sedition cases
-
దేశద్రోహ చట్టంపై స్టే
న్యూఢిల్లీ: బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం వెలువరించింది. చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కూడా నిలిపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తమ తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని పేర్కొంది. దీనిపై జూలై మూడో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ‘‘ఆలోపు దేశద్రోహ చట్టం కింద కొత్త కేసులు పెట్టడం వంటివి జరిగితే బాధితులు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు. మా ప్రస్తుత ఆదేశాలకు అనుగుణంగా ఆయా కోర్టులకు వారికి తగిన ఊరట కల్పించాలి’’ అని సూచించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. ఈ కాలానికి నప్పదు ‘‘దేశద్రోహ చట్టం (124ఏ) ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదు. దేశ భద్రతకు, సమగ్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన కూడా అర్థం చేసుకోదగినదే. కానీ ప్రభుత్వ ప్రయోజనాలు, పౌరుల ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరం. కష్టమే అయినా దాన్ని సాధించడం తప్పనిసరి’’ అంటూ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం పునఃసమీక్షకు కేంద్రానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ఆలోపు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ దేశద్రోహ చట్టం కింద ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లూ నమోదు చేయవని, ఇప్పటికే నమోదైన కేసుల్లో విచారణ కొనసాగించబోవని ఆశిస్తున్నాం. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును గత విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మా ముందుంచారు. హనుమాన్ చాలీసా కేసు వంటి పలు ఉదాహరణలను మా దృష్టికి తెచ్చారు. అందుకే పునఃసమీక్ష ముగిసేదాకా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా ఉండటమే సరైందని భావిస్తున్నాం’’ అని జస్టిస్ రమణ తన తీర్పులో పేర్కొన్నారు. చట్టంపై స్టే విధించే బదులు దేశద్రోహ చట్టం కింద నమోదైన కేసుల విచారణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారిని నియమించాలని కేంద్రం సూచించగా ధర్మాసనం అంగీకరించలేదు. ఇది కేసు పెట్టదగిన నేరాలకు సంబంధించిన చట్టం గనుక దాని కింద ఎఫ్ఐఆర్ల నమోదును నిరోధించలేమని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా దేశద్రోహ చట్టాన్ని సమర్థించిందని గుర్తు చేశారు. కేంద్రం లేవనెత్తిన ఈ అంశంపై సంప్రదింపుల నిమిత్తం విచారణను ధర్మాసనం కాసేపు నిలిపేసింది. అనంతరం తిరిగి విచారణ చేపట్టింది. ‘‘కేంద్రం లేవనెత్తిన అంశాన్ని కూలంకషంగా పరిశీలించాం. సదరు చట్టాన్ని (సుప్రీంకోర్టు వంటి) సాధికార ఫోరం సమీక్షించవచ్చని కేంద్రం కూడా నాటి విచారణ సందర్భంగా అంగీకరించింది’’ అని వ్యాఖ్యానించింది. అన్ని అంశాలనూ లోతుగా పరిశీలించిన తర్వాతే దేశద్రోహ చట్టం అమలుపై స్టే విధించాలని నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. ఇతరత్రా కూడా ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలిచ్చేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది. 10 పేజీల తీర్పును జస్టిస్ రమణ రాశారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల దేశద్రోహ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ‘పౌర స్వేచ్ఛను, మానవ హక్కులను పరిరక్షించాల్సిన అవసరముంది’ అని వ్యాఖ్యానించారని తీర్పులో ఆయన ప్రస్తావించారు. స్టే సరికాదు: కేంద్రం దేశద్రోహ చట్టంపై పునఃసమీక్ష జరిగేదాకా కేసుల విచారణను, దానికింద కొత్త కేసుల నమోదును నిలిపేస్తారా అని మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించడం, 24 గంటల్లోగా వైఖరి తెలిపాలని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం అభిప్రాయాలతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు. స్టే విధింపుకు కేంద్రం వ్యతిరేకమని తెలిపారు. ఈ చట్టం కింద పెండింగులో ఉన్న కేసుల్లో బెయిల్ అభ్యర్థనలను ఆరోపణల తీవ్రతకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చన్నది కేంద్రం ఉద్దేశమన్నారు. ‘‘ఎందుకంటే ఆ కేసుల్లో ఉగ్రవాద, మనీ లాండరింగ్ వంటి కోణాలు కూడా ఇమిడి ఉండొచ్చు. ఏమైనా దేశద్రోహ చట్టం కింద పెండింగ్ కేసులన్నీ కోర్టుల ముందే ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాలపై నమ్మకముంచాలి’’ అని మెహతా వ్యాఖ్యానించారు. లక్ష్మణరేఖ దాటొద్దు: కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థలు లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి. ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు. పార్టీల స్పందనలు సత్యం కోసం నినదించే గళాలను ఎంతోకాలం తొక్కిపెట్టలేరని సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మరోసారి రుజువైంది. నిజం చెప్పడం దేశభక్తే తప్ప దేశద్రోహం కాదు. వాస్తవాలను చెవికెక్కించుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రశ్నించే గొంతుకలను అణిచేయడం అహంకారం. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామన్న కేంద్రం సూచనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 1,500కు పైగా కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా రద్దు చేసింది. – బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ దేశంలో విభజన తీసుకొచ్చేందుకు 2014 నుంచీ దేశద్రోహ చట్టాన్ని మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోంది. అందుకే కేంద్ర పునఃసమీక్ష దాకా ఆగకుండా దాన్ని సుప్రీంకోర్టే పూర్తిగా రద్దు చేయాలి – సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. దేశద్రోహ చట్టం రద్దు కోసం 2011లోనే రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల బిల్లు పెట్టాం – సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మోదీ సర్కారుపై గళమెత్తిన వారందరిపైనా దేశద్రోహ చట్టం ప్రయోగిస్తున్నారు. ఈ పోకడకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ చదవండి👉Bangalore: కోటి వాహనాల ఐటీ సిటీ -
టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న భార్యపై కేసు పెట్టిన భర్త
UP Man Files Police Case Against Wife For Celebrating Pakistan Win Over Team India: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఓ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇల్లాలు చేసిన పని ఆమె కాపురాన్ని కూల్చింది. సదరు ఇల్లాలు పాక్‌కు మద్దతు తెలుపుతూ.. భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. షంగన్‌ఖేడాకు చెందిన ఇషాన్ మియా, రబియా షంషీ ఇద్దరు భార్యాభర్తలు. అక్టోబర్ 24న పాక్ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం రబియా, ఆమె కుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాట్సాప్ స్టేటస్‌లోనూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఇషాన్.. భార్య రబియా షంషీ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో స్థానిక పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..! -
పాక్ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు: యూపీ సీఎం
Those Celebrating Pakistan Win To Face Sedition Charges: టీ20 ప్రపంచకప్-2021లో భారత్‌పై పాక్ గెలుపొందిన అనంతరం సంబురాలు చేసుకున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అలా చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సీఎం ఆదేశాలతో యూపీ పోలీసులు ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. पाक की जीत का जश्न मनाने वालों पर देशद्रोह लगेगा: मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज pic.twitter.com/34DEij8y3t — Yogi Adityanath Office (@myogioffice) October 28, 2021 వీరిలో నలుగురు పాక్ అనుకూల నినాదాలు చేశారని రుజువు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్ తొలిసారి పాక్ చేతిలో ఓటమిని చవిచూడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. UP Police have booked 7 people in 5 districts and taken 4 people in custody for allegedly raising pro-Pak slogans or celebrating Pakistan's victory over India in the T20 Cricket World Cup match that took place on Oct 24: CMO pic.twitter.com/o1ceq5L7ED — ANI UP (@ANINewsUP) October 27, 2021 అయితే, భారత్‌లో ఉంటున్న కొందరు మాత్రం పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ.. పాక్ అనుకూల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన నఫీసా అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ఇందుకు ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు -
బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ గురించి మాట్లాడితే రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని.. అయినా భయపడేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎలాంటి చర్చ జరుగుతోందో ముందు ఆయన తెలుసుకోవాలని సూచించారు. చట్టాలు కేటీఆర్‌కు చుట్టాలు కావని, కేసులు పెడితే ఏం చేయాలో తమకూ తెలుసునని చెప్పారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరారు. ‘డ్రగ్స్ వినియోగంపై నేను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదు. యువతకు ఆదర్శంగా ఉండేందుకే ఈ చాలెంజ్ విసురుతున్నా. ఏ విషయంలోనైనా యువతకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అందుకే గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ కూడా స్వీకరిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ చాలెంజ్ విసురుతున్నా. ఇద్దరూ స్వీకరించండి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా. మీరూ రండి. అందరం వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు రక్త నమూనాలు, వెంట్రుకలు ఇద్దాం’ అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌తో తనకేం సంబంధం లేదని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఇది తన ఆరోపణ కాదని.. ఈడీనే కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిందన్నారు. ఎక్సైజ్ శాఖ విచారణను అడ్డుకున్నది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. చదవండి: ఫాల్తూ మాటలు మాట్లాడితే ‘దేశద్రోహమే’ గోతికాడ నక్క బీజేపీ... తెలంగాణ ఈ దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురుచూస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తప్పుడు చరిత్రను మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు రాంజీ గోండు, కాశీంరిజ్వీ గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ కనీసం 100 సంవత్సరాల తేడా ఉందని చెప్పారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనల్లో గోండు బిడ్డ సోయం బాపూరావు ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలని, అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పించాలని తాము కోరినా బీజేపీ టైం ఇప్పించలేదని చెప్పారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్, నరేంద్రమోదీ.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలపై కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేనని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మానుకోవాలని, వాళ్ల రిమోట్ కేసీఆర్ చేతిలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాతో తమకు కొత్త బలం వచ్చిందని, కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amit Shah: 2023లో మాదే అధికారం -
శశిథరూర్ సహా ఏడుగురిపై దేశద్రోహం కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనలపై ట్వీట్లతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మరో ఆరుగురు జర్నలిస్టులపై మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటాక భోపాల్‌లో శశిథరూర్, ఇండియా టుడే జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్, నేషనల్ హెరాల్డ్ సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్ మృణాల్ పాండే, క్వామి అవాజ్ ఎడిటర్ జఫర్ అఘా, ది కార్వాన్ మ్యాగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ పరేష్ నాథ్, ఎడిటర్ అనంత్ నాథ్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వినోద్ కే జోస్‌తోపాటు మరో వ్యక్తిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎర్రకోట వద్ద ఆ రోజు చెలరేగిన హింసపై ట్విటర్లో వారు షేర్ చేసిన సమాచారం జాతీయ భద్రతకే ముప్పులా మారిందని సంజయ్ రఘువంశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసు వెనక్కి తీసుకోవాలి: ఎడిటర్స్ గిల్డ్ సీనియర్ జర్నలిస్టులపై నమోదైన పోలీసు కేసుల్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ రకంగా కేసులు నమోదు చేయడం మీడియాని బెదిరించడమేనని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ఎఫ్ఐఆర్లు వెంటనే వెనక్కి తీసుకొని మీడియా నిర్భయంగా, స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించాలంది. మృణాల్ పాండేపై కేసు నమోదవడాన్ని ది ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్స్ (ఐడబ్ల్యూపీసీ)ఖండించింది. -
చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దాదాపు మూడువేల మందిపైన ‘దేశ ద్రోహం’ నేరం కింద జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు మంగళవారం కేసు పెట్టారు. వాటన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు మరుసటిరోజే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న హక్కుల గురించి రాసిన శిలా ఫలకాలను ఊరూరా ఏర్పాటు చేసినందుకు గత నవంబర్‌లో కూడా పదివేల మందిపై కుంతీ జిల్లా పోలీసులు ‘దేశ ద్రోహం’ నేరం కిందనే కేసులు పెట్టారు. వాటిని గత నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్ కేబినెట్ నిర్ణయం తర్వాత కొట్టివేశారు. ఇలా తప్పుడు కేసులు పెట్టడం తప్పంటూ ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించి వాటిని ఎత్తివేసినప్పటికీ జార్ఖండ్ పోలీసులు తమ వైఖరి మార్చుకోక పోవడం ఆశ్చర్యం. బ్రిటీష్ వలస పాలకుల కాలం నాటి మనస్తత్వం నుంచి ఇంకా బయట పడడం లేదు. ఈ మనస్తత్వం ఒక్క జార్ఞండ్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, వాటిపై నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేసి దేశ ద్రోహం నేరం కింద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారంటూ కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం లేదు. 2014 నుంచి 2016 మధ్య దేశంలో కొన్ని వందల మంది మీద దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టగా వాటిలో రెండంటే రెండు కేసులు మాత్రమే నిలబడ్డాయి. మిగితా వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. ‘ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం ఎన్నటికీ కాదు. పైగా అది భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు’ అని 1962లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. 2016లో కూడా దేశ ద్రోహం కేసులు తన దృష్టికి వచ్చినప్పుడు ఈ తీర్పునే పునరుద్ఘాటించింది. ఇలాంటి తీర్పులన్నీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతున్నాయి. -
చిచ్చు రేపిన ఎర్రబస్సు
- డ్రైవర్, కండక్టర్లపై దేశద్రోహం కేసులు నమోదు - ‘జై మహారాష్ట్ర’ నినాదంతో బెల్గాంకు ఎంఎస్ ఆర్టీసీ బస్సు - కర్ణాటక సర్కారు ఆగ్రహం.. తీవ్ర చర్యలకు ఆదేశం - డ్రైవర్, కండక్టర్ సహా 16 మందిపై తీవ్ర అభియోగాలు - ‘బెల్గం విభజన’పై ఇరురాష్ట్రల మధ్య ఉద్రిక్తత బెల్గాం/ముంబై: ‘ఎర్రబస్సు’ రాజేసిన చిచ్చు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తతకు దారితీసింది. ‘జై మహారాష్ట్ర’ అనే నినాదం రాసిఉన్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును కర్ణాటక పోలీసులు బెల్గాంలో అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్లతోపాటు బస్సుకు స్వాగతం పలికిన ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ కార్యకర్తలను అరెస్ట్‌చేసిన కర్ణాటక పోలీసులు.. వారిపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేశారు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై శివసేన ఘాటుగా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వానిది మతితప్పిన చర్యగా అభివర్ణించింది. ఇటు కర్ణాటక మంత్రి రోషన్ బేగ్.. కన్నడ గడ్డపై మరాఠా అనుకూల నినాదాలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏమిటీ వివాదం?: మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం జిల్లాలో అత్యధికులు మరాఠీనే మాట్లాడతారు. కర్ణాటకలోని ఈ జిల్లాను విభజించి మహారాష్ట్రలో కలపాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ఆ డిమాండ్‌కు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ- శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వివాదానికి మళ్లీ జీవంపోశారు. ముంబై నుంచి బెల్గాంకు వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులపై ‘జై మహారాష్ట్ర’ నినాదాలు రాయించారు. ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇటు బెల్గాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ సంస్థ.. ‘జై మహారాష్ట్ర’ బస్సులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. బస్సు కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని 16 మందిపై దేశద్రోహం కేసులు నమోదుచేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి: సరిహద్దులోని బెల్గాం జిల్లాను మహారాష్ట్రలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శివసేన పార్టీ ప్రతినిధి నీలమ్ గోర్హే డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్లపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని ఆమె కర్ణాటకపై మండిపడ్డారు. వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తక్షణమే బెల్గాం ప్రాంతంలో పర్యటించాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా కోరింది. మహారాష్ట్రకు జై కొడితే చర్యలు: బెల్గాం సహా సరిహద్దులోని ఏ జిల్లాలోనైనా ‘జై మహారాష్ట్ర’ నినాదాలు చేసేవారిని ఉపేక్షించబోమని కర్ణాటక మంత్రి రోషన్ బేగ్ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుకానీ, ప్రభుత్వాధికారులుకానీ నినాదాలు చేసినట్లైతే పదవులు, ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని బేగ్ అన్నారు. ఈ మేరకు కఠిన చట్టం ఒకటి రూపొందించనున్నట్లు తెలిపారు.