Secular party
-
దొంగల రాజ్యానికి రాజులు
పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను ఉద్దేశిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్దిఖీ ఇటీవల ఐఎస్ఎఫ్ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అమలును తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు. -
ఆ పార్టీల పాలనలో తెలంగాణ ఆగమైంది
కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కవిత విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్ వంటి పథకాలతో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటుపడినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకుపైగా టీఆర్ఎస్కు ఖాయమని, కాంగ్రెస్‌కు 70 పైగా సీట్లలో డిపాజిట్ దక్కదన్నారు. సాక్షి,చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్): భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో సెక్యూలర్ పార్టీ టీఆర్ఎస్ మా త్రమేనని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూ ద్ అలీ అన్నారు. కేసీఆర్‌తోనే మైనారిటీల సంక్షే మం సాధ్యపడుతుందన్నారు.శనివారం జిల్లా కేం ద్రం కంఠేశ్వర్ న్యూహౌజింగ్ బోర్డులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కవితతో కలిసి డిప్యూటీ సీఎం విలేకరులతో మాట్లాడారు. ము స్లింల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో అత్యధికంగా రెసిడెన్షియల్ పాఠశాలలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 65 సంవత్సరాలలో దేశాన్ని పాలించిన పాలకుల్లో ముస్లిం సంక్షేమం కోసం పాటుపడింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. షాదీ ముబారక్ ద్వారా లక్షకుపైగా ముస్లిం వధువుల పెళ్లిళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు అవగాహన ఉందనడం వాస్తవం కాదన్నారు. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కలిసే ప్రసక్తే లేదన్నారు. అన్ని మతాలను సీఎం కేసీఆర్ ఒకే దృష్టితో చూస్తున్నారని, అన్నివర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలను ముస్లింలు నమ్మరని, బీజేపీ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదన్నారు. హైదరాబాద్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం ఇద్దరే బీజేపీ కార్పొరేటర్లు గెలిచారని, దాన్ని బట్టి ఆ పార్టీ ప్రభావం ఏమాత్రంగా ఉందనేది ఇట్టే స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలతో ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్‌కు ఈ సారి ఎన్నికల్లో 70 నుంచి 80 సీట్లలో డిపాజిట్ దక్కదన్నారు. కాంగ్రెస్ సెక్యులరిజాన్ని నాశనం చేసిన పార్టీ అనిఆయన విమర్శించారు. గల్ఫ్‌కు వెళ్లి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాజెక్టులను ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.తెలంగాణ అభివృద్ధి చెందకుండా బాబు అడుగడుగునా కుట్ర పన్నుతున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రగతి నిరోధ పార్టీలని ధ్వజమెత్తారు. 100 సీట్లకుపైగా టీఆర్ఎస్ గెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. 1948 నుంచి కాంగ్రెస్ పాలనలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఏనాడు చెప్పలేదని, కాంగ్రెస్‌తో 2004లో పొత్తు పెట్టుకున్న సందర్భంగా అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌తో కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత పార్లమెంట్లో ముస్లింల రిజర్వేషన్ కోసం ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా ఆందోళన చేశారని గుర్తు చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కేసీఆర్కట్టుబడి ఉన్నారని, కచ్చితంగా అమలు చేస్తారని, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయిస్తారని, అప్పటికీ కాకపోతే సుప్రీంకోర్టు తలుపు తడతామన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 50 ఏళ్ల కాంగ్రెస్, 17 సంవత్సరాల టీడీపీ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని, రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని ఆ పార్టీల తీరును విమర్శించారు.ఎన్నికల ముందు ప్రజలను అయోమయం చేయడానికి ఆ రెండు పార్టీల నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. కేవలం నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ముస్లింల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. షాదీ ముబారక్ వంటి అనేకసంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారని, వీరందరిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధకనబరుస్తోందన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్, టీడీపీలు చేసిందేమి లేదన్నారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసినప్పటికీ గల్ఫ్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. 2006 నుంచి 2011 వరకు ఐదేళ్ల కాలంలో ఎన్ఆర్ఐ సెల్‌కు బడ్జెట్లో నయాపైసా విడుదల చేయలేదని, అదే తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2018 వరకు రూ. 100 కోట్లపైగా విడుదల చేసిందని, గల్ఫ్‌లో చనిపోయిన 1,270 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించామని వివరించారు. జిల్లాలో వెనుకబడిన భీమ్‌గల్ ప్రాంతం నుంచి సాగునీటి సదుపాయం లేక ఎక్కువ శాతం మంది యువకులు గల్ఫ్ వెళ్లారని, ఈ విషయాన్ని గ్రహించిన తమ ప్రభుత్వం రూ. 5 కోట్లతో గట్టుపొడిచిన వాగు నిర్మాణం చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తోందన్నారు. జిల్లాలో 17 మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని, 54 ప్రాంతాలను గుర్తించి ఉర్దూ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణకు నిధులు మంజూరు చేయవద్దని, అభివృద్ధి కాకుండా చూడాలని చంద్రబాబునాయుడు 30 లేఖలను కేంద్రానికి రాశారని ఎంపీ కవిత ధ్వజమెత్తారు.విలేకరుల సమావేశంలో అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా, రెడ్‌క్యాప్ చైర్మెన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ నాయకులు కొటపాటి నర్సింహనాయుడు, దాదాన్నగారి విఠల్‌రావు, తారిక్ అన్సారీ, నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మెన్ ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఒక్కటే లౌకిక పార్టీ
పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవంలో టీపీసీసీ చీఫ్ పొన్నాల సాక్షి, హైదరాబాద్: దేశంలో లౌకికవాదాన్ని భుజాన మోయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ 130 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ఎవరూ, ఏమీ చేయలేరన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజమని, కాంగ్రెస్చరిత్ర, దేశంకోసం చేసిన త్యాగం ప్రజలకు తెలుసునన్నారు. ‘‘సాధ్యంకాని హామీలు ఇచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఆ రెండు పార్టీలపై భ్రమలు తొలిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాక్షేత్రంలో పోరాడతాం’’ అని పొన్నాల హెచ్చరించారు. నల్లధనాన్ని వంద రోజుల్లోనే వెనక్కి తెస్తామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని వి.హనుమంతరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి, పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, మల్లు రవి, కొనగాల మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీజేఆర్‌కు నివాళి కాంగ్రెస్ సీనియర్ నేత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఖైరతాబాద్ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పీజేఆర్ చేసిన కృషి మరిచిపోలేనిదని పేర్కొన్నారు. -
మోడీని ప్రజలు విశ్వసించడంలేదు
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో ప్రజలు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్‌లోని సుభాష్ గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని కావాలని కలలు కంటున్న బీజేపీ నేత నరేంద్రమోడీని ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని ఏలాలని చూస్తున్న ఆయనను ప్రజలు ఏ మాత్రం సమర్థించరన్నారు. మత తత్వ పార్టీ అయిన బీజేపీని ప్రజలు దూరం పెట్టాలని కోరారు. తమ పార్టీ పేదల పక్షాన ఉంటే బీజేపీ పెట్టుబడీ దారులకు అండగా ఉంటోందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం తమ పార్టీ ప్రధాన మంత్రులుగా పని చేసిన వారు ఎంతో పాటు పడ్డారన్నారు. పేదలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దళితులు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పాటు పడుతోందన్నారు. మోడీకి విశ్వసనీయత లేదు నరేంద్ర మోడీకి ఏమాత్రం విశ్వసనీయలేదని ఆజాద్ పేర్కొన్నారు. తన గురువు అద్వానీని అణగదొక్కారని, మురళీ మనోహర్ జోషీ ఎంపీ సీటును లాక్కున్నారని, జశ్వంత్‌సింగ్‌ను పార్టీ నుంచే సాగనంపారన్నారు. చివరకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కట్టడి చే శారన్నారు. విభజనను అడ్డుకున్న కిరణ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేత సోనియా గాంధీకే దక్కిందన్నారు. రాష్ట్ర విభజనను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నా ఇచ్చి తీరామన్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్సును ప్రస్తుతం వెతుక్కుంటున్నారన్నారు. ఆయన తనకు తాను బలవంతుడనుకొని భ్రమపడ్డారన్నారు. పార్టీ ముందు అంతా తక్కువేనన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీగా మారిందని గులాం నబీ అజాద్ విమర్శించారు. అధికారం వారి చేతికి వస్తే రాష్ట్రం దోపిడీకి గురవుతుందన్నారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధి కాదన్నారు. టీడీపీని నమ్మవద్దు బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీని ఏమాత్రం నమ్మవద్దని ఆజాద్ పేర్కొన్నారు. ఆ పార్టీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి సెక్యులరిజాన్ని తుంగలో తొక్కిందన్నారు. ఇప్పుడు తిరిగి అదే పార్టీతో జతకట్టినందున దూరం పెట్టాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చెర్మైన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆత్మ చెర్మైన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వసంత్, మంకాల్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం సిద్దిపేట జోన్: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని గులాంనబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోనియాగాంధీ జాతీయ పార్టీలను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రాబల్యం నామమాత్రమేనన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవా కొనసాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించారు. మోడీ గాలి కేవలం అకాశంలోనే నడుస్తోంది తప్ప భూమిమీద కాదని చమత్కరించారు. -
ఐక్యంగా పోరాడుదాం..రండి
దళితులు, బీసీలకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపు రాజకీయ ముఖచిత్రం మార్చేద్దాం బీజేపీకి అధికారం రాకుండా కట్టడి చేద్దామని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: దళితులు, వెనకబడిన తరగతులు, మైనార్టీ వర్గాల వారు కలిస్తే రాజకీయ చిత్రమే మారిపోతుందని, ఇందుకు వారంతా కలసిరావాలని మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. కలిసి పోరాడితే రాజ్యాధికారం మనదవుతుందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాలను శాసించే బలమైన శక్తిగా ఆవిష్కృతమవుతామని పేర్కొన్నారు. పార్టీ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయపరంగా దళితులు, బీసీలు, మైనార్టీలకు ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు. సెక్యులర్ పార్టీల మధ్య పోరు ఎన్నికల్లో మతతత్వ శక్తులకు లాభం చేకూర్చకుండా చూసుకోవాలని రాజకీయ పక్షాలకు అసదుద్దీన్ సూచించారు. మతతత్వ బీజేపీ అధికారంలోకి రాకుండా చేసి దేశాన్ని సెక్యులర్‌గా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ పాలన బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు తప్పదని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వల్ల సాధించినది ఉమ్మడి రాజధానికి గవర్నర్ పాలన మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ గులాంగిరీ చేసేవారిని, కారుడ్రైవర్నైనా గవర్నర్‌గా నియామిస్తుందని.. ఒకవేళ మోడీ ప్రధాని అయి మరొకరిని గవర్నర్‌గా నియమిస్తే.. మైనార్టీలకు రక్షణ, భద్రత ఎలా సాధ్యమవుతుందని అసద్ వ్యాఖ్యానించారు. ఠ మజ్లిస్‌ను అంతం చేయాలనుకున్న వారికి తమతో హైదరాబాద్‌లో రాజకీయంగా తలపడేందుకు ధైర్యం చాలడం లేదని... అభ్యర్థులు కూడా దొరకడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే రాజకీయంగా అంతమైందని.. తెలుగుదేశం మైదానం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలను పురస్కరించుకొని త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించి సత్తా చాటుతామని అసదుద్దీన్ చెప్పారు. మైనార్టీల అభివృద్ధి వైఎస్ఆర్ చలవే: అక్బరుద్దీన్ రాష్ట్రంలో మైనార్టీల విద్యాభివృద్ధి ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలుగుదేశం పాలనలో మైనార్టీల బడ్జెట్ రూ. 32 కోట్లను మించలేదని... ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లపైనే ఉందని ఆయన చెప్పారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ, బీసీలతో సమానంగా మైనార్టీలకు ఉపకార వేతనాలు సాధించామని, ప్రస్తుతం మైనార్టీల ఉపకార వేతనాల కోసం కేటాయింపు రూ. 389 కోట్ల పైనే ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు కేటాయించే నిధుల కంటే.. రాష్ట్రంలో వారికి అందుతున్న ఉపకార వేతనాలు అధికమని తెలిపారు. -
కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా విపక్ష కూటమి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్ల చీలిక ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అవే పక్షాలు వ్యూహాత్మకంగా ఏకమై సవాలు విసురుతుండడంతో ఆందోళన చెందుతోంది. బీజేపీ ఓట్లను కేజేపీ, తన వ్యతిరేక ఓట్లను జేడీఎస్ గణనీయంగా చీల్చినప్పటికీ కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతో అందలం ఎక్కింది. ముఖ్యంగా కేజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చీల్చిన ఓట్ల వల్ల బీజేపీ సుమారు 32 స్థానాల్లో ఓడిపోయింది. అందులో 26 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. కనీస మెజారిటీ కంటే ఆ పార్టీకి తొమ్మిది స్థానాలు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ లెక్కలు చూసుకునే ఆ పార్టీ హైరానా పడుతోంది. ముఖ్యంగా జేడీఎస్‌కు సహకరిస్తున్నందుకు బీజేపీపై మండి పడుతోంది. మరో వైపు సెక్యులర్ పార్టీ అని పేరు పెట్టుకున్న జేడీఎస్, బీజేపీతో చేతులు కలపడాన్ని తూర్పారబడుతోంది. ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఈ మూడు పార్టీల సహకారం క్షేత్ర స్థాయిలో విజయవంతమైతే కాంగ్రెస్‌కు శృంగ భంగం తప్పక పోవచ్చు. అన్ని చోట్లా అవగాహన బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఈ రెండు స్థానాలూ జేడీఎస్‌వే. ప్రస్తుతం ఆ పార్టీకి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థులను బరి నుంచి తప్పించింది. సంప్రదాయికంగా ఈ రెండు స్థానాల్లో జేడీఎస్‌కు గట్టి పట్టుంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రెండున్నర లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల సర్దుబాటుకు ఓటర్ల ఆమోదం లభిస్తే కాంగ్రెస్‌కు చిక్కులు తప్పకపోవచ్చు. ధార్వాడ, మైసూరు, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 22న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో జేడీఎస్ ఎక్కడా అభ్యర్థులను నిలపలేదు. చిత్రదుర్గ, ధార్వాడలలో బీజేపీ పోటీ చేస్తోంది. కేజేపీ మైసూరు నుంచి పోటీ పడుతోంది. ధార్వాడలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా కేజేపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. మైసూరులో కేజేపీ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థిని రంగం నుంచి తప్పించింది. హఠాత్తుగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులను అప్రమత్తం చేశారు. ఈ ఉప ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. కాగా శాసన మండలి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. -
ఇప్పుడీ ఉప ఎన్నికలు అవసరమా?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రస్తుత లోక్‌సభ గడువు మరో తొమ్మిది నెలల్లో ముగియనున్న తరుణంలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అవసరమా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి అధికార దాహం వల్లే ఈ స్వల్ప కాలానికి ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చిందని విమర్శించారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో నగర శివార్లలోని గొట్టిగెరె వద్ద నైస్ రోడ్డు పక్కన బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుటుంబ రాజకీయాలంటే దేవెగౌడకు ఎక్కడలేని కోపం వస్తుందని ఎద్దేవా చేస్తూ.. ఆయన చేసేవంతా కుల రాజకీయాలేనని ధ్వజమెత్తారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకున్న జేడీఎస్ ఇకమీదట సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జేడీఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఏకమయ్యాయని ఆరోపించారు. ఆయన కుటుంబం తప్ప ఇంకెవరైనా పచ్చగా ఉంటే దేవెగౌడ సహించరని విమర్శించారు. వారికి అండగా నిలిచిన వారినే రాజకీయంగా అంతమొందిస్తారని ఆరోపించారు. ‘వాళ్లింట్లో ఎప్పుడూ పండుగ భోజనాలుండవు, చావు భోజనాలే’ అని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ఏనాడూ లోక్‌సభకు హాజరైన పాపాన పోలేదని, ఇప్పుడు ఆయన సతీమణి అనితను గెలిపిస్తే లోక్‌సభ సమావేశాలకు హాజరవుతారా అని ప్రశ్నించారు. కనుక ఆమెతో పాటు మండ్యలో జేడీఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జేడీఎస్‌తో అంతర్గత ఒప్పందం ద్వారా రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలపనందుకు ఆయన బీజేపీని తూర్పారబట్టారు. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో రెండున్నర లక్షల ఓట్లను పొందిన ఆ పార్టీ, ఇప్పుడు తమ అభ్యర్థిని పోటీ చేయించడం లేదంటూ ‘బీజేపీ వారికి సిగ్గు లేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రసంగించిన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర బీజేపీ మద్దతు తీసుకుంటున్న దేవెగౌడ, రేపు లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతిస్తారా అని నిలదీశారు. తమ పార్టీ అభ్యర్థిగా బెంగళూరు గ్రామీణ స్థానంలో పోటీ చేస్తున్న డీకే. సురేశ్, 2014 ఎన్నికల్లో కూడా బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ప్రసంగించారు.