security features
-
అఫ్గాన్‌లో భద్రతా దళాల స్థావరంపై దాడిలో 24 మంది మృతి
కాబుల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలపై కొందరు వ్యక్తులు దాడులు జరిపారు. దక్షిణ అఫ్గాన్‌లోని జాబుల్లో ఉన్న స్థావరంపై శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో భద్రతా దళాలకు చెందిన 24 మంది మృతి చెందారు. భద్రతా దళాలు నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు సైనికులపై దాడికి పాల్పడినట్లు అఫ్గాన్ అధికారులు వివరించారు. ఈ ఘటనలో అఫ్గాన్ ఆర్మీ దళానికి చెందిన 14 మంది, 10 మంది పోలీసులు మరణించినట్లు తెలిపారు. మరో నలుగురు అధికారుల జాడ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. -
ట్రంప్ కారులో ఏమున్నాయో తెలుసా?
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడంటే ఆషామాషీ విషయం కాదు. ఆయన భద్రత కోసం అత్యంత భారీ ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు ఆయన ఉపయోగించే కారు విషయంలో అక్కడి అధికారులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ట్రంప్ కొత్త కారును అందరూ ముద్దుగా 'బీస్ట్' అని పిలుచుకుంటారు. ఇది 1.2ఎం కాడిలాక్ కారు. దీని డోర్ల మందం 8 అంగుళాలు. రోడ్డుమీద ఈ కారు వెళ్తుంటే దాని పక్కనే శక్తిమంతమైన బాంబు పేలినా లోపలున్నవాళ్లకు ఏమీ జరగదు. అలాగే, ఒకవేళ రసాయన ఆయుధాలతో దాడి చేసినా.. ఏమాత్రం ఇబ్బంది కలగకుండా లోపల ఆక్సిజన్ అందించే వ్యవస్థ ఉంది. జనరల్ మోటార్స్ సంస్థ ఈ కారును సిద్ధం చేస్తోంది. వాస్తవానికి జనవరిలోనే దీన్ని ఇవ్వాలని అనుకున్నా, ఈ నెలాఖరుకు అందుతుందని చెబుతున్నారు. ఇలాంటివి మొత్తం 12 కార్లు ఉంటాయి. వీటి ఖరీదు దాదాపు వంద కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లు ఇవేనని అంటున్నారు. ఒక్కో కారు బరువు 8 టన్నులు ఉంటుంది. బోయింగ్-757 విమానానికి ఉండేలాంటి తలుపులు ఉంటాయి. ఇవి జీవ, రసాయన దాడులను సైతం తట్టుకోగలవు. కవచాలను చీల్చగల బుల్లెట్లను సైతం కారు ముందు అద్దం ఆపగలదు. దాని మందం ఐదు అంగుళాలు. కారు కింది భాగం కూడా అత్యంత పటిష్ఠంగా ఉండటంతో.. దాని కింద బాంబు పేలినా కిందిభాగం గానీ, ఇంధన ట్యాంకు గానీ ఏమాత్రం చెక్కుచెదరవు. డ్రైవర్‌కు పక్కసీటు పక్కనే తలుపు వద్ద అత్యాధునిక ఆయుధాలు, ట్రంప్ గ్రూప్ రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి. అత్యవసరంగా ఆయనకు రక్తం ఎక్కించాల్సి వచ్చినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. కారు ముందుభాగంలోని బంపర్ల వద్ద టియర్ గ్యాస్ గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి. ఎవరైనా గుంపుగా వచ్చి కారు ఆపినా, వెంటనే కారులోంచే బాష్పవాయు గోళాలు ప్రయోగించవచ్చు. హెడ్లైట్ల పక్కనే నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. వెనుక భాగంలో అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంటాయి. ఇక కారు డ్రైవర్‌కు ప్రత్యేకంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు శిక్షణ ఇస్తారు. క్లిష్టపరిస్థితులు తలెత్తినప్పుడు 180 డిగ్రీల జె టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది. అతడి వద్ద ఉండే డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది. -
యూజర్లకు గూగుల్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మెసెజింగ్ సర్వీస్ జీమెయిల్ యూజర్లకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ కొన్ని సూచనలు చేసింది. వచ్చే ఫిబ్రవరి 13 నుంచి జీమెయిల్ యూజర్లు జావా స్ర్కిప్ట్ ఫైళ్లను రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల వైరస్ ల కారణంగా జీమెయిల్ యూజర్లను ఇందుకు సంబంధించిన ఫైళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 తర్వాత నుంచి జావా స్క్రిప్ట్ ఫైళ్లను సెండ్ చేస్తే మెస్సేజ్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని డైలాగ్ బాక్స్ వస్తుందని సంస్థ తెలిపింది. యూజర్లకు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వైరస్ల నుంచి ఇన్‌బాక్స్, సెంట్ మెయిల్స్, ఇతరత్రా డాటాను సెక్యూర్ చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జీమెయిల్ నుంచి .exe, .msc, and .bat ఫైళ్లను, వీటికి సంబధించిన ఫైల్ అటాచ్‌మెంట్స్‌ను పంపడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో .జేఎస్ (జావా స్క్రిప్ట్) ఫైళ్లను వేరే యూజర్లను పంపాల్సి వస్తే అందుకు గూగుట్ డ్రైవ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర స్టోరేజ్ సౌకర్యం ఉన్న సర్వీసు నుంచి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చునని గూగుల్ వివరించింది. జీమెయిల్ సర్వీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.