒకో పొట్లాన్ని కొడవలితో కోసి విడిపించేవారు. ముదురు ముంజకాయ కొబ్బరికి అటుఇటుగా ఉండేది. లేతది నోట అమృతం చిమ్మేది. తాటికాయలతో చేసిన బండికి టోల్గేట్ అడిగే దమ్ము ఎవరికీ లేదు. తెల్లరంగు స్ట్రాంగ్ పిప్పరమెంట్ దవడన పెట్టుకుంటే అదే పెట్రోలుగా పరుగు తీసేది. చింత చిగురొచ్చేది. బంగారం రేటుతో తూగేది. మునగచెట్లు విరగ గాసేవి. వేపచెట్టు బ్రాండు ఏ.సి ప్రతి రచ్చబండ దగ్గర కూల్ టెంపరేచర్ మెయిన్ టెయిన్ చేసేది. వీధిన తిరగలేని అవ్వ వేరుశనక్కాయలను అక్కడే అమ్మేది. రూపాయి చేజిక్కించుకుని మ్యాట్నీకి దౌడు తీస్తే ఉబ్బరింత. బాగుండేది. కరెంటు పోయి తలుపులు తీస్తే జొరబడే చల్లగాలి. బాగుండేది. కడప నుంచి కర్బూజ పండ్లు వస్తాయి. చక్కెర జల్లి కాసేపు వదిలి తింటే జీరాను తలపిస్తాయి. నిమ్మకాయల రేటు గజనిమ్మకాయల సైజుకు వెళుతుంది. సుగంధ వేర్లు... హలో మేమున్నాం అంటాయి. ఆరెంజి సోడా ఆగిఆగి తాగమని షోకులు పోతుంది. చలివేంద్రాల దగ్గరుండే పొడవు కాడల గరిటెలు ఆ తర్వాత ఏమవుతాయో ఏమో! పాత గొడుగులకు మర్యాద దక్కి డ్యూటీ ఎక్కుతాయి. వాసానికి దూర్చిన విసనకర్ర దగ్గరి స్నేహితుడిలా పలకరిస్తుంది. పిచ్చుకల హడావిడి మీటింగుల మధ్య మధ్యాహ్నపు కునుకు అమోఘంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు లోటాలు కుమ్మరించుకుంటే అదే స్వర్గం. డాబా మీద నీళ్లు జల్లితే రాత్రికి చుక్కలు చల్లగా పలకరిస్తాయి. నిద్రకు ఇంటిల్లిపాది మేడెక్కితే పరుపులున్నవారు శ్రీమంతులు. టేబుల్ ఫ్యాను తిప్పగలిగేవారు కుబేరులు. తల దగ్గర నీళ్ల చెంబుకు బోర్లించిన గ్లాసే మూతవుతుంది. మేను వాల్చాక స్తంభించ కుండా గాలి వీస్తే పరమ పరవశం. ఆవకాయ సెంటిమెంట్. అర ఎకరం అమ్మైనా లంక మిరపకాయలు, గానుగ నూనె, ఆవాలు, మెంతులు, పచ్చడి మామిడి కాయలు వెల జరిగేవి. ముహూర్తం చూసి మరీ అమ్మమ్మ పని మొదలెట్టేది. కొడుకు నడుం మీద చేతులతో సాయానికి సిద్ధమయ్యేవాడు. కోడలు చూపుతో చెప్తే చేత్తో అందుకునేది. పిల్లలు కిలకిలారావాలు చేసేవారు. ఎర్రగా కలిపిన తొలిముద్ద పెట్టడానికి ప్రతి చిన్నారికి ఇంట పెద్ద తలకాయ ఉండేది. చుట్టాలొచ్చేవారు. పిల్లల్ని తెచ్చేవారు. ఆటల్లో ఉత్తుత్తి విందు ఒండి బాదం ఆకుల్లో బలవంతాన తినిపించేవారు. ఏటికి చాటుగా వెళ్లినవారు జేబుల్లో ఇసుకతో దొరికిపోయేవారు. ఆడపిల్లలు తీరిగ్గా గోరింటాకు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి అరచేతుల్లో చంద్రుళ్లు ఉదయించేవారు. పైతరగతికి వెళ్లే ముందొచ్చే వేసవికై పిల్లలు ఎదురు చూసేవారు. తీక్షణ ఆనందాల ఎండలకై ఆరాటపడేవారు. ఇప్పటిలా కాక రోషమున్న మల్లెలు వేసవిలోనే గుబాళించేవి. సీజను ముగియక ముందే స్త్రీలను జడల్లో వీలైనన్ని తురుముకోమనేవి. కనకాంబరాలతో కలిపి అల్లితే వాటిదొక అందం. మరువంతో, దవనంతో జత చేస్తే మరో చందం. మాలలు కట్టడానికి అమ్మలక్కలంతా కూడి ఇకఇకలు పకపకలు పోతుంటే చూడటం బాగుండేది. ప్రతి ఇంటి గోడ మీద అమ్మాయి పూలజడ ఫోటో కళకళలాడేది. తీపి మామిడిపండ్లు ఈ దేశవాసుల కోసమే కాసేవి. దిల్ పసంద్ ఎంతో పసందుగా ఉండేది. బంగినపల్లి ప్రతి ఇంటా కనీసం చేరేది. రసాలు మాత్రమే పిండుకు తాగేవారు కొందరు. ఇమాం పసంద్కై పట్టుబట్టే వారు ఇంకొందరు. నీలాలు ఆఖరున వచ్చేవి. తోతాపురికి ఉప్పూకారాలే గతి. బిగ్ బాస్కెట్ లేని కాలంలో కారు మాట్లాడుకుని చలో చిత్తూరనేవారు. నూజివీడుకు పదమనేవారు. మధుర ఫలాల బుట్టలు ప్రాప్తమున్నవారికి దక్కేవి. యుగాలుగా వేసవి ఇలాగే ఉంది. ప్రియజనుల కోసం ఇలా పునరావృతం అవుతూనే ఉంది. మనిషే ఈ రుతువుల సౌందర్యానికి ఎడంగా జరుగుతున్నాడు. వేసవి చెప్పే తీర్పు– విరామం ప్రకటించుకోమని, ఆటవిడుపుపై దృష్టి పెట్టమని, అయినవారి సాంగత్యాన్ని ఆస్వాదించమని! ఇవాళ మనిషి వెళ్లడానికి ఊరు లేనివాడు. పిల్లలతో వెళ్లడానికి బంధువులు, బంధాలు నిలబెట్టుకోని వాడు. అన్నీ ఉన్నా ఎందుచేతనో మనసు ఇరుకు చేసుకుంటున్నాడు. ఇంటి సభ్యులు తప్ప బయటి మనిషి వచ్చి ఒకపూట చేయి కడగని నిరుపేదవుతున్నాడు. సూర్యనారాయణమూర్తి వేసవిలో తన దగ్గర ఉన్నది ఏదీ దాచుకోకుండా ధారాళంగా భూమి మీద ప్రసరింపజేసి ఆ వెంటనే మొలకలెత్తే వర్షానికి కారకుడవుతాడు. ఈ వేసవిలో మనం కూడా మనలో దాగి ఉన్న, ఎక్కడో అణిచివేయబడి ఉన్న, మరుపున పడి ఉన్న అనుబంధాల్ని ఏదో మేరకు వెలికి తీసి, ఒకనాటి వేసవిని, ఒకనాటి ఆనందాల్ని పొందలేమా? ప్రయత్నిద్దామా? బాగుంటుంది. -
Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!
ప్రాణహిత, గోదావరి, కిన్నెరసాని నదుల వెంట ప్రయాణాన్ని సాగించిన మగ పులి ఆడతోడు కోసమే ఇటువైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. 26 రోజులపాటు సాగిన ప్రయాణంలో తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు వెళ్తున్నట్లు దాని గమనం చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ పులి సిర్పూర్ ప్రాంతానికి చెందినదని, పేరు ఎస్–8 అని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మగపులి ఉమ్మడి జిల్లాలో సాగించిన ప్రయాణం.. దాని ప్రత్యేకతలు, ఎందుకు.. ఎలా వచ్చిందన్న దానిపై ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనం.. – పోతరాజు రవిభాస్కర్, భూపాలపల్లి మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్‌లో పుట్టిన ఈ మగపులి ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదేళ్లు ఉంటుంది. రెండేళ్ల వయసులో తల్లినుంచి దూరమై అక్కడినుంచి కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ ప్రాంతానికి వచ్చింది. అక్కడి అటవీశాఖ అధికారులు దీనిని గుర్తించి ఎస్–8గా నామకరణం చేశారు. పులులు అభయారణ్యంలో సుమారు 25 నుంచి 30 చదరపు కిలోమీటర్లు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తాను ఉన్న విషయాన్ని గుర్తించేలా ఆ ప్రాంతం చుట్టూ మలం, మూత్రం విసర్జిస్తుంది. మూత్రం ఎక్కువ కాలంపాటు రసాయనాల మాదిరిగా వాసన వస్తుంది. దీంతో అటువైపు ఇతర జంతువులు, పులులు రావు. కొన్ని సందర్భాల్లో బలమైన పులి వెళ్లి దాడికి పాల్పడినప్పుడు, అక్కడి పులి తన తోడును వదిలి దూరంగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగానే ఎస్–8 పులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మేటింగ్ సీజన్ కావడంతో... పులులకు చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మేటింగ్(సంభోగం) సీజన్.. దీంతో సిర్పూర్ నుంచి బయలుదేరిన ఎస్–8 మేటింగ్ చేసేందుకు ఆడపులిని వెతుక్కుంటూ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అడవుల్లో తిరిగింది. ఆడతోడు కానరాకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు బయలుదేరింది. ఎస్–8గా ఎలా గుర్తించారంటే.. సాధారణంగా పాదముద్రలు(పగ్‌మార్క్స్) ఆధారంగా పులిని గుర్తించి ఆడదా, మగదా అని నిర్ధారిస్తారు. పులుల చర్మంపై చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులి చారలను మరో పులి పోలి ఉండదు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పులిని మొదటిసారి గుర్తించిన చోటే దానికి నామకరణం చేస్తారు. 2020, అక్టోబర్ 11న సిర్పూర్ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన, ములుగు జిల్లా మంగపేట అడవిలో గత నెలలో సీసీ కెమెరాకు చిక్కిన పులి చారలు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో అది సిర్పూర్ నుంచి వచ్చిన ఎస్–8గా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని అటవీశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఒక పులి భూపాలపల్లి మీదుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగి తోడు దొరకకపోవడంతో మళ్లీ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మీదుగా సిర్పూర్ అడవులకు తిరిగి వెళ్లింది. అయితే గతంలో ఆ పులి ఎక్కడా కనిపించలేదు. దీంతో దానికి ఎం(ములుగు)–1గా నామకరణం చేశారు. ►గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని అడవుల మీదుగా కాళేశ్వరం గోదావరి వరకు వెళ్లి, నది దాటి తిరిగి సిర్పూర్ వైపునకు వెళ్లనున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ►30న ములుగు అడవుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన రాత్రి ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో గల ఎన్‌హెచ్ 163 రహదారి దాటింది. తాజాగా గురువారం వెంకటాపూరం(ఎం) మండలం రామకృష్ణాపూర్ అడవిలో పులి అడుగులను గుర్తించారు. ►29వ తేదీన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటమీదుగా పాకాలకు చేరుకుంది. కొత్తగూడ వెళ్లే దారిలో రోడ్డుదాటుతుండగా ఇద్దరు వాహనదారులు గమనించి భయంతో పరిగెత్తారు. పులి ఆ రోజు మొత్తం ప్రయాణం సాగించింది. ►ఎస్–8 పులి సిర్పూర్ నుంచి అక్టోబర్ చివరి వారంలో బయలుదేరి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరొంచకు చేరుకుంది. అదే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పరిధిలోని పెంటిపాక గ్రామ సమీప అడవిలో పశువుల కాపరి దుర్గం మల్లయ్య(48)పై దాడి చేసి చంపింది. సుమారు వారం రోజులు అదే ప్రాంతంలో ఉంది. ►25వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని గూడూరు మండలం నేలవంచ సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. అనంతరం మూడు రోజులు అక్కడే ఉంది. ►12వ తేదీన మంగపేట నుంచి నర్సింహాపూర్ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకుంది. అక్కడ పినపాక మండలం అమరారం సమీప అడవిలో పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని చంపింది. ఆజిల్లా అడవుల్లో సుమారు 12 రోజులు గడిపింది. ►8వ తేదీ రాత్రి ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులపాటు ప్రయాణం చేస్తూ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, కామారం మీదుగా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం చింతలమోరి వద్ద గల రోడ్‌ను క్రాస్ చేసి హీరాపూర్, తొండ్యాల లక్ష్మీపురం మీదుగా మంగపేట మండలంలోకి 11వ తేదీన చేరింది. ►గత నెల 7న గోదావరి నది దాటి కాళేశ్వరం, పలిమెల మీదుగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి శివారు అడవిలో గల మద్దిమడుగుకు 8వ తేదీన చేరుకుంది. -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు. -
ఋతుగుణానికి... అనుగుణంగా
వాతావరణంలోని మార్పులను బట్టి సంవత్సరంలోని పన్నెండు నెలల్ని ఆరు ఋతువులుగా విభజించారు మన పూర్వీకులు. సంస్కృతంలో చెప్పినా, ఆంగ్లంలో చెప్పినా, ఏ మాతృభాషలో చెప్పినా ‘శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం’ ప్రకృతిలోని కాలచక్రానికి చిహ్నాలు. వీటికి అనుగుణంగా ప్రాణికోటి తమ జీవనశైలిని, ఆహారవిధానాలను సర్దుకోవలసిందే. మానవ ఆరోగ్య శాస్త్రానికి కాణాచి అయిన ఆయుర్వేదం వివిధ వ్యాధులకు చికిత్సలను వివరించడంతో పాటు ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడానికి, ఎన్నో ప్రక్రియలను ‘స్వస్థవృత్తం’ అనే పేరు మీద విపులీకరించింది. ఆహారస్వభావాలను, జీవనశైలిని.. దినచర్య, ఋతుచర్యలుగా విశదీకరించింది. శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతం అనే ఆరు ఋతువులలోనూ తదనుగుణమైన ఆహారవిహారాలను వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న హేమంత ఋతువు, రానున్న శిశిర ఋతువుల చర్యలను పరిశీలిద్దాం. హేమంతం: మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువు. ఇంచుమింగా నవంబరు నెల చివర నుంచి, జనవరి నెల చివరి వరకు ఉంటుంది. అనంతరం శిశిర ఋతువు ప్రారంభమౌతుంది. ఇది మార్చి నెలలో మూడు వారాల వరకు ఉంటుంది. ఈ రెండు ఋతువుల్ని చలికాలం అంటాం. స్వభావరీత్యా బయట చలిగాలులు వీస్తాయి. అందువలన శరీరం లోపల ఊష్మం అంటే వేడి పుడుతుంది. జఠరాగ్ని (దీపన పాచకాగ్నులు – ఆకలి కలగడానికి, అరుగుదల కావడానికి ఆధారమైనవి) గణనీయంగా వృద్ధి చెందుతుంది. మనుషులు ఎంతటి బరువైన ఆహారాన్నయినా అరిగించుకోగలరు. సమృద్ధిగా తినకపోతే రసధాతువు బలహీనపడి వాతప్రకోపం జరుగుతుంది. ఆహారవిధి: తీపి, పులుపు, ఉప్పు రుచులతో (మధుర, ఆమ్ల, లవణ రసాలు) కూడిన పుష్టికరమైన (బరువైన గుర్వాహారం) ఆహారాన్ని సేవించాలి. కొత్త బియ్యం, ఆవుపాలు, చెరకు రసం శ్రేష్ఠమని చరకాచార్యుడు స్పష్టీకరించాడు. నువ్వులనూనె (తైల), వస (ఎముకల గుజ్జులోని రసం) బలకరమని చెప్పాడు. (గోరసాన్ ఇక్షువికృతీః – వసామ్, తైలమ్ నవౌదనమ్). కనుకనే సంక్రాంతి పండుగ సమయంలో కొత్తబియ్యపు పాయసం, చెరకు రస పానం విశిష్టతను సంతరించుకున్నాయి. మినుములతో (మాష) చేసిన పదార్థాలు పుష్టికరమని వాగ్భటాచార్యుడు వివరించాడు. (... మాషిక్షుక్షీరోద్ధవికృతీః శుభాః). కారము, చేదు, వగరు (కటు తిక్త కషాయ) రుచులు కలిగిన ఆహారపదార్థాలు మంచివి కాదు. వేడివేడి సూపుల వంటి పానీయాలు, ఫలాలు, రకరకాల రుచికర వంటకాలు హితకరం. విహారం (జీవనశైలి): వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నువ్వులనూనె వంటి వాతహర తైలంతో శరీరానికి మర్దనా చేసుకోవటం, నూనెతో కూడిన దూదిని తలమీద ఉంచుకోవటం మంచిది. వస, కరక్కాయ వంటి ద్రవ్యాల చూర్ణాలకు కొద్దిగా నూనె కలిపి నలుగు పెట్టుకుని, ఆ తరవాత అభ్యంగ స్నానం చేయాలి. (శరీరానికి సరిపడేలా వేడి నీళ్లు వాడుకోవాలి. అంటే సుఖోష్ణ జలస్నానం). వెచ్చదనం కోసం ప్రత్తి లేదా పట్టు (సిల్కు) వస్త్రాలను ధరించాలి. ఎండలో నుంచి సూర్యరశ్మి శరీరానికి అందేలా కొద్ది సమయం గడపాలి. కూర్చోవటం, పండుకోవటం కోసం వెచ్చని వస్త్రాలు ఉండాలి. గమనిక: ఎటువంటి పరిస్థితులలోనూ శీతల వాయువులకు గురి కాకూడదు. తలకు, శరీర భాగాలకు వెచ్చదనం కలిగించే దుస్తులు, ఇతర ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే భూమి లోపల కూడా చిన్న గదులు నిర్మించుకుని నివసించాలని వివరించారు. ఇటువంటి ఋతుచర్యలను ఆరు ఋతువులకు కూడా ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకు, ఓజో వృద్ధి కొరకు పేర్కొన్నారు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
జిత్తులమారి కాంతయ్య!
సాక్షి, సిటీబ్యూరో: నిజామాబాద్ జిల్లాలో పుట్టి పెరిగాడు... బతుకుదెరువు కోసం ముంబై చేరి అటునుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు... 2007లో మోసాలు చేయడం ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు... మొత్తం తొమ్మిది బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి రూ.కోట్లలో దండుకున్నాడు... పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లు, సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను సైతం మారుస్తుంటాడు... ఇంతటి ఘరానా మోసగాడైన జిన్నా కాంతయ్య అలియాస్ శ్రీకాంత్ పల్లీ నుంచి నూనె తీసే మిషన్ల పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందాకు శ్రీకారం చుట్టి గత వారం ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. కాంతయ్య చేసిన మోసాలు, అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముంబై మీదుగా నగరానికి... నిజామాబాద్ జిల్లా, మోర్తాడు మండలం సుంకేటు గ్రామానికి చెందిన జిన్నా శ్రీకాంత్‌కు కాంతయ్య, కాంతి, విశ్వకాంత్ తదితర మారుపేర్లూ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే మానేశాడు. బతుకుతెరువు కోసం రూ.1200 చేతపట్టుకుని ముంబై చేరాడు. కొన్ని సంస్థల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్‌గా పని చేశాడు. అరకొర జీతంతో అక్కడ బతకడం కష్టం కావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఆఫ్సెట్/స్క్రీన్ ప్రింటింగ్ సంస్థను ఏర్పాటు చేసి పదేళ్ల పాటు నిర్వహించాడు. ఇదీ లాభసాటిగా లేదని భావించిన శ్రీకాంత్ తన సంస్థలో ముద్రితమవుతున్న ఆకర్షణీయమైన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను చూసి తానూ అలాంటి వాటినే వినియోగించుకుని మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ ‘సీజన్’కు మోసం... ఈ ఘరానా మోసగాడు ఆ సందర్భంలో డిమాండ్ ఉన్న వ్యవహారాన్ని తీసుకుని దాని ఆధారంగా మోసానికి తెరలేపేవాడు. వీటిని ప్రచారం చేయడం కోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఇతర ప్రకటనలు వినియోగించుకునేవాడు. 2007లో రియల్ ఎస్టేట్‌బూమ్ జోరుగా ఉన్న సమయంలో మహాలైఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. తమ సంస్థలో సభ్యులుగా చేరి నెలకు రూ.13,600 చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తే... 150 గజాల స్థలం, రెండు గ్రాముల బంగారంతో పాటు కట్టిన సొమ్ముకు రెట్టింపు ఇస్తామంటూ ప్రచారం చేశాడు. ఈ పేరుతో దాదాపు 3 వేల మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడు. కొంతకాలానికి బోర్డు తిప్పేసిన శ్రీకాంత్ తన సంస్థ పేరును మహాలైఫ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మార్చి మరికొన్ని వ్యవహారాలు సాగించాడు. దీనిపై 2007లోనే సిటీ సీసీఎస్‌లో కేసు నమోదు కావడంతో న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. ఆర్గానిక్ అంటూ మరో అంకం... ఆర్గానిక్ ఉత్పత్తులపై జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో గ్రీన్‌గోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. తమ ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కావాలంటూ ప్రచారం చేసుకుని ఆకర్షితులైన వారి నుంచి డిపాజిట్ల పేరుతో అందినకాడికి దండుకున్నాడు. దీనిపైనా కేసు నమోదు కావడంతో కొందరితో రాజీ కుదుర్చుకున్నాడు. ఆపై ప్లాస్టిక్‌పై నిషేధం ప్రకటన వచ్చిన తరవాత పేపర్ బ్యాగ్స్ తయారీ యంత్రాల పేరుతో జిన్నా ట్రేడింగ్ కంపెనీ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. మార్కెట్లో రూ.300 ఖరీదు చేసే యంత్రాలను తయారు చేయించి వీటిని అంటగట్టి రూ.12,500 నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. దీనిపై గత ఏడాది సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఇతడిపై బోయిన్పల్లి, వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ పోలీసు స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. 2009లో నమోదైన కేసులో బెయిల్ పొంది కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తాజాగా ఉప్పల్ కేంద్రంగా గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థను ఏర్పాటు చేసి పల్లీ నుంచి నూనె తీసే మిషన్ల పేరుతో ఎంఎల్ఎం దందా చేపట్టి రూ.5 కోట్ల వరకు దండుకున్నాడు. మకాం మారుస్తూ ముప్పుతిప్పలు... శ్రీకాంత్ గతంలో మహాలైఫ్ హోమ్స్, మహాలైఫ్ పబ్లికేషన్స్, మహాలైఫ్ క్లినిక్, మహాలైఫ్ మీడియా ఇంక్, మహాలైఫ్ ఇన్నో మార్కెట్స్ ఇంక్, మహాలైఫ్ హోమ్స్ (రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్) సంస్థల ముసుగులోనూ మోసాలు చేశాడు. మొత్తమ్మీద దాదాపు 5 వేల మంది నుంచి రూ.కోట్లలో దండుకున్నాడు. 2013లో ఓ దశలో ఇతడి కోసం పోలీసుల వేట ముమ్మరం చేయడంతో వారికి చిక్కకుండా ఉండేందుకు 20 ఇళ్లు, 28 బ్యాంక్ ఖాతాలు, 30 సిమ్‌కార్డులు, ఆరు పాన్‌కార్డులు మార్చాడు. అయినా అప్పట్లో తీవ్రంగా గాలించిన పోలీసులు శ్రీకాంత్‌తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు భార్యలు మిత, అహల్య, మరోనిందితుడు వెంకటరెడ్డిలను అరెస్టు చేశారు. ఆ విచారణ నేపథ్యంలోనే శ్రీకాంత్ తప్పుడు వివరాలతో పాస్‌పోర్ట్, పాన్‌కార్డులు తదితరాలు పొందినట్లువెల్లడైంది. -
చలి పంజా
చలి పంజా దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. రుతువులు కూడా సహజ కాలాన్ని మరచి మందగమనంతో సాగుతున్నాయి. చలి దుప్పటే ఎక్కువ కాలం జిల్లాను కప్పుతోంది. జనవరి ప్రారంభంలో శిశిర రుతువు (ఆకురాల్చే కాలం) ప్రారంభం కావాల్సి ఉండగా దాని ఊసే లేదు. ఉదయం పూట నులివెచ్చని గాలులు వీచి హాయి గొల్పాల్సి ఉండగా దాని జాడే లేదు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చిలకలూరిపేటటౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవైన శైలిలో క్రమేణా మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాల ప్రభావంతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని రుతువుల మందగమనం కనిపిస్తోంది. కొన్ని రుతువులు కాలపరిమితులు రెట్టింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఏ సీజన్ ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. శీతాకాల, వర్షాకాలాల పరిధి క్రమేణా తగ్గిపోతున్నాయి. రెండు నెలల నిడివిగా ఉండాల్సిన ఒక్కో రుతువు రెట్టింపు నెలలు కొనసాగుతున్నాయి. రుతువులు కూడా తారుమారు.. హేమంత ఋతువు (చలికాలం), గ్రీష్మ (వేసవి కాలం) రుతువుల మధ్య ఉన్న రెండు నెలల కాలాన్నే శిశిర రుతువు అని, దీన్నే ఆకురాలే కాలం అంటాం. ఈ రుతువులో చలి క్రమేణా తగ్గుముఖం పట్టి నులివెచ్చని గాలులు వీయాలిఉంది. జనవరి మాసాంతంలో ఈ రుతువు ప్రభావం ఇప్పుడు పూర్తి మారినట్లు కనిపిస్తోంది. మొదటి పక్షం రోజులు రాత్రి విపరీతమైన చలి వచ్చి తర్వాతి రోజుల్లో ఎండలు పెరుగుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లా అంతటా ఒకే రోజు రాత్రి ఉష్టోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయిన రికార్డు 1936 డిసెంబర్ 31న నమోదైంది. మరో పదేళ్లకి 1946 లో ఒకరోజు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ సగటు ఉష్ణోగ్రత ఆదివారం (21 జనవరి 2018) అర్ధరాత్రి నమోదైంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా 16 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 25న 70 ఏళ్ల కిందట నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని, వచ్చే గురువారం 14 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు డిగ్రీల కనిష్టానికి చేరుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. చలితో పాటు పెరుగుతున్న ఎండ.. వాస్తవానికి జనవరి ముగింపు నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతూ చలిగాలులు, మంచు పడటం చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ గడిచిన ఐదేళ్ల నుంచి శీతోష్ణస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2014లో జనవరిలో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా ఈ ఏడాది జనవరిలో 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రత 2014లో 21 డిగ్రీలుగా నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ నెలలో 16 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎండ పెరిగే కొద్దీ చలి తగ్గాల్సి ఉండగా సమాంతరంగా చలి కూడా పెరగడం గమనార్హం. అనేక రంగాలపై తీవ్ర ప్రభావం.. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ, పాడి పరిశ్రమ రంగాలపై చలి ప్రభావం పడింది. విద్యారంగంలో పరీక్షల ఫీవర్ మొదలు కావడంతో విద్యార్థులు చలిలో తెల్లవారుజామున లేవలేని పరిస్థితి. పాడి పరిశ్రమపై ఆధారపడే పోషకులకు మరో నెలపోతే పాలిచ్చే పశువులన్నీ ఒట్టిపోయే పరిస్థితి. నిర్మాణం, తయారీ రంగాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలు తెల్లవారుజామునే గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకు రావాల్సి ఉండటంతో రవాణా కష్టతరమవుతుంది. ఇక రహదారులను మంచుతెర కప్పుకోవడంతో ఉదయం 9 వరకూ వాహనం తీయలేని పరిస్థితి. అగ్ని పరీక్షలా డ్రైవింగ్.. చలి కాలంలో సర్వీస్‌లకు వెళ్లాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు. ఒక వైపు మంచు, మరోవైపు చలి. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా? అన్న ఎదురుచూపే మాకు దిక్కు. ప్రమాదాలు ఎక్కువ సంభవించే కాలం కూడా ఇదే. చలికి తట్టుకుని డ్రైవింగ్ చేయడం అగ్నిపరీక్షలా మారింది. – ఎస్.నాయక్, హైదరాబాద్ సర్వీస్ ఆర్టీసీ డ్రైవర్ రాత్రి షిప్టులు మానుకున్నా.. నెలలో 15 రోజుల మాత్రమే పరిశ్రమకు వెళ్తున్నా. రాత్రి షిఫ్టులు వేస్తే మానుకున్నా. ఈ చలిలో పనికి వెళ్లాలంటే భయమేస్తోంది. చలి తీవ్రత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు మానుకుంటున్నారు. ఇది సామన్యులకు తీవ్ర నష్టం కలుగజేస్తోంది. ఆరోగ్యానికి ఓటు వేసి ఆగిపోతున్నాం. – కె.బాలు, రోజు కూలి -
పిడుగు పడదు... పైకి లేస్తుంది!
సీజన్లు మారిపోయాయి. పోతే పోయాయి. కానీ తారుమారైపోయాయి! ఈ ఏడాదైతే మరీను. ఎండల్లో వడగండ్ల వానలు పడ్డాయి. వర్షాకాలంలో ఇప్పుడు ఎండలు అదరగొడుతున్నాయి. ఈ విపరీతానికి లేటెస్టుగా పిడుగులూ తోడయ్యాయి! గత ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు 20 మందికిపైగా చనిపోయారు. గుంటూరు జిల్లా పేరేచర్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఓ తాటిచె ట్టయితే పిడుగుపాటుకు భగ్గుమంది. జ్వాలలు పైకి ఎగశాయి. నరకంలోంచి నేరుగా ఎవరో విసిరితే పడినట్టుగా పడిన పిడుగు అది. అసలు పిడుగంటే ఏమిటి? అది పడడం ఏమిటి? ఎక్కడి నుండి పడుతుంది? ఎందుకు పడుతుంది? మేఘం మేఘం డీకొంటే కాంతి వస్తుంది. దాన్ని ‘మెరుపు’ అంటారు. మేఘం మేఘం డీకొంటే శబ్దం వస్తుంది. దాన్ని ‘ఉరుము’ అంటారు. మేఘం మేఘం డీకొంటే క రెంటు పుడుతుంది. దాన్ని ‘పిడుగు’ అంటారు. భూమి మీద ఉండి చూసే మనకు మెరుపు మొదట కనిపిస్తుంది. (ధ్వని కన్నా కాంతి వేగం ఎక్కువ కాబట్టి). తర్వాత ధ్వని వినిపిస్తుంది. మూడో స్టేజ్‌లో... మేఘాల ఒరిపిడి తీవ్రతను బట్టి పిడుగుపాటు ధ్వనిస్తుంది. ఈసారి గమనించండి. ఆకాశంలో మెరుపు మెరిసిందంటే... ఆ తర్వాత కొద్ది క్షణాలకు తప్పనిసరిగా ఉరుము వినిపిస్తుంది. పిడుగు పడింది అని అంటుంటారు కానీ, నిజానికి అది పడడం కాదు. వినపడడం. ధ్వనించడం! ధ్వనించడం అని అనడం దేనికంటే... పిడుగుకి రూపం లేదు. అదేమీ ఇనుప కడ్డీకాదు, ఇతర లోహమూ కదా. దాని కసలు రూపమే లేదు. దాని శబ్దం మాత్రం ఫేడేల్మని గగనం గాజు అయి పగిలినట్టుగా వినిపిస్తుంది. సైంటిఫిక్‌గా చెప్పాలంటే... మేఘంలో ఉన్న రుణ విద్యుదావేశం భూమిని తాకినప్పుడు వచ్చే మెరుపుధ్వనే పిడుగు. మేఘంలో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ చార్జ్‌తో ఉంటే, కింద ఉన్నది నెగటివ్ చార్జితో ఉంటుంది. ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలతో ఉంటాయి. మేఘంలోని నెగటివ ఎనర్జీ, పక్క మేఘంలోని పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే ఆకాశంలో మెరుపు కనిపిస్తుంది. మేఘంలోని నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే పిడుగుపాటు అవుతుంది. పిడుగంటే పైనుంచి కిందికి పడేది అనుకుంటాం కదా. నిజానికి కింది నుంచి పైకి వెళ్లేదే ‘పిడుగు’! ఎందుకంటే భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ తనే వెళ్లి, మేఘంలోని నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే... పిడుగు పడేటప్పుడు మనకు కనిపించే మెరుపు, భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై మేఘాన్ని చేరుతుంది కానీ, మెరుపు... మేఘం నుండి భూమికి చేరదు. సో... పడేది పిడుగు కాదు. పైకి లేచేది పిడుగు. ఇంతకీ మేఘాల్లోని ఈ నెటిటివ్, పాజిటివ్ ఏమిటి? మళ్లీ సైన్స్‌లోకి వెళ్లాలి. సృష్టిలోని ప్రతి పదార్థంలో ఉన్నట్లే మేఘాల్లోనూ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్లు నెగటివ్ ఎనర్జీ. మేఘాలు ఒక చోటి నుంచి ఒకచోటికి ప్రయాణిస్తున్నప్పుడు వాటిల్లో నీరు ఘనీభవించి, ఐస్ అవుతుంది. ఆ ఐస్ గడ్డలు ఒకదానికొకటి తగిలినప్పుడు రాపిడి జరిగి పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్రోటాన్లు మేఘం పైభాగానికి చేరతాయి. అలాగే నెగటివ్ చార్జి ఉండే ఎలక్ట్రాన్లు మేఘం అడుగు భాగానికి చేరతాయి. వీటిని, భూమిపై ఉండే ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీతో మీదికి ఆకర్షిస్తాయి. అప్పుడు పిడుగు పడినట్టవుతుంది. అందుకే భూమీ మీద ఎత్తయిన ప్రదేశంలో ఉండే కొండలు, చెట్లు, ఎత్తయిన మనుషుల ఈ పిడుగు ప్రభావానికి లోనవుతారు. కాబట్టే ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్లకు దగ్గరగా ఉండకూడదంటారు.