Seemandhra regions
-
రాష్ట్రానికి 25 కంపెనీల అదనపు బలగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీలో పరిణామాలు వేగవంతంగా సాగుతున్న క్రమంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కేంద్రం 25 కంపెనీల(ఒక్కొక్క కంపెనీలో దాదాపు 90 మంది సైనికులు లేదా భద్రతా సిబ్బంది ఉంటారు) అదనపు బలగాలను రాష్ట్రంలో మోహరించింది. ఇప్పటికే ఉన్న 60 కంపెనీల బలగాలకు ఇవి అదనంగా భద్రతా విధులు నిర్వహించనున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న దశలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు 90 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్రం అప్పట్లోనే రాష్ట్రానికి పంపింది. అయితే, రెండు నెలల కిందట జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీటిలోని 30 కంపెనీల బలగాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. కాగా, ప్రస్తుతం విభజన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ముందస్తు భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను పంపాలన్న డీజీపీ ప్రసాదరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. -
సవరణలపై నిర్ణయం.. తుది బిల్లుకు ఆమోదం!
-
జనాభా ప్రాతిపదికనే.. ఆస్తులు, అప్పుల పంపిణీ
అప్పులు రూ. 1,51,450 కోట్లు సీమాంధ్రది రూ. 85,310 కోట్లు తెలంగాణది రూ. 66,140 కోట్లు సాక్షి, హైదరాబాద్: అప్పులు, ఆస్తులు, ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో, వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను కూడా జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేయనున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా ఇదే ప్రాతిపదికన పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ. లక్షన్నర కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తం రాష్ట్రానికి చేసిన అప్పులు సుమారుగా రూ. 1,42,000 కోట్లు కాగా... విదేశీ సంస్థల నుంచి సీమాంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కలిగే ప్రాజెక్టుల కోసం రూ. 2,950 కోట్లు, తెలంగాణ జిల్లాల్లో ప్రయోజనం కలిగేవాటికి రూ. 1350 కోట్లు, కేవలం హైదరాబాద్ కోసం రూ. 4,200 కోట్లు.. మొత్తంగా రూ. 8500 కోట్లు కలిపి సుమారు రూ. లక్షన్నర కోట్ల అప్పులున్నాయి. ప్రాంతాల వారీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించి, లెక్కించగా... సీమాంధ్ర వాటా అప్పు రూ. 85,310 కోట్లు, తెలంగాణ వాటా రూ. 66,140 కోట్లుగా తేల్చారు. రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున ఆయిల్ కంపెనీలు, ఆబ్కారీ శాఖలు అన్ని జిల్లాల వ్యాట్‌ను అక్కడే చెల్లిస్తున్నారు. ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయాల్సి ఉన్నందున... ఏయే జిల్లాల్లో వినియోగానికి సంబంధించి, ఆ జిల్లాలోనే వ్యాట్ చెల్లించాలని స్పష్టం చేశారు. ఆదాయ పంపిణీని కూడా ఇరు రాష్ట్రాల మధ్య లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఆదాయం రూ. 1,27,000 కోట్లు కాగా... అందులో స్థానిక వినియోగం ఆధారంగా హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్లు, మిగతా తెలంగాణ జిల్లాల్లో రూ. 41,000 కోట్లు, సీమాంధ్రలో రూ. 66,000 కోట్లుగా తేల్చారు. -
విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 115వ రోజైన శుక్రవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. పలు జిల్లాల్లో జోరున వర్షం కురుస్తున్నా ఉద్యమం మాత్రం సడలలేదు. ఎన్జీవోలు ఓవైపు కార్యాలయాల్లో విధులకు హాజరవుతూ మరోవైపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చిత్తూరులో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. పుంగనూరులో బీసీ సంఘం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువచేస్తూ మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ నాయకులు దహనం చేశారు. అవనిగడ్డలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం భారీవర్షంలోనూ కొనసాగాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. అనేకచోట్ల గడపగడపకూ వైఎస్సార్పీపీ పేరిట పాదయాత్రలు కూడా నిర్వహించారు. మంత్రి కాసుకు సమైక్య సెగ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి సమైక్య సెగ తగిలింది. రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాసు కారు దిగి ఆందోళనకారుల వద్దకు రాగా, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నినాదాలు చేశారు. విభజనను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ప్రస్తుత సరిహద్దుల మేరకే విభజించాలి: సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పరిధిలో ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే యథాతథంగా విభజించాలంటూ సీపీఐ మంగళవారం కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) నివేదిక సమర్పించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నివేదికను ఖరారు చేసి మెయిల్ ద్వారా పంపారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ కోరినట్టుగా 11 అంశాలపై సూచనలు చేశారు. ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే ఉభయ ప్రాంతాలను విభజించాలని, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా యధాతథంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారిలో భయాందోళనలను తొలగించేలా శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలకు సమాయత్తం కండి: సురవరం పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ధన, కుల, మత ప్రభావం పెరిగినప్పటికీ సానుకూల అంశాలతో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం హైదరాబాద్ శివార్లలోని యాప్రాల్‌లో ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర సమితి సమావేశాలను సురవరం సుధాకర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు అవకాశవాద వైఖరిని అవలంభిస్తున్నాయని సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్న చంద్రబాబు ప్రస్తుతం అదే పార్టీ వైపు చూస్తున్నారంటూ ఉదహరించారు. -
ఎడ్యుకేషన్ న్యూస్
అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఏ, బీకాం, బీఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకూ పొడిగించినట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు నవంబర్ 9 నుంచి 15 వరకూ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నవంబర్ 17 నుంచి 22 వరకూ, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 24 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 24 వృత్తి విద్య కాలేజీలకు ఫీజుల ఖరారు సాక్షి, హైదరాబాద్: వ్యయ నివేదికలు సమర్పించని 24 వృత్తి విద్యా కళాశాలలకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఫీజులు నిర్ధారించని విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆయా కళాశాలలకు 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకుగాను ఏఎఫ్ఆర్సీ ఫీజును ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఎంటెక్ కళాశాలలకు ఫీజు రూ. 48,500, 8 ఎం ఫార్మసీ కళాశాలలకు రూ. 98,500, 2 బీ ఫార్మసీ కళాశాలకు ఫీజు రూ. 26,500, ఒక బీ.ఫార్మసీ కళాశాలకు రూ. 30 వేలుగా నిర్ణయించింది. ‘లైబ్రరీ సైన్స్’ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్టు ప్రజాగ్రంథాలయాల శాఖ సంచాలకులు సి.హెచ్.పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు. దరఖాస్తులను ఆయా ఇనిస్టిట్యూట్ల ప్రిన్సిపాల్స్‌కు నవంబర్ 15లోగా పంపించాలి. మార్చి 27 నుంచి టెన్త్ పరీక్షలు? సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే మార్చి 27 లేదా 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రెండు రోజులు ముందుగా మార్చి 27 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష! 10 రోజుల్లో షెడ్యూలు జారీ అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు మాధ్యమిక విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ నేపథ్యంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథితో చర్చించి పది రోజుల్లో టెట్ షెడ్యూలు జారీ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెట్ కేవలం అర్హత పరీక్షే కానీ ఉద్యోగ నియామక పరీక్ష కాదని, ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాబోవని ఆ వర్గాలు తెలిపాయి. బీఈడీ ‘థర్డ్ మెథడాలజీ’లో ప్రవేశాలకు దరఖాస్తులు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బీఈడీ కళాశాలలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న బీఈడీ థర్డ్ మెథడాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలు చేసేవారు, బీఈడీ పూర్తి చేసినవారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. నవంబర్ 23 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నేటి నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల బోధన సిబ్బంది సమ్మె విరమించడంతో శుక్రవారం నుంచి తరగతులు నిర్వహించనున్నామని సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సమైక్య ఉద్యమానికి ఊపు
-
సమైక్య ఉద్యమానికి ఊపు
* సీమాంధ్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల సమైక్య దీక్షలు ప్రారంభం * నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరశన * సంఘీభావంగా వేల మంది కార్యకర్తల దీక్షలు.. కదలివచ్చిన ఊరూవాడా సమైక్యాంధ్ర ఉద్యమంలో మరో ఘట్టం మొదలైంది. ఇప్పటివరకూ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు వంటి సాధారణ ప్రజా సమూహాలే ఉద్యమిస్తుండగా.. ఇప్పుడిక సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమ బరిలో దిగింది. దీంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమైంది. నిన్నటి వరకు పట్టణాలు, నగరాలకు పరిమితమైన సమైక్య ఉద్యమం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల దీక్షలతో మారుమూల పలెల్లలకూ విస్తరించింది. సాక్షి నెట్వర్క్: అహింసే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన గాంధీజీ స్ఫూర్తితో సమైక్య జనోద్యమానికి బాసటగా నిలవాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం గాంధీ జయంతి నాడు సీమాంధ్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నాలుగైదు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు నిరాహారదీక్షలకు దిగారు. వీరికి సంఘీభావంగా ప్రతిచోటా వందలాదిమంది కార్యకర్తలు నిరశన చేపట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా స్పష్టమైన ప్రకటన చేసి పోరుబాట పట్టిన ఏకైక ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఉద్యమబావుటా ఎగరేయడం రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డుగా ఘనతికెక్కనుంది. ఏఐసీసీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో రెండు నెలలకుపైగా ఉధతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం ఇప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షతో కొత్తరూపు సంతరించుకుంది. బుధవారం సీమాంధ్రలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షలకు మద్దతుగా సమైక్యస్ఫూర్తి సాగింది. సకలజనుల సమ్మెలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, సమైక్యమే లక్ష్యంగా పోరుబాట పట్టిన అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సమైక్య దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. జోరువర్షంలోనూ... తూర్పు గోదావరి జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదు సెంటర్లో నడిరోడ్డుపై ఎలాంటి టెంట్ లేకుండా రిలే దీక్ష చేపట్టారు. కుండపోతగా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూనే దీక్ష కొనసాగించారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు విజయనగరం జిల్లా బొబ్బిలిలో దీక్షకు కూర్చున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ 48 గంటల దీక్ష చేపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి రెండు రోజుల నిరాహారదీక్ష చేపట్టారు. కర్నూలులో భారీ ర్యాలీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఉరవకొండలో సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పుట్టపర్తిలో కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ దీక్షలు చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడి, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,. కమలాపురంలో మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షలు చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దీక్షకు కూర్చున్నారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో దీక్ష చేశారు. కొండేపిలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు దీక్షలు చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీక్షలు చేపట్టారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు జిల్లా కొడవలూరుమండలం నార్తురాజుపాళెంలో దీక్ష చేపట్టారు.