Seemandhra Congress MLAs
-
కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్
విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానాన్ని కొప్పుల రాజు తప్పుదారి పట్టించాడని వారు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కొప్పుల రాజును ఓడించేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలను రాజ్యసభ బరిలోకి దింపేందుకు తామ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వివరించారు. దీని ద్వారా విభజనపై దూసుకు వెళ్తున్న కాంగ్రెస్‌కు షాక్ ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యులుగా హై కమాండ్ ప్రతిపాదించిన అభ్యర్థులు తప్ప ఎవరు పోటీ చేసిన తాము సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాజ్యసభకు కొప్పుల రాజును ఎన్నిక చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొప్పుల రాజులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. -
బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్ ఖరారు చేసిన బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో విభజన బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పే అభిప్రాయాల ఫార్మాట్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఖరారుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరడం, అంతేకాక విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రసంగించడం వంటివి తమ ఫార్మెట్లో బొత్స సత్య నారాయణ పొందపరిచినట్టు తెలిసింది. దీనికి సంబంధించి సభ్యులకు ఒక పేజీ ఫార్మాట్‌ను బొత్స సత్యనారాయణ పంచినట్టు సమాచారం. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. ఢిల్లీలో సమైక్యాంధ్ర ధర్నాకు శైలజానాథ్, పద్మరాజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం జరుప తలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్ ప్రతినిధులుగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్, విప్ రుద్రరాజు పద్మరాజు హాజరుకానున్నారు. ధర్నాకు సంఘీభావం తెలపాలని ఉద్యోగ సంఘాలు కోరిన మీదట తాము హాజరవ్వాలని నిర్ణయించుకున్నామని శైలజానాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. -
ఎమ్మెల్యేల వలసలతో కాంగ్రెస్‌కు నష్టమే:బొత్స
-
ఎమ్మెల్యేల వలసలతో కాంగ్రెస్‌కు నష్టమే:బొత్స
హైదరాబాద్: వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆత్మస్థైర్యం లేకే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారని ఆయన విమర్శించారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కోరినట్లు బొత్స తెలిపారు. శాంతి భద్రతలు, నిబంధనలకు లోబడి ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాంటి సమావేశాలకు ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తుందన్నారు. మనసులో ఏదో పెట్టుకునే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ విమర్శలు చేస్తున్నారన్నారు.