చంద్రబాబు స్కిల్ కేసు.. 17A- చట్టం ఏం చెబుతోంది
‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్‌లో అరెస్ట్ అయిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అయితే స్కిల్ కేసులో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని, మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు 17A-చట్టం ఏం చెబుతోంది అనేది తెలుసుకుందాం.
17A-చట్టం పూర్వాపరాలు…
2018 లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17A అనే కొత్త చట్టాన్ని కేంద్ర అమలు చేసింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష్యసాధింపు నుంచి తప్పించేందుకు చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది.17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసంది.
17A-చట్టం ఏంచెబుతోంది..
17A. ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబందించింది ఎంక్వైరీ లేదా ఇంక్వైరీ లేదా విచారణ చేయడానికి సంబంధించిన అంశం ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు లేదు.
a) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి
(b) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి.
(c) నేరము జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి
►ఏసీబీ ట్రాప్‌తో పాటు సంఘటన స్థలంలోనే నేరం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు.
►ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగిన సమయంలో సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి. ఈ గడువు మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉంది.
చదవండి: మరి ఇంత నీచంగా డ్రామాలు ఆడతారా?
17A-ప్రశాంత్ భూషణ్ పిల్లో ఏముంది
►ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారులపై విచారణ ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతుంది. గతంలోనే ఇలాంటి చట్టాలను సుప్రీంకోర్టు రెండుసార్లు కొట్టేసింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు, సలహాలకు సంబంధించిన విచారణ సందర్భంలోనే 17ఏ అమలవుతుంది.
►అయితే జరిగిన నేరం ఉద్యోగి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిందా అని తేల్చడం విచారణాధికారులకు సాధ్యం కాకపోవచ్చు.
►17A ద్వారా పీసీ యాక్ట్ పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అవినీతి పరులు ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని విచారణ నుంచి తప్పించుకనే ప్రమాదం ఉంది.
►విచారణకు ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి పరిస్థితుల్లో కాలయాపన జరిగి నిందితులు సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రమాదం ఉంది… సాక్షులను బెదిరించే ప్రమాదం ఉంది.
►పోలీసులు విచారణ చేసి తనిఖీలు నిర్వహించే అధికారం కోల్పోతారు.. తద్వారా అవినీతి పరులకు తప్పించుకునే వీలు కలుగుతుంది.
17A-కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి
►In Dr.Subramanian Swamy vs Director, Cbi & Anr the Hon’ble Apex Court had already struck down the similar provision which enshrined in Section 6-A of the Delhi Special Police Establishment Act, 1946. The judgment reads as follows-
ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన 6-A చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
17A-కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి
►In Lalita Kumari vs State of UP 2014 (2) SCC 1
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత పోలీసులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎలాంటి అవరోధం ఉండకూడదు…
►In Rajib Ranjan V. R. Vijaykumar (2015) 1 SCC 513
►ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అధారాలుంటే అది ఉద్యోగ బాధ్యత పరిగణించకూడదు.
►In Parkash Singh Badal v. State of Punjab (2007) 1 SCC 1
►ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సిన ర్రక్ష్యణలు ఇప్పటికే చట్టంలో స్పష్టంగా ఉన్నాయి. కేవలం తన లాభం కోసం తీసుకునే నిర్ణయాలను ఉద్యోగ బాధ్యతగా చూపించే ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించకూడదు.
►In Shambhoo Nath Misra v. State of U.P (1997) 5 SCC 326
రికార్డులను తారుమారు చేయడం, ప్రభుత్వ ఖజానాకి నష్టం చేస్తూ లబ్ది పొందడం ఉద్యోగ బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదు.
అసలు పీసీ యాక్ట్ ఏంచెబుతోంది.
►Section 13(1)(c) in The Prevention of Corruption Act, 1988
(c) if he dishonestly or fraudulently misappropriates or otherwise converts for his own use any property entrusted to him or under his control as a public servant or allows any other person so to do;
►ప్రభుత్వ ఉద్యోగి తనకు అప్పగించిన లేదా అతని నియంత్రణలో ఉన్న ఏదైనా ఆస్తిని మోసపూరితంగా దుర్వినియోగం చేయడం, లేదా తన సొంత ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం
►Section 13(1)(d) in The Prevention of Corruption Act, 1988
(d) if he,—(i) by corrupt or illegal means, obtains for himself or for any other person any valuable thing or pecuniary advantage; or
(ii) by abusing his position as a public servant, obtains for himself or for any other person any valuable thing or pecuniary advantage; or
(iii) while holding office as a public servant, obtains for any person any valuable thing or pecuniary advantage without any public interest;
►)అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగి లేదా మరే ఇతర వ్యక్తికి ఏదైనా విలువైన వస్తువును లేదా ఆర్థిక ప్రయోజనాన్ని పొందినట్లయితే..
►పబ్లిక్ సర్వెంట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా అతను లేదా ఏ ఇతర వ్యక్తి ఏదైనా విలువైన వస్తువు లేదా ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం
►) పబ్లిక్ సర్వెంట్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, ఏ వ్యక్తికైనా ప్రజా ప్రయోజనం లేకుండా ఏదైనా విలువైన వస్తువు లేదా ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం;
17A - చంద్రబాబు లాయర్ల వాదనలు…
►17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదు…
►సీఐడీ అధికారులు 17Aను పాటించలేదు కాబట్టి చంద్రబాబుపై ఉన్న అభియోగాలను క్వాష్ చేయాలి
►2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి 2018లో వచ్చిన 17A చంద్రబాబుకు వర్తిస్తుంది
►చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A చంద్రాబాబుకు వర్తిస్తుంద
►చంద్రబాబుకు 17Aవర్తిస్తుంది కాబట్టి ఆయనపై నమోదైన పీసీ-యాక్ట్ అభియోగాలు వెంటనే క్వాష్ చేయాలి
17A - సీఐడీ న్యాయవాదుల వాదనలు
►2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీఎస్టీ స్కిల్ స్కాంలో విచారణ ప్రారంభించింది.
►17A చట్టం రాకముందే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఈ చట్టం చంద్రబాబుకు వర్తించదు
►17A అనేది అవినీతిపరులను కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టం కాదు
►పాత నేరాలకు పాత చట్టాలే అని 17A చట్ట సరవరణలోనే స్పష్టంగా ఉంది
►చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు… ఇది తీవ్రమైన ఆర్ధికనేరం దీనికి 17Aవర్తించదు…
నిజానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)ను 2018లో సవరించారు. కొన్ని పదవుల్లో ఉన్నవారికి అరెస్టు విషయంలో రక్షణ ఉండేలా... తగిన అనుమతితో అరెస్టు చేసేలా ఈ సవరణ చేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం.. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని ప్రతి కోర్టులోనూ చెబుతున్నా.. సుప్రీంకోర్టులో సైతం ఇదే విషయంపై చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించటం గమనార్హం.
అయితే ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది రోహత్గీ సుప్రీంకోర్టులో పేర్కొన్నారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు.
చంద్రబాబు కేసుకు 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టు తీర్పులు ఇచ్చాయని ఆయన తెలిపారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు విచారణను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పునిచ్చిందని రోహత్గీ ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారన రోహత్గీ.. మరి ఆ నిర్ణయాలతో సంబంధం లేకుంటే 17ఏ అనేది ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్ అని అన్న రోహత్గీ.. నేనే నిర్ణయాలకు బాధ్యుడని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు.