Security company
-
న్యాయమూర్తుల రక్షణకు భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల రక్షణకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) మాదిరిగా భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశం సలహా ఇవ్వదగినది కాదని పేర్కొంది. ధన్‌బాద్ న్యాయమూర్తి హత్య కేసు సమోటో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు స్పష్టం చేశారు. న్యాయమూర్తుల భద్రతను తీవ్రంగా పరిగణించాల్సి అంశంగా తుషార్ మెహతా పేర్కొన్నారు. సమోటో కేసుకు సంబంధించి గత విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటరు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ నెల 14న కేంద్రం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ తరహాలో భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యంకాదు, సలహా ఇవ్వదగినది కాదు’’ అని అఫిడవిట్లో పేర్కొంది. ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు స్థానంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాలు అమలు చేస్తే చాలని పేర్కొంది. విచారణలో భాగంగా.. రాష్ట్రాలతో కలిసి చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది. హోం కార్యదర్శులతోనా, పోలీసు చీఫ్‌లతో ఎవరితో సమావేశం నిర్వహించాలని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. సీసీటీవీలకే సొమ్ములు లేవని రాష్ట్రాలు చెబుతున్నాయని, రాష్ట్రాలు, కేంద్రం తేల్చుకోవాల్సి అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారో పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే దాఖలు చేయాలని ఆదేశించిన పలు రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయా రాష్ట్రాలు రూ.లక్ష జరిమానా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని పేర్కొంది. మణిపూర్, జార్ఖండ్, గుజరాత్‌లు సోమవారం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్రం కౌంటరు దాఖలు చేసిందని తెలిపింది. కేరళ తరఫు న్యాయవాది పదిరోజులు సమయం కోరగా అనుమతించిన ధర్మాసనం మిగిలిన రాష్ట్రాలు కూడా పది రోజుల్లో దాఖలు చేయాలని, రూ.లక్ష సుప్రీంకోర్టు బార్ అసోసియేన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని స్పష్టం చేసింది. పది రోజుల్లో దాఖలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. -
నిర్బంధంలో ఇంకా 150 మంది
గాయపడిన వారిని మాత్రమే బయటకు పంపిన సంస్థ తాడిపత్రి : పొట్ట చేత పట్టుకుని ఒడిశా నుంచి వచ్చిన వారిపై నిర్దాక్ష్యిణ్యంగా వ్యవహరించారు.. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ.. కనీసం కార్మాగారం నుంచి కూడా బయటకు రానీకుండా నిర్బంధించి పని చేయించుకున్నారు. కార్మికులకు, కర్మాగారంలోని సెక్యూరీటి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది గాయపడితే.. వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన యాజమాన్యం ‘సెక్యూరీటి సిబ్బందిపైనే దాడి చేస్తారా?’ అంటూ 200 మందిని నిర్బంధంలో ఉంచింది. చివరకు ఎలాగోలా కార్మికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ఉక్కు కర్మాగారంతో పాటు స్థానిక అధికారులతో లాలాచీ పడి కొంత మందిని మాత్రమే మంగళవారం రాత్రి ఒడిశాకు రెలైక్కించారు. ఇంకా 150 మందికి పైగా కార్మికులు ఫ్యాక్టరీలో నిర్బంధంలోనే ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఎన్సీసీ అనే కన్స్ట్రక్షన్ సంస్థ చందన, జేఎం అనే మరో సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. తాడిపత్రిలోని గెర్డెవ్ ఫ్యాక్టరీలో నిర్మాణ పనులు చేయిస్తున్న ఈ సంస్థలు ఈ ఏడాది మే నెల నుంచి ఒడిశాకు చెందిన కార్మికులను దశల వారీగా సుమారు 200 మందిని ఇక్కడికి పిలిపించుకుని పని చేయిస్తున్నాయి. జీతాల విషయంలో కాంట్రాక్టర్, కార్మికుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొంత మంది వాదనకు దిగారు. అయితే ఏం చేయలేని స్థితిలో ఉన్న కార్మికులు అక్కడే మగ్గుతున్నారు. కొంత కాలం క్రితం కార్మికులు ఫ్యాక్టరీ బయటకు వెళ్లి మద్యం బాటిళ్లతో తిరిగి లోపలికి వస్తుండగా గేట్ వద్ద సెక్యూరిటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ మద్యాన్ని తాగడాన్ని గమనించిన కార్మికులు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో కొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సెక్యూరిటీ చీఫ్ కుట్టి, సహాయకుడు సంజయ్ బెనర్జీలు కార్మికులను తీవ్ర స్థాయిలో హెచ్చరించి.. యాజమాన్యం సహకారంతో మొత్తం ఒడిశా కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్నారు. గాయపడ్డ వారికి ఫ్యాక్టరీలోని ఆస్పత్రిలోనే చికిత్స చేయించి గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. సెల్ఫోన్లూ లాక్కునట్లు తెలిసింది. ఎట్టకేలకు ఓ కార్మికుడు ఫోన్ దొరకబుచ్చుకుని ఒడిశాలోని కుటుంబ సభ్యులకు తాము నిర్బంధంలో ఉన్న విషయాన్ని వివరించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
కష్టపడి పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు
పాడేరు, న్యూస్‌లైన్: కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గిరిజ న సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా లో రక్ష సెక్యూరిటీ సంస్థలో జూన్ నెల నుంచి సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందుతున్న గిరిజన యువకులు సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వినూత్నంగా ఆ యువకుల తల్లిదండ్రులతో ఆదివా రం ఫోన్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన పాడేరు ఐటీడీఏకు ఫోన్ చేసి శిక్షణ పొందిన యువకుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తాను ఇటీవల రక్ష సెక్యూరిటీ శిక్షణ సంస్థను సందర్శించానని, మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారని చెప్పారు. అన్ని వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంస్థలో ఉద్యోగాలు చేయడం ద్వారా మంచి జీతభత్యాలు లభిస్తాయని, చక్కని భవిష్యత్ ఏర్పడుతుందని భరోశా ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన యువకులపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేసినట్టు తెలి పారు. తమ బిడ్డలకు ఇతర రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ర్టంలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు తల్లిదండ్రులు కమిషనర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన పనిచేయాలన్నారు. తాను బీహార్‌కు చెందిన వాడనని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే సూపర్వైజర్ స్థాయికి ఎదిగి మరింత ఎక్కువ జీతభత్యాలు పొందుతారని తెలిపారు. అనంతరం రక్ష సంస్థలో శిక్షణ పొందుతున్న జీకే వీధి మండలం సంకాడ గ్రామానికి చెందిన సాగిన రాజుపడాల్, డుంబ్రిగుడ మండలం సంతవలస, కండ్రుం గ్రామాలకు చెందిన కుమిడి రామరాజ్యం, మఠం శంకరరావు తదితరులు తమ తల్లిదండ్రులతో ఈ ఫోన్లో మాట్లాడారు. శిక్షణ బాగుందని, అన్ని సౌకర్యాలు కల్పించారని, సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నామని సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ కాఫీ సీనియర్ సహాయకులు ఎం.వెంకటేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం జాబ్స్ ఎం.కరుణానిధి, జేడీఏంలు సత్తిరాజు, సతీష్, డీసీసీబీ డెరైక్టర్ బి.నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.